Jump to content

కైనాజ్ మోతీవాలా

వికీపీడియా నుండి
కైనాజ్ మోతీవాలా
బిగ్ స్టార్ యంగ్ ఎంటర్‌టైనర్ అవార్డ్స్ 2012లో కైనాజ్ మోతీవాలా
జననంముంబై, మహారాష్ట్ర, భారతదేశం
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు2009-2014
భార్య / భర్త
ఉర్వక్ష్ డాక్టర్
(m. 2013)

కైనాజ్ మోతీవాలా హిందీ చిత్రాలలో కనిపించిన భారతీయ నటి. ఆమె నటనా వృత్తిని 2009లో వేక్ అప్ సిద్ చిత్రంలో తాన్యా అనే చిన్న పాత్రతో ప్రారంభించింది. 2010లో వచ్చిన బాలీవుడ్ చిత్రం పాఠశాలలో షైలీ పాత్ర పోషించింది. ఆమె మాతృభాష గుజరాతీ.[1]

2011లో, ఆమె హర్రర్-థ్రిల్లర్ చిత్రం రాగిణి ఎంఎంఎస్ లో ప్రధాన మహిళా పాత్ర పోషించింది. ఆమె యూనినార్, మెక్డొనాల్డ్స్, వీడియోకాన్ మొబైల్ ఫోన్, సోనీ పిక్స్ ప్రోమో వంటి కొన్ని భారతీయ టెలివిజన్ వాణిజ్య ప్రకటనలలో కూడా కనిపించింది. ఆమె ఆరు సంవత్సరాలు షియామక్ దావర్ చేత శిక్షణ పొందింది.[2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

కైనాజ్ 2013 నవంబరు 28న ఒక పార్సీ వేడుకలో ఊర్వక్ష్ డాక్టర్ ను వివాహం చేసుకున్నది. 2016లో వారికి ఒక కుమార్తె జన్మించింది.[3][4]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనిక
2009 వేక్ అప్ సిద్ తాన్యా లాతియా తొలి సినిమా
2010 పాఠశాల షైలీ
2011 రాగిణి ఎంఎంఎస్ రాగిణి
2012 చాల్లో డ్రైవర్ తాన్యా మల్హోత్రా
2014 రాగిణి ఎంఎంఎస్ 2 రాగిణి అతిధి పాత్ర
బూచమ్మ బూచోడు శ్రావణి తెలుగు సినిమా

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం సీరియల్ పాత్ర గమనిక
2011 కిస్మత్ తాన్యా/జులేఖా కబీర్ ఖాన్ నవాబ్ కబీర్ ముబారక్ ఖాన్ కుమార్తె

మూలాలు

[మార్చు]
  1. "Chat: Kainaz Motivala from Ragini MMS". Sify. Archived from the original on 1 March 2019.
  2. "30 Facts About Kainaz Motivala". The Times of India. Retrieved 2 May 2016.
  3. "Ragini MMS actress Kainaz Motivala gets married".
  4. "Sayali Bhagat and Kainaz Motivala hitched".