Jump to content

కైమూర్ జిల్లా

వికీపీడియా నుండి
కైమూర్ జిల్లా
कैमूर ज़िला
జిల్లా
తెల్హార్ జలపాతం
తెల్హార్ జలపాతం
దేశం India
రాష్ట్రంబీహార్
ముఖ్యపట్టణంభాబువా
విస్తీర్ణం
 • Total8,268 కి.మీ2 (3,192 చ. మై)
జనాభా
 (2011)
 • Total16,26,384
Time zoneUTC+5:30 (IST)
లోక్‌సభసాసారామ్
Websitehttp://www.kaimur.bih.nic.in/
దస్త్రం:TelharFallKaimurబీహార్.jpg
Telhar Falls, Kaimur district

బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో కైమూర్ జిల్లా ఒకటి. జిల్లాకేంద్రంగా భబుయా పట్టణం ఉంది. జిల్లా వైశాల్యం 3363 చ.కి.మీ, జనసంఖ్య 1,626,384.జిల్లా దేశంలో 307వ స్థానంలో ఉంది. జిల్లా అక్షరాస్యత 69.34%. జిల్లా పాట్నా డివిజన్‌లో భాగం. ఇది రాష్ట్రంలో పశ్చిమసరిహద్దులో ఉంది.

విద్య

[మార్చు]

జిల్లాలో 18 కాలేజీలు, 58 హైస్కూల్స్, 146 మిడిల్ స్కూల్స్ మరొయు 763 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి.

జిల్లాలో

[మార్చు]

జిల్లాలో 1699 గ్రామాలు ఉన్నాయి. 120 పోస్టాఫీసులు ఉన్నాయి, 151 గ్రామపంచాయితీలు ఉన్నాయి.

చరిత్ర

[మార్చు]

కైమూర్ జిల్లా 1991 మార్చి మాసంలో రఒందించబడింది. రోహతాస్ జిల్లాలో కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లాను రూపొందించారు.[1] జిల్లాలో ఆదిమ మానవులు నివసించిన ఆధారాలు లభిస్తున్నాయి. జిల్లాలోని రెహ్డా అరణ్యాలలో ఉన్న రాతి పెయింటిగులు 20,000 సంవత్సరాలము పూర్వం నాటివని భావిస్తున్నారు. 2012 జూన్ మాసంలో పాలా సామ్రాజ్యానికి చెందిన వస్తువులు బైధ్యనాథ్ గ్రామంలో నిర్వహించిన త్రవ్వకాలలో లభించాయి.[2] ఇది ప్రస్తుతం రెడ్ కార్పెటులో భాగం..[3]

భౌగోళికం

[మార్చు]

కైమూర్ జిల్లా వైశాల్యం 3362 చ.కి.మీ.[4] ఇది రాష్యాదేశంలోని వయ్గచ్ ద్వీపం వైశాల్యానికి సమం.[5] ది కైమూర్ రేంజ్, రోహ్‌తాస్ పీఠభూమి జిల్లా దక్షిణ భూభాగాన్ని ఆక్రమించి ఉంది. జిల్లాలో కర్మానసానది, దుర్గావతి నది ప్రవహిస్తున్నాయి. జిల్లాలో 1,06,300 హెక్టార్ల వైశాల్యంలో అరణ్యం ఉంది. ఇందులో " కైమూర్ వన్యప్రాణి అభయారణ్యం ఉంది. ఇక్కడ పులులు, చిరుత పులులు, కృష్ణజింకలు ఉన్నాయి. జిల్లాలో తెల్హర్ వద్ద కర్కత్ జలపాతం ఉంది.

ఆర్ధికం

[మార్చు]

జిల్లాలో వ్యవసాయం ప్రధాన ఆధారవనరుగా ఉంది.జిల్లాలో ప్రధానంగా వరి, గోధుమలు, కూరగాయలు, నూనెగింజలు, పప్పుధాన్యాలు, మొక్కజొన్నలు మొదలైన పంటలు పండించబడుతున్నాయి. జిల్లాలో ఆయిల్ లిమిటెడ్, ఎ.సి.సి లిమిటెడ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, హైవోల్టేజ్ డైరెక్ట్ కరెంట్ (పసులి) మొదలైన పరిశ్రమలు ఉన్నాయి.

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో కైమూర్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[6] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[6]

విభాగాలు

[మార్చు]
  • ఉప విభాగాలు : మోహనియా, భబుయా
  • జిల్లాలో 11 మండలాలు ఉన్నాయి : భబుయా, రాంగర్, మొహనియా, దుర్గావతి, అధురా, భగవంత్‌పూర్, చంద్, చైన్‌పూర్, కుద్రా, రాంపూర్, నౌవన్.

ప్రయాణ సౌకర్యాలు

[మార్చు]

రైలు

[మార్చు]

జిల్లాలో ప్రధానరైలు స్టేషన్ భబుయా రోడ్డులోని మొహనియా వద్ద ఉంది. ఇది హౌరా- ఢిల్లీ గ్రాండ్ చ్రోడ్ రైలు (450 కి.మీ) మార్గంలో గయ- ముగల్ సురాయ్ విభాగంలో ఉంది. ప్రధాన రైళ్లు

  • పురుషోత్తమ్ ఎక్స్‌ప్రెస్ (12801-12802),
  • మహాబోధి ఎక్స్‌ప్రెస్ (12397-12398),
  • పూర్వ (హవ్ర దెలుక్ష్) ఎక్స్‌ప్రెస్ (12381-12383),
  • కాల్కా మెయిల్ (12312),
  • జార్ఖండ్ ఎక్స్‌ప్రెస్,
  • నీలంచల్ ఎక్స్‌ప్రెస్ (12876),
  • ముంబై మెయిల్ (12321-12322),
  • డూన్ (13009-13010)
  • చంబలే ఎక్స్‌ప్రెస్,
  • శిప్రా ఎక్స్‌ప్రెస్ (22911),
  • సీల్దా ఎక్స్‌ప్రెస్,
  • బుధ్పుర్నిమ ఎక్స్‌ప్రెస్ (15110),
  • అసన్సోల్-అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్,
  • డిక్షభూమి ఎక్స్‌ప్రెస్,
  • జోధ్పూర్ ఎక్స్‌ప్రెస్,
  • గరీబ్ ణవజ్ ఎక్స్‌ప్రెస్,
  • రాంచీ వారణాసి ఎక్స్‌ప్రెస్ (18312 18612, 18632)
  • రాంచీ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ (12877-12878)
  • శాసరం గరీబ్ రథ్ (22409-22410)
  • భబూ పాట్నా ఇంటర్సిటీ (13243-13244)
  • జార్ఖండ్ స్వరన జయంతి ఎక్స్‌ప్రెస్
  • గయా చెన్నై ఎక్స్‌ప్రెస్
  • లూధియానాబాద్ ఎక్స్‌ప్రెస్
  • జిల్లాలోని రైలు స్టేషన్లు : కరమ్‌నస (కె.ఎం.ఎస్), ధనిచ్చ (డి.సి.ఎక్స్), దుర్గావతి (డి.జి.ఒ), ముతాని (ఎం.టి.జి.ఇ), పసౌలి, కుర్దా, కె.టి.క్యూ, ఖుర్మాబాద్ రోడ్డు (కె.వి.డి), షియుసాగర్ రోడ్డు

(ఎస్.ఎస్.జి), కుమహ్ (కె.ఎం.జి.ఇ).

రహదారి

[మార్చు]
  • జాతీయరహదారి -2 మొహానియా పట్టణం గుండా పయనిస్తుంది.
  • జాతీయరహదారి -30 మొహానియాలో ఆరంభమై అర్రాహ్ ద్వారా పాట్నాతో అనుసంధానం ఔతుంది. ఇవి కాకుండా జిల్లాలో కొన్ని రాష్ట్రీయ రహదార్లు ఉన్నాయి. జిల్లా దక్షిణ ప్రాంతంలో

బక్సర్- రాంఘర్, భబుయా, అధయురా, భగవాన్‌పూర్‌లను కలిపే రాష్ట్రీయ రహదారి మార్గం ఉంది. రాష్ట్రీయ రహదారి - 14 భబుయాను మొహానియాతో అనుసంధానిస్తుంది.

  • భబుయా పట్టణానికి 14,కి.మీ దూరంలో గయా ముగల్ సురాయ్ వద్ద భబుయా రోడ్డు రైల్వే స్టేషను ఉంది.
  • ప్రముఖ ముండేశ్వరి దేవి ఆలయం (పురాతన కాలం నుండి ఉనికిలోఉన్న ఆలయం): భబుయాకు 10 కి.మీ దూరంలో ఉంది.
  • వారణాసిలోని బబత్‌పూర్ వద్ద " లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ " (వి.ఎన్.ఎస్) ఉంది.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,626,384,[7]
ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం.[8]
అమెరికాలోని. ఇడాహో నగర జనసంఖ్యకు సమం.[9]
640 భారతదేశ జిల్లాలలో. 307 వ స్థానంలో ఉంది.[7]
1చ.కి.మీ జనసాంద్రత. 488 [7]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 27.54%.[7]
స్త్రీ పురుష నిష్పత్తి. 919 [7]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 71.01%.[7]
జాతియ సరాసరి (72%) కంటే. స్వల్పంగా తక్కువ

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "History". Official Website of Kaimur. Archived from the original on 2013-12-11. Retrieved 2013-12-07.
  2. "Erotic sculptures of Pala period discovered in బీహార్ village". June 13, 2012. Archived from the original on 2013-05-06. Retrieved 2014-12-08.
  3. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Archived from the original on 2011-10-27. Retrieved 2011-09-17.
  4. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: బీహార్: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
  5. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2018-02-20. Retrieved 2011-10-11. Vaygach Island3,329km2
  6. 6.0 6.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  7. 7.0 7.1 7.2 7.3 7.4 7.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  8. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Guinea-Bissau 1,596,677 July 2011 est.
  9. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Idaho 1,567,582

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]