Jump to content

కొండపుదీనా నూనె

వికీపీడియా నుండి
కొండపుదీనా
కొండపుదీనా పూలు

కొండ పుదీనా నూనె ఒక ఆవశ్యక నూనె., సుగంధ తైలం.కొండ పుదీనాను హిందీలో పహడి పుదీనా అంటారు.ఆంగ్లంలో స్పియరు మింట్, గార్డెన్ మింట్, లాంబ్ మింట్ అంటారు.[1] కొండ పుదీనా నూనె, పుదీనా నూనె కన్నా తక్కువ గాఢత వున్న నూనె.కొండపుదీనా నూనె కూడా ఓషది గుణాలున్న నూనె.తాజా లేదా ఎండ బెట్టిన ఆకులను రకరకాల వంటల్లో సువాసనకై ఉపయోగిస్తారు.అలాగేకొన్నిరకాల మిఠాయిల్లో, పానీయాలలో, సాలాడులలో, సూప్ లలో, మీగడ, మాంస, చేప కూరల్లో, సాస్ లలో ఉపయోగిస్తారు.

కొండ పుదీనా మొక్క

[మార్చు]

కొండ పుదీనా 30 నుండి 100 సెం.మీ వరకు ఎత్తు పెరిగే ఓషధీ మొక్క.కొండ పుదీనా బహువార్షిక మొక్క. పూలు సన్నని పూలకాడల చివర పింకు లేదా తెల్లని పూలు వుండును.ఆకులు 5-9 సెం.మీ పొడవు,1.5-3 సెం., మీ వెడల్పుతో పచ్చగా వుండును.ఈ మొక్క తేమగా వున్న ప్రాంతాల్లో పెరుగుతుంది.[1] కొండ పుదీనా కాండం నలు చదరంగా వుండును. కొండ పుదీనా మొక్క లామియేసి కుటుంబానికి (పుదీనా కుటుంబం) చెందిన మొక్క.కొండ పుదీనా వృక్షశాస్త్ర పేరు మెంథా స్పికాట (Mentha spicata).కొండ పుదీనా మొక్క ఆరోమాటిక్ ఓషది మొక్క.కొండ పుదీనా మూలస్థానం ఐరోపా, ఆసియా ఖండాలు.తరువాత ఉత్తర అమెరికా., ఆఫ్రికా దేశాలకు వ్యాప్తి చెందినది.తాజా లేదా ఎండ బెట్టిన ఆకులను రకరకాల వంటల్లో సువాసనకై ఉపయోగిస్తారు.తాజా లేదా ఎండ బెట్టిన ఆకులను రకరకాల వంటల్లో సువాసనకై ఉపయోగిస్తారు.అలాగేకొన్నిరకాల మిఠాయిల్లో, పానీయాలలో, సాలాడులలో, సూప్ లలో, మీగడ, మాంస, చేప కూరల్లో, సాస్ లలో ఉపయోగిస్తారు.[2]

కొండ పుదీనాలో, పుదీనా కన్నా తక్కువ ప్రమాణంలో మెంతాల్/మెంథాల్ వుండును.పురాతన గ్రీకులు కొండ పుదీనా ఆకులను స్నానపు నీటిలో కలిపే వారు.అలాగే గనేరియా అంటుయి సంక్రమణ వ్యాధులను నివారణకు కూడా వాడేవారు.మధ్యయుగ కాలంలో పళ్ల జిగుర్ల వాపులకు,, పళ్లను తెలుపుగా మార్చుటకు ఉపయోగించేవారు[3] కొండ పుదీనా నూనె వినియోగంగురించి ఆయుర్వేద, చీనీస్,, గ్రీకు వైద్య శాస్త్రంలో ప్రస్తావించడం జరిగింది. రోమనులు ఇస్లెస్ ను జయించినపుడు కొండ పుదీనా ఇంగ్లాండుకు తీసుకురాబడింది.బ్రీటిసు వారిచే 1500 లో అమెరికాలోని వారి సెటిల్ మెంట్ /స్థావరాలకు తీసుకు రాబడింది. మధ్య యుగంలో కొండ పూడినాను ఉప్పుయో కలిపి కుక్క కరచిన కోట రాసేవారు.కొండ పోదీన ఆకుల చివరాలి ఈటె (spear0ఆకారంలో వుందటం వలన దీనిని స్పియరు మింట్ అన్నారు.[4]

నూనె సంగ్రహణ పద్ధతి

[మార్చు]

కొండపుదీనా మొక్క నుండి ఆవశ్యక నూనెను సాధారణంగా నీటి ఆవిరి స్వేదనక్రియ/స్టీము డిస్టిలేసను ద్వారా మొక్క ఆకులనుండి, పుష్పించు పైభాగాలనుండి (flowering tops) ఉత్పత్తి చేస్తారు.[3] కొండ పూదీనా నూనెను ఆకులనుండి, పుష్పించు భాగం పైభాగాలనుండి ఉత్పత్తి చేస్తారు.[4]

నూనె

[మార్చు]

కొండ పుదీనా నూనె పుదీనా వంటి గుణాలనే కల్గి ఉంది.పుదీనా నూనె కన్నా కొద్దిగా తియ్యగా వుండును.పాలిపోయిన పసుపు రంగు లేదా ఆకుపచ్చ రంగులో వుండును.కొండ పుదీనా నూనెలో హైడ్రోకార్బనులు, ఆల్కహాల్ లు, ఇస్తారులు, ఆక్సైడులు,, కోటోనులు ఉన్నాయి.[4]

నూనెలోని ప్రధాన రసాయనాలు

[మార్చు]

కొండ పుదీనా నూనెలో ప్రధానంగా ఆల్ఫా-పైనేన్/పినేన్, బీటా- పైనేన్, కార్వోన్,1,8-సినోయోల్, లినలూల్, లిమోనేన్, మైర్సేన్, కారియో పైల్లెన్,, మింథాల్ ఉన్నాయి.పుదీనా నూనెలో మింథాల్ దాదాపు 40% వరకు వుండగా, కొండ పుదీనా నూనెలో మింథాల్ 0.5% మాత్రమే ఉంది.[3]

భౌతిక గుణాలు

[మార్చు]

కొండపుదీనా నూనె భౌతిక ధర్మాల పట్టిక[5]

వరుస సంఖ్య భౌతిక గుణం మితి
1 రంగు పసుపు లేదా వర్ణ రహితం
2 విశిష్టగురుత్వం,25.00 °C వద్ద 0.91700 - 0.93400
3 వక్రీభవన సూచిక, 20.00 °C వద్ద 1.47900 - 1.48900
4 బాష్పీభవన ఉష్ణోగ్రత 220.00 °C. 760.00 mm Hgవద్ద
5 ఫ్లాష్ పాయింట్ 142.00 °F
6 పాడవకుండా నిల్వ వుండు సమయం 24 నెలలు

కొండపుదీనా నూనె ఉపయోగాలు

[మార్చు]
  • పుదీనా నూనె అంత ప్రసిద్ధి కాక పోయిన కొండపుదీనా నూనె తక్కువ ఘాటైన నూనె కావడం వలన చిన్న పిల్లలకు వాడుటకు అనుకూలమైన నూనె.జీర్ణ వ్యవస్థ పని తీరును మెరుగు పరుస్తుంది.మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.వాంతులను వికారాన్ని తగ్గిస్తుంది.అలాగే శ్వాసకోశ ఇబ్బందులను తగ్గిస్తుంది.దగ్గు, ఆస్త్మా, సైనస్ రుగ్మతలకు బాగా పని చేయును.అల్లాగే మెదడును ఉత్తేజ పరుస్తుంది.
  • నూనెలోని కారియోపిల్లెన్, మైర్సేన్, మెంథాల్ లు నూనెకు యాంటి సెప్టిక్ (కుళ్లి పోకుండ నివారించు) గుణాన్ని కల్గిస్తున్నాయి.[6]
  • ఆరోమా థెరపీలో ఉపయోగిస్తారు.
  • సూక్మక్రిముల నాశనిగా (బాక్టిరియా శిలీంధ్ర నాశనిగా) పనిచేయును.[6]

బయటి లింకుల వీడియో లింకులు

[మార్చు]

ఇవికూడా చూడంది

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "spearmint". flowersofindia.net. Archived from the original on 2015-06-01. Retrieved 2018-10-12.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Spearmint". britannica.com. Archived from the original on 2016-06-17. Retrieved 2018-10-12.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. 3.0 3.1 3.2 "Spearmint essential oil information". essentialoils.co.za. Archived from the original on 2018-03-31. Retrieved 2018-10-12.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. 4.0 4.1 4.2 "Spearmint oil". articles.mercola.com. Archived from the original on 2018-07-09. Retrieved 2018-10-13.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "spearmint oil". thegoodscentscompany.com. Archived from the original on 2018-03-14. Retrieved 2018-10-13.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. 6.0 6.1 "The Gentler Mint: Your Guide to Everything About Spearmint Essential Oil". aromafoundry.com. Archived from the original on 2018-10-13. Retrieved 2018-10-13.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)