Jump to content

కొండా లక్ష్మారెడ్డి

వికీపీడియా నుండి
కొండా లక్ష్మారెడ్డి
కొండా లక్ష్మారెడ్డి


పదవీ కాలం
1983  1985
ముందు సి.ప్రతాప్ లింగం
తరువాత పి.ఇంద్రారెడ్డి
నియోజకవర్గం చేవెళ్ళ

వ్యక్తిగత వివరాలు

జననం 1940
తెలంగాణ రాష్ట్రం,
మరణం 2025 అక్టోబరు 13
హైదరాబాదు
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ

కొండా లక్ష్మారెడ్డి (1940 - 2025 అక్టోబరు 13) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1983 నుండి 85 వరకు చేవెళ్ల నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. కొండా లక్ష్మారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి మనమడు.

రాజకీయ జీవితం

[మార్చు]

కొండా లక్ష్మారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1983లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో చేవెళ్ళ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి లోక్ దళ్ అభ్యర్థి పి.ఇంద్రారెడ్డిపై 1,121 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆ తరువాత, ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఏపీసీసీ ప్రతినిధిగా, గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్ గా వివిధ హోదాల్లో పని చేశాడు.

కొండా లక్ష్మారెడ్డి 1999, 2014లలో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు.

ఇతర పదవులు

[మార్చు]

కొండా లక్ష్మారెడ్డి జర్నలిజం పట్ల మక్కువతో 1980లో స్థానిక వార్తా సంస్థ అయిన ఎన్ఎ‌స్‌ఎస్‌ (న్యూస్ అండ్‌ సర్వీసెస్ సిండికేట్)ను ప్రారంభించాడు. ఆయన జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ లకు అధ్యక్షుడిగా పని చేశాడు.

మరణం

[మార్చు]

కొండా లక్ష్మారెడ్డి 84 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2025 అక్టోబరు 13న మరణించాడు.[1][2][3][4]

మూలాలు

[మార్చు]
  1. "మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత". Andhrajyothy. 13 October 2025. Archived from the original on 13 October 2025. Retrieved 13 October 2025.
  2. "చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత". NT News. 13 October 2025. Archived from the original on 13 October 2025. Retrieved 13 October 2025.
  3. "చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత". V6 Velugu. 13 October 2025. Archived from the original on 14 October 2025. Retrieved 14 October 2025.
  4. "Former Chevella MLA and NSS MD Konda Lakshma Reddy passes away" (in Indian English). The Hindu. 13 October 2025. Archived from the original on 14 October 2025. Retrieved 14 October 2025.