Jump to content

కొండిపర్రు

అక్షాంశ రేఖాంశాలు: 16°19′35.292″N 80°58′56.136″E / 16.32647000°N 80.98226000°E / 16.32647000; 80.98226000
వికీపీడియా నుండి
కొండిపర్రు
పటం
కొండిపర్రు is located in ఆంధ్రప్రదేశ్
కొండిపర్రు
కొండిపర్రు
అక్షాంశ రేఖాంశాలు: 16°19′35.292″N 80°58′56.136″E / 16.32647000°N 80.98226000°E / 16.32647000; 80.98226000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకృష్ణా
మండలంపామర్రు
విస్తీర్ణం4.01 కి.మీ2 (1.55 చ. మై)
జనాభా
 (2011)
1,595
 • జనసాంద్రత400/కి.మీ2 (1,000/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు798
 • స్త్రీలు797
 • లింగ నిష్పత్తి999
 • నివాసాలు477
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్521157
2011 జనగణన కోడ్589580

కొండిపర్రు, కృష్ణా జిల్లా, పామర్రు మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన పామర్రు నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గుడివాడ నుండి 18 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 477 ఇళ్లతో, 1595 జనాభాతో 401 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 798, ఆడవారి సంఖ్య 797. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 577 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 70. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589580[2].సముద్రమట్టానికి 9 మీ.ఎత్తులో ఉంది.పామర్రు, గుడ్లవల్లేరు నుండి రోడ్ద్దు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 45 కి.మీదూరంలో ఉంది.

కొండిపర్రు గ్రామ చరిత్ర

[మార్చు]

నేను చదివిన పామర్రు మండల చరిత్ర పుస్తకం ప్రకారం, పూర్వం ఈ గ్రామంలో కొండిపర్తి వంశస్తులతో అంటే 3 శతాబ్దాల క్రిందట బ్రాహ్మణులూ దీనిని అగ్రహారంగా ఏర్పాటు చేసుకున్నారు అందువల్ల ఈ గ్రామం, "కొండిపర్రు"గా పిలవబడింది. కౌండిన్య శాస్త్రి అనే పండితుడు తన పరివారంతో ఈ గ్రామంలో తొలత నివసిస్తూ కౌండిన్యపురిగా ఏర్పాటుకు దోహదపడినట్లు తెలుస్తోంది. స్వాతంత్ర్య సమరంలో మార్తి రామయ్య పాల్గొని ప్రసిద్ధి గాంచారు. హరికథా పితామహులు పొడుగు పండురంగాదాసు గజారోహణం, గండపిండేరంతో సత్కరింపబడి జాతీయ స్థాయలో గుర్తింపు పొందారు. 1850 లో కాశీ నుంచి తీసుకువచ్చి శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించి శివలింగ ప్రతిష్ఠ గావించారు.ఈ గ్రామంలో పూర్వం వెంకటరామ సిద్దశ్రమం వుండేది.అక్కడ ఆయుర్వేద వైద్యం,యోగ గురూజీ నిర్వహించేవారు.సినీ,నాటక, రంగస్థల సంగీత దర్శకుడుగా మార్తి సీతారామయ్య మృదంగ ఘనపతిగా నమ్మగడ్డ పరదేశి ఈ గ్రామానికి చెందినవారే.పోలీసు శాఖలో జి.తిలక్ ప్రముఖ అధికారిగా ఉన్నారు. సూర్యనారాయణ బొమ్మల తయారీలో ప్రసిద్ధి గాంచారు.గ్రామానికి సమీపంలోని వీరాంజనేయ పురానికి చెందిన ఆరేపల్లి నాగ రాజు సిద్దాంతి నేతృత్వంలో శ్రీ గణపతి లక్ష్మి సరస్వతి మూర్తుల ఎకపీట దేవాలయం 12 -2 -2001న శంకుస్థాపన జరిగి 7-4-2003 న ప్రారంభోత్సవం జరిపారు.

సినీ, రంగస్థల, టి.వి.నటుడైన సాక్షి రంగారావు గారు కూడా ఈ గ్రామానికి చెందినవారే. 1927 లో బాపట్లకు చెందిన భైరవపట్ల వంశీయలు అంజనేయ పరమహంస అనే అవధూతచే మామిడితోటలో ఆంజనేయస్వామిని ప్రతిష్ఠించారు. వారి శిష్యులు మధుసూదనరావు గారు 1977 లో గుడి కట్టించారు. అనంతరం 1986 లో ఆరేపల్లి నాగరాజు గుడి పున:నిర్మాణం చేపట్టి మామిడితోటలో మారుతీ భాక్తులుకు నేలవుగా ఆలయాన్ని తీర్చిదిద్దారు. గాంధేయవాది యలమంచిలి వెంకటేశ్వర రావు కృషి ఫలితంగా "విద్యావనం పబ్లిక్ ట్రస్టు", అనే హిందీ పాఠశాలా,గ్రామీణ కుటీర పరిశ్రమల సంస్థ ఏర్పడింది. ప్రస్తుతం ఇప్పుడు పుట్టకొక్కుల కేంద్రంగా ఉంది. ఈ గ్రామానికి చెందిన మార్తి గంగాధరశాస్త్రి, ఉప్పలపాటి సత్యనారాయణ, సింగవరపు వీరభద్రయ్య గార్ల సహకారంతో 1947 జూలై 14 వ తేదిన విద్యావనం నిర్మాణానికి యలమంచిలి వెంకటేశ్వరరావు గారు శ్రీకారం చుట్టి దినదిన ప్రవర్ధమానం చేసి జాతీయోద్యమానికి కృషి చేశారు.ఈ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బొమ్మారెడ్డి కోటిరెడ్డి సమీప బంధువు గుజవర్తి శ్రీరామకృష్ణారెడ్డి (USA )వితరనత్వంతో గ్రామంలో 7వ తరగతి అత్యుత్తమ విద్యార్థులకు శాశ్వతంగా ఉపకారవేతనం ఇచ్చి పామర్రు ఉన్నత పాఠశాల నిర్మాణానికి భూరి విరాళాలు ఇచ్చి పేరు గాంచారు.

సమీప గ్రామాలు

[మార్చు]

గుడివాడ, పెడన, మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్

సమీప మండలాలు

[మార్చు]

పమిడిముక్కల, పెదపారుపూడి, గుడివాడ, గుడ్లవల్లేరు

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉన్నాయి.బాలబడి, మాధ్యమిక పాఠశాల‌లు పామర్రులో ఉన్నాయి.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల పామర్రులోను, ఇంజనీరింగ్ కళాశాల గుడ్లవల్లేరులోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల విజయవాడలోను, పాలీటెక్నిక్‌ పామర్రులోను, మేనేజిమెంటు కళాశాల గుడివాడలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల పామర్రులోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు విజయవాడలోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

సమీప ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పశు వైద్యశాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్ ఉంది. పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.

సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రభుత్వ రవాణా సంస్థ బస్సు సౌకర్యం, ప్రైవేటు బస్సు సౌకర్యం మొదలైనవి గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

రాష్ట్ర రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 12 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

కొండిపర్రులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 52 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 348 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 167 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 181 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

కొండిపర్రులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 181 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

కొండిపర్రులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, మినుము

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ గుజవర్తి ఉదయభాస్కరరెడ్డి, సర్పంచిగా ఎన్నికైనారు. [4]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ భ్రమరాంబాసమేత శ్రీ మల్లేశ్వరస్వామివారి దేవాలయం:ఈ దేవాలయంలో, 2014,ఏప్రిల్-14న స్వామివారి కళ్యాణం నిర్వహించెదరు. [2]ఈ ఆలయానికి 2016 కృష్ణానదీ పుష్కర నిధులు 20 లక్షల రూపాయలతో అభివృద్ధిపనులు నిర్వహించుచున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గాలిగోపురం ప్లాస్టరింగ్, ఆలయం చుట్టూ ప్రహరీ నిర్మాణం, వాహనశాల నిర్మాణం చేపట్టెదరు. ఈ పనులుగాక దాతల సహకారంతో నవగ్రహ మంటపం, భోజనశాల కొరకు ఒక షెడ్డ్ నిర్మించనున్నారు. [6]

శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం:ఈ ఆలయంలో 2017,మాఎచ్-26వతేదీ ఆదివారంనాడు, అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి జలాభిషేకం నిర్వహించి, పసుపు, కుంకుమలతో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ గ్రామోత్సవంలో భక్తులు అమ్మవారికి వేపాకు, పసుపు కలిపిన నీరు వారపోసి, టెంకాయలు సమర్పించారు. [7]

గ్రామంలో ప్రధాన పంటలు

[మార్చు]

వరి, కొబ్బరితోటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం

గ్రామ ప్రముఖులు

[మార్చు]
  • జ్యోశ్యుల పరబ్రహ్మశాస్త్రి పాకశాస్త్ర ప్రవీణులు. జింటాన్ శాస్త్రి గా చిరపరిచితులు. [5]
సాక్షి రంగారావు- తెలుగు సినిమా నటుడు

గ్రామ విశేషాలు

[మార్చు]

కొండిపర్రు గ్రామానికి చెందిన శ్రీ అల్లాడ వెంకటసుబ్బారావు, ధనలక్ష్మి దంపతులు, అతిపేద కుటుంబానికి చెందినవారు. వీరి కుమార్తె, రేణుకా తేజస్వి, పామర్రు మండల కేంద్రంలోని కంచర్ల రామారావు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో, 2014-15 విద్యా సంవత్సరంలో, 10వ తరగతి చదివినది. ఆ పరీక్షా ఫలితాలలో ఆమె 9.7/10 గ్రేడ్ మార్కులు సంపాదించి, తన తల్లిదండ్రులకూ, గ్రామానికీ పేరుతెచ్చింది. [3]

గణాంకాలు

[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1637.[3] ఇందులో పురుషుల సంఖ్య 809, స్త్రీల సంఖ్య 828, గ్రామంలో నివాసగృహాలు 462 ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-11.

వెలుపలి లింకులు

[మార్చు]

[2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014;ఏప్రిల్-14; 1వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015,మే-27; 38వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2015,ఆగస్టు-18; 24వపేజీ. [5] ఈనాడు కృష్ణా; 2016,ఫిబ్రవరి-6; 16వపేజీ. [6] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,అక్టోబరు-6; 1వపేజీ. [7] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,మార్చి-27; 1వపేజీ.