కొండేపూడి నిర్మల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొండేపూడి నిర్మల తెలుగు రచయిత్రి. ఆమె రాసిన "సందిగ్ధ సంధ్య" పుస్తకానికి గానూ ఆమెకు ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం 1988లో వచ్చింది. ఉమ్మడిశెట్టి సాహిత్య రజతోత్సవ పురస్కారం - 2012 కోసం ప్రముఖ స్త్రీవాద కవయిత్రి శ్రీమతి కొండేపూడి నిర్మల గారి 'నివురు' కవిత్వం ఎంపికైంది.[1]

జీవిత విశేషాలు[మార్చు]

కొండేపూడి నిర్మల ప్రముఖ స్త్రీవాద కవయిత్రి. ఈమె కవిత్వం ఎంతోమందిని ప్రభావితం చేసింది. అప్పటివరకూ అంటరానివిగా మిగిలిపోయిన ఎన్నో కొత్త వస్తువులను స్వీకరించి, కవిత్వం రాసినవారిలో కొండేపూడి నిర్మలని ట్రెండ్‌ సెట్టర్‌గా అభివర్ణించవచ్చు. ఈమె కలంలోంచి తొణికిన ఏ రచనని పరిశీలించినా గాని ఒక ఆర్తితో కూడిన తీవ్రత కనబడుతుంది. ఈమె కవిత్వంలోనే కాదు ఇతర సాహితీ ప్రక్రియల్లో కూడ తనదైన ముద్రవేశారు. కవిత్వంలో గాఢతలాగే వచనంలో వ్యంగ్యం, హాస్యం ఈమె ప్రత్యేకతలు.

పుస్తకాలు[మార్చు]

సందిగ్ధ సంధ్య, నడిచే గాయాలు, బాధాశప్తనది, మల్టీనేషనల్‌ ముద్దు, నివురు. అనేకానేక రూపాలలో పార్శ్వాలలో స్త్రీలను వెన్నంటి ఉండే ధ్వైదీభావాన్ని కొండేపూడి నిర్మలగారు ప్రతిభావంతంగా అనేక కవితల్లో ఎరుకపరిచారు.[2]

పురస్కారాలు[మార్చు]

ఈమె తాపీ ధర్మారావు స్మారక బహుమతి, ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు, నూతలపాటి గంగాధరం అవార్డ్, కుమారన్ ఆశాన్ జాతీయ బహుమతి, దేవులపల్లి కృష్ణశాస్త్రి అవార్డ్, బి.ఎన్. రెడ్డి సాహితీ అవార్డు, ఎస్.బి.ఆర్ అవార్డ్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డ్ వంటి పురస్కారాలు ఎన్నో పొందారు.[3]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]