కొండేపూడి లక్ష్మీనారాయణ
Jump to navigation
Jump to search
కొండేపూడి లక్ష్మీనారాయణ కవి, రచయిత. ఇతడు పశ్చిమ గోదావరి జిల్లా, బొండాడ గ్రామంలో 1918, సెప్టెంబర్ 4న జన్మించాడు.
రచనలు
[మార్చు]- కొండేపూడి స్మృతులు - గీతాలు
- పాడరా ఓ తెలుగువాడా!
- తండ్రులూ–కొడుకులూ (నవల, అనువాదం) రష్యన్ మూలం:ఇ.తుర్గేనెవ్
- సాంకేతిక పదకోశం
- మార్క్స్ ఏంగెల్స్ సంకలిత రచనలు (అనువాదం)
- ఒక అడుగు ముందుకి రెండు అడుగులు వెనక్కి:మన పార్టీలో సంక్షోభం (అనువాదం) రష్యన్ మూలం: లెనిన్
- మంచి మనిషి (నాటకం)
- సోవియట్ శాస్త్ర పరిశోధనలు
- రాజ్యమూ విప్లవమూ:విప్లవ గుణపాఠాలు (అనువాదం) మూలం: ఫ్రెడరిక్ ఎంగెల్స్
- మార్క్స్ పెట్టుబడి గురించి (అనువాదం) మూలం: ఫ్రెడరిక్ ఎంగెల్స్
- ప్రేమ కోసం, భూమి కోసం (అనువాదం) మూలం:యాసర్ కెమాల్
- జోసెఫ్ స్టాలిన్ (అనువాదం) మూలం:ఐవర్ గోల్డ్‌స్మిత్ శామ్యూల్
- వి.ఐ.లెనిన్ ఎత్తుగడల గురించిన లేఖలు:వ్యాసావళి
- వి.ఐ.లెనిన్ సహకారం గురించి:వ్యాసావళి
- కమ్యూనిజం: ప్రశ్నలు జవాబులు (అనువాదం) మూలం: కార్ల్ మార్క్స్
- స్వర్ణపిశాచి నగరం: అమెరికాను గురించిన పాంప్లెట్లు,వ్యాసాలు, లేఖలు (అనువాదం: మాగ్జిం గోర్కీ)
- అంతర్జాతీయ కమ్యూనిస్టు పార్టీ పంథా స్టాలిన్, డిమిత్రోవ్ అంతర్జాతీయ కమ్యూనిస్టు పార్టీ (అనువాదం) మూలం: పూరన్ చంద్ర జోషి
- అక్టోబరు సోషలిస్టు మహా విప్లవం
- మార్క్సిజం చారిత్రకాభివృద్ధిలో కొన్ని విశిష్ట లక్షణాలు: వ్యాసావళి (అనువాదం) మూలం: లెనిన్
- క్రెమ్లిన్ గంటలు (నాటకం)
రాజకీయరంగం
[మార్చు]ఇతడు కమ్యూనిస్టు పార్టీ పట్ల ఆకర్షితుడై ఆ పార్టీ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నాడు.
సినిమారంగం
[మార్చు]ఇతడు చలనచిత్ర రంగంలో ప్రవేశించి కొన్ని సినిమాలకు సంభాషణలు, పాటలు రచించాడు.
ఇతడు పనిచేసిన తెలుగు సినిమాలు:
- అంతా మనవాళ్లే (1954)
- జ్యోతి (1954)
- రోజులు మారాయి (1955)
- చిట్టి తమ్ముడు (1962)
- ఇరుగు పొరుగు (1963)
- కిలాడి సింగన్న (1971)