కొండేపూడి శ్రీనివాసరావు
కొండేపూడి శ్రీనివాసరావు అభ్యుదయ రచయిత, ఇండో సోవియట్ కల్చరల్ సొసైటి(ఇస్కస్) నిర్మాత,బహుభాషా కోవిదుడు,వ్యాపారవేత్త.అంతర్జాతీయ శాంతి కాముకుడు.
జీవిత విశేషాలు
[మార్చు]ఇతడు పశ్చిమ గోదావరి జిల్లా, కాళ్ళ మండలం బొండాడ గ్రామంలో సెప్టెంబరు 4, 1924న జన్మించాడు. ఇతడు పోలాండ్ దేశంలోని వార్సా విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రానిక్స్ పట్టభద్రుడయ్యాడు.విదేశీ కమ్యూనిస్టు సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించాడు.గుంటూరు జిల్లా అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షునిగా పనిచేశాడు. అరసం రాష్ట్రశాఖకు కార్యవర్గ సభ్యుడిగా ఉన్నాడు. రాష్ట్రంలో ఇండో సోవియట్ కల్చరల్ సొసైటిని స్థాపించాడు. ఇండో జి.డి.ఆర్.మిత్రమండలి జాతీయ సమితి కార్యదర్శిగా పనిచేశాడు. ఇండియన్ టొబాకో అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. బల్గేరియా మిత్ర సంఘం, శాంతి సంఘీభావ సమితి మొదలైన సంస్థల నాయకుడిగా కృషి చేశాడు. పులుపుల వెంకటశివయ్య సాహిత్య అవార్డును పొందారు.ఇతడు 1985, జూలై 22న మరణించాడు. ఇతని మరణానంతరం అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు జిల్లాశాఖ పెనుగొండ లక్ష్మీనారాయణ సంపాదకత్వంలో "స్మృతిరేఖలు" పేరుతో ఒక స్మారక సంచికను ప్రచురించింది. ఈ సంస్థ 1986 నుండి ఈయన పేరుతో కొండేపూడి సాహిత్య అవార్డులు ప్రకటిస్తున్నది.
కొండేపూడి సాహిత్య అవార్డు గ్రహీతలు
[మార్చు]అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు శాఖ కొండేపూడి శ్రీనివాసరావు మరణానంతరం అతని స్మృత్యర్థం 1986 నుండి 2016 వరకు కొండేపూడి సాహితీసత్కారాన్ని అతని కుటుంబ సభ్యుల సహకారంతో ప్రదానం చేసింది. ఈ సత్కారాన్ని పొందిన సాహితీవేత్తలు:[1]
- ఆవంత్స సోమసుందర్ - 1986
- చాగంటి సోమయాజులు - 1987
- బొల్లిముంత శివరామకృష్ణ - 1988
- గజ్జెల మల్లారెడ్డి - 1989
- మధురాంతకం రాజారాం - 1990
- మానేపల్లి హృషీకేశవరావు - 1991
- కాళీపట్నం రామారావు - 1992
- బూదరాజు రాధాకృష్ణ - 1993
- శీలా వీర్రాజు - 1994
- పోరంకి దక్షిణామూర్తి - 1995
- వల్లంపాటి వెంకటసుబ్బయ్య - 1996
- పి.సత్యవతి - 1997
- పోలవరపు కోటేశ్వరరావు - 1998
- చందు సుబ్బారావు - 1999
- రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి - 2000
- దేవీప్రియ - 2001
- వివినమూర్తి - 2002
- శాంతి నారాయణ - 2003
- చాగంటి తులసి - 2004
- ఎండ్లూరి సుధాకర్ - 2005
- కందిమళ్ల ప్రతాపరెడ్డి - 2006
- అట్టాడ అప్పల్నాయుడు - 2007
- శశిశ్రీ - 2008
- సుద్దాల అశోక్ తేజ -2009
- అదృష్టదీపక్ - 2010
- వేదగిరి రాంబాబు - 2011
- తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి - 2012
- వి.చంద్రశేఖరరావు - 2013
- సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి - 2014
- వావిలాల సుబ్బారావు - 2015
- నిడమర్తి నిర్మలాదేవి - 2016
రచనలు
[మార్చు]- సంసార సుఖం(అనువాద నవల) నిడమర్తి ఉమా రాజేశ్వరరావుతో కలిసి (మూలం- టాల్స్టాయ్)
- క్రోధం (అనువాదం) మూలం - సెవరినా స్మాగ్లెవ్స్కా
- బల్గేరియా కవిత - పరుచూరి రాజారామ్, పెనుగొండ లక్ష్మీనారాయణలతో కలిసి
- పలనాడు వెలనాటి మాగాణిరా - పరుచూరి రాజారామ్, పులుపుల వెంకటశివయ్య, గజ్జెల మల్లారెడ్డితో కలిసి.
- చిట్టగాంగ్ విప్లవవీరులు - కల్పనాదత్, నిడమర్తి ఉమా రాజేశ్వరరావు, అనిసెట్టిలతో కలిసి.
- సృష్టిలో తీయనిది స్నేహమేనోయ్
పురస్కారాలు
[మార్చు]- 1974లో సృష్టిలో తీయనిది స్నేహమేనోయ్ అనే రచనకు సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు పురస్కారం.
- సోవియట్ అర్మేనియాపై జరిగిన అంతర్జాతీయ క్విజ్ పోటీలో ద్వితీయ బహుమతి.
- జర్మన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ సొసైటీ ఫర్ ఫ్రెండ్‌షిప్ వారిచే బంగారు పతకం.
వనరులు
[మార్చు]- స్మృతిరేఖలు (కొండేపూడి శ్రీనివాసరావు సంస్మరణ సంచిక) - సంపాదకుడు: పెనుగొండ లక్ష్మీనారాయణ - ప్రచురణ:అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ.
బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ పెనుగొండ లక్ష్మీనారాయణ (జనవరి 2020). గుంటూరుసీమ సాహిత్యచరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ. pp. 283–284.