Jump to content

కొట్టక్కల్ చంద్రశేఖరన్

వికీపీడియా నుండి
2017 మార్చిలో అర్జునుడుగా కొట్టక్కల్ చంద్రశేఖరన్

కొట్టక్కల్ చంద్రశేఖరన్ (1945 జనవరి 15 - 2019 సెప్టెంబరు 4) కేరళకు చెందిన కథాకళి కళాకారుడు.[1][2] ఆయన 2006లో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత.

జీవిత చరిత్ర

[మార్చు]

1945లో పాలక్కాడ్ జిల్లా పట్టాంబి సమీపంలోని నడువట్టంలో జన్మించిన ఆయన పద్మశ్రీ వజెంకాడ కుంచు నాయర్, కొట్టక్కల్ కృష్ణంకుట్టి నాయర్‌ల శిష్యుడు. ఆయన తండ్రి ఎఎమ్ కుమారస్వామి భట్టతిరిపాద్, తల్లి పివి పారుక్కుట్టి వారస్సియర్.

కొట్టక్కల్‌లోని పిఎస్‌వి నాట్యసంఘంనకు చెందిన చంద్రశేఖరన్, 1996 నుండి దాని ప్రిన్సిపాల్‌గా ఉన్నాడు. ఆయన నలుడు, భీమసేనుడు, అర్జునుడు, రావణుడు, దుర్యోధనుడు, కీచకుడు వంటి పాత్రలను పోషించి ప్రసిద్ది చెందాడు. ఆయన కేరళలోని దేవాలయాలు, క్లబ్‌లలో పలు కథాకళి ప్రదర్శనలు ఇచ్చాడు. కథాకళి మహోత్సవం, ఆసియాడ్ (1982)లతో పాటు ఆయన, ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, సూరత్, బెంగళూరు, భోపాల్, ఆంధ్రప్రదేశ్ (పుట్టపర్తి), మద్రాస్ వంటి ఇతర ప్రదేశాలలో వివిధ కార్యక్రమాలు నిర్వహించాడు. ఆయన దేశంలోనే కాకుండా మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, చైనా, కొరియా, హాంకాంగ్, స్విట్జర్లాండ్ వంటి విదేశాలలో ప్రదర్శనలు ఇచ్చాడు.

మూలాలు

[మార్చు]
  1. "Kottakkal Chandrasekharan passes away". The Hindu. 4 September 2019.
  2. Article Title[usurped]