కొడగు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  ?కొడగు (కూర్గ్)
కర్ణాటక • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 12°25′15″N 75°44′23″E / 12.4208°N 75.7397°E / 12.4208; 75.7397Coordinates: 12°25′15″N 75°44′23″E / 12.4208°N 75.7397°E / 12.4208; 75.7397
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 4,102 కి.మీ² (1,584 చ.మై)
ముఖ్య పట్టణం మడికేరి
తాలూకాలు మడికేరి, సోంవార్‌పేట, విరాజ్‌పేట్
జనాభా
జనసాంద్రత
5,48,561 (2001 నాటికి)
• 134/కి.మీ² (347/చ.మై)
అధికార భాష కన్నడ, కొడవ తక్క్
డిప్యుటీ కమీషనర్ కె.ఆర్.నిరంజన్
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్
వాహనం

• 571201 (మడికేరి)
• ++ 91 (0) 8272
• KA-12
వెబ్‌సైటు: www.kodagu.nic.in

కొడగు (కన్నడ: ಕೊಡಗು) కర్ణాటక రాష్ట్రములోని జిల్లా. కొడగు యొక్క ఆంగ్లీకరణ అయిన కూర్గ్ పేరుతో ప్రసిద్ధమైనది. నైఋతి కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో ఈ జిల్లా 4.100 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. 2001 జనగణన ప్రకారం జిల్లా జనాభా 5, 48, 561. అందులో 13.74% జనాభా జిల్లాలోని పట్టణప్రాంతాలలో నివసిస్తున్నారు. కొడగు జిల్లా యొక్క ముఖ్యపట్టణం మడికేరి. ఈ జిల్లాకు వాయువ్యాన దక్షిణ కన్నడ జిల్లా, ఉత్తరాన హసన్ జిల్లా, తూర్పున మైసూరు జిల్లా, నైఋతిన కేరళ రాష్ట్రంలోని కన్నూరు జిల్లా, దక్షిణాన వైనాడ్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

ఇది కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమతీరంలో ఉండే కొండలు, అడవులతో నెలకొని ఉంటుంది. కనుచూపు మేరలో ఎటుచూసినా కాఫీ తోటలు, మిరియాలు, యాలకుల తోటలతో సుమనోహరంగా ఉంటుందీ ప్రాంతం.

ఈ ప్రాంతం నంచి ఎటువైపు చూసినా కాఫీ తోటలు, ఆ తోటల మధ్యలో నివాసం ఏర్పరుచు కున్న ప్రజలు అగుపిస్తారు. ఇక ఏ రుతువులో నయినా సరే, ఉష్ణోగ్రత 20-25 డిగ్రీలకు మించని కొడగు ప్రాంతంలో మనకు తెలియకుండానే కాలం ఇట్టే హాయిగా గడచిపోతుంది. ఎక్కడికెళ్లినా పచ్చదనం, నీలి ఆకాశం దానికింద పెద్ద పెద్ద లోయ లు, ఆ లోయలలో ప్రవహించే అందమైన సెలయేర్లు, అక్కడక్కడా జలపాతాలు పర్యాటకు లను విశేషంగా ఆకట్టుకుంటాయి.

కొడగు ప్రాంతం లోనే కావేరీ నది జన్మించింది. కావేరీ నదీ ప్రవాహం ఆధారంగా చేసుకుని ఆ ప్రాంతంలో ఎన్నెన్నో విహార యాత్రా స్థలాలు రూపుదిద్దుకు న్నాయి.కావేరీ నదిలో నౌకా విహారం, ఏనుగుల మందల షికారు, గిరిజనుల ఉత్సవాలు... మొదలయిన వాటినన్నింటినీ కలగలిపి చూడాలంటే, నాలుగైదు రోజులకు మించే సమయం పడుతుంది.


"https://te.wikipedia.org/w/index.php?title=కొడగు&oldid=3537044" నుండి వెలికితీశారు