కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం
కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:హన్మకొండ
ప్రదేశం:కొత్తకొండ
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:వీరభద్రస్వామి దేవాలయం
నిర్మాణ శైలి:దక్షిణ భారతదేశం

కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా, హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం, భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ గ్రామంలో ఉన్న ఆలయం.[1]

చరిత్ర[మార్చు]

క్రీ.శ.1600వ సంవత్సరం కాలంలో వంట చెరుకు కోసం కొందమంది కుమ్మరులు ఎడ్లబండ్లతో కొండపైకి వెళ్లారు. వంట చెరుకు దొరికిన తరువాత అలసిపోయిన కుమ్మరులు నిద్రపోయారు. కాసేపటి తరువాత లేచి చూడగా, ఎడ్లు కనబడకపోవడంతో రాత్రి అక్కడే పడుకున్నారు. ఆ రాత్రి వారికి వీరభద్రుడు కలలో కనిపించి గుట్టపై నుంచి కిందికి దించి అక్కడ ఆలయంలో ప్రతిష్టిస్తే వారి ఎడ్లు దొరుకుతాయిని చెప్పడంతో, గుట్ట కింద వీరభద్రస్వామిని ప్రతిష్టించినట్లు, ఈ క్రమంలో స్వామివారి కాలు విరిగినట్లు స్థానికులు తెలుపుతుంటారు.

జాతర[మార్చు]

కాకతీయుల కాలం నాటి ఈ దేవాలయం రాళ్ళ మధ్య నిర్మించబడింది. ఇలాంటి శిలామయమైన ప్రదేశంలో కూడా ఐదు కొలనులు నిత్యం నీటితో నిండి ఉండటం వీరభద్రస్వామి మహత్యమే అని గ్రామ ప్రజలు చెప్పుకుంటారు. ప్రతి సంవత్సరము జనవరి నెలలో సంక్రాంతి ముందురోజు ఇక్కడ జాతర జరుగుతుంది. ఈ జాతర ప్రాధాన ఆకర్షణ సంక్రాంతి రోజున ప్రజలు ఎద్దుల బండ్లలో వచ్చి మొక్కులు సమర్పిస్తారు. ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమినాడు 10 రోజులపాటు స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది.

జనవరి 10న శ్రీ వీరభద్రస్వామి కల్యాణం జరుగగా, 15న బండ్లు తిరుగుట(జాతర), 16న నాగవెల్లి, వసంతోత్సవం, 18న అగ్నిగుండాలు అనంతరం స్వామివారి గ్రామ పర్యటన జాతరలో ముఖ్య ఘట్టాలగా ఉంటాయి. ఏటా సంక్రాంతి జాతర సందర్భంగా భక్తులు గండాలు తీరాలని గండదీపం, వీరభద్రునికి వెండి, బంగారంతో చేసిన కోరమీసాలు సమర్పిస్తే కోరిన కోరికలు తీరుస్తారని భక్తుల నమ్మకం. వీరశైవులు ఖడ్గాలు ధరించి ప్రభలు బీరభద్రపల్లెరం చేస్తారు. స్వామి వారిని వైశ్యులు వారి ఇలవేల్పుగా పూజిస్తారు.

మూలాలు[మార్చు]

  1. ఈనాడు, ప్రధాన దేవాలయాలు. "కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం". Archived from the original on 16 July 2018. Retrieved 29 May 2018.

వెలుపలి లంకెలు[మార్చు]