కొత్తగూడెం పురపాలకసంఘం
| కొత్తగూడెం పురపాలకసంఘం | |
| — పురపాలకసంఘం — | |
| అక్షాంశరేఖాంశాలు: 17°46′10″N 80°29′58″E / 17.7693211°N 80.4993857°E | |
|---|---|
| రాష్ట్రం | తెలంగాణ |
| జిల్లా | భద్రాద్రి కొత్తగూడెం |
| మండలం | కొత్తగూడెం |
| ప్రభుత్వం | |
| - చైర్‌పర్సన్ | |
| - వైస్ చైర్‌పర్సన్ | |
| వైశాల్యము | |
| - మొత్తం | 16.10 km² (6.2 sq mi) |
| జనాభా (2011) | |
| - మొత్తం | 79,850 |
| - పురుషుల సంఖ్య | 39,083 |
| - స్త్రీల సంఖ్య | 40,767 |
| - గృహాల సంఖ్య | 22,704 |
| పిన్ కోడ్ - 507101 | |
| Area code(s) | టెలిఫోన్ కోడ్ - 08744 |
| వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్ | |
కొత్తగూడెం పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] కొత్తగూడెం పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం లోని కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]
చరిత్ర
[మార్చు]మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న కొత్తగూడెం 1971లో 3వ గ్రేడ్ పురపాలక సంఘంగా ఏర్పాటుచేయబడి, 1995లో ఫస్ట్ గ్రేడ్ పురపాలక సంఘంగా మార్చబడింది.
భౌగోళికం
[మార్చు]కొత్తగూడెం 16.10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 17°33′22″N 80°37′01″E / 17.556°N 80.617°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 270 కిలోమీటర్ల దూరంలో ఉంది.
జనాభా గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 79850 మంది కాగా, అందులో 39083 మంది పురుషులు, 40767 మంది మహిళలు ఉన్నారు. 22704 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 17 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[3]
పౌర పరిపాలన
[మార్చు]పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 36 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[4] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.
వార్డు కౌన్సిలర్లు
[మార్చు]- బోయిన విజయకుమార్
- వేల్పుల దామోదర్
- కౌదగాణి పరమేష్ యాదవ్
- కేమశెట్టి సుజాత
- తాలూగు అనిల్
- కాపు సీతాలక్ష్మి
- పులి గీత
- కంచర్ల జమలయ్య
- మోర్ రూప
- మునిగడప పద్మ
- భూక్య శ్రీనివాస్
- కురపాటి విజయలక్ష్మి
- వనచర్ల విమల
- అఫ్జల్ ఉన్నిసా బేగం
- పల్లపు లక్ష్మణ్
- మాచర్ల రాజకుమారి
- గుమ్మడెల్లి కళ్యాణి
- పోలోజు సత్యనారాయణ చారి
- బండి నరసింహారావు
- అజ్మీరా సుజాత
- మాడ సత్యవతి
- తొగరు రాజనళిని
- వై. శ్రీనివాస్ రెడ్డి
- బలిశెట్టి సత్యభామ
- ఎండి. సహేరా బేగం
- అంబాల వేణుగోపాల్
- వేముల ప్రసాద్
- మండల అమని
- టాంగెల్ల లక్ష్మణ్
- నెరెళ్ళ సమైక్య
- కె. ధర్మరాజు
- కె. లీలారాణి
- రవి మమత
- కాసుల ఉమారాణి
- బండారి రుక్మాంగదర్
- బీమా శ్రీవల్లి
మూలాలు
[మార్చు]- ↑ "Kothagudem Municipality". kothagudemmunicipality.telangana.gov.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-05-03.
- ↑ Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. the original నుండి 4 December 2019 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 May 2021.
- ↑ "Basic Information of Municipality, Kothagudem Municipality". kothagudemmunicipality.telangana.gov.in. the original నుండి 15 జూలై 2019 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 May 2021.
- ↑ admin (2020-05-10). "Kothagudem municipality Councillors list 2020". Telangana data (in అమెరికన్ ఇంగ్లీష్). the original నుండి 2021-05-22 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-05-22.