కొత్తవలస

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొత్తవలస, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక మండలము.[1] పాలనా పరంగా కొత్తవలస విజయనగరం జిల్లాలోని మండల కేంద్రమైనా ఇప్పుడు దాదాపు విశాఖపట్నంలో కలిసిపొయింది. విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే మార్గంలో విశాఖపట్నంకి 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయనగరానికి 38 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొత్తవలస చుట్టూ కొండలు ఉన్నాయి. కనుచూపు మేరలో తూర్పు కనుమలు కనపడతూ ఉంటాయి. కొత్తవలస మామిడి, జీడి తోటలు, ఎర్రమట్టికి ప్రసిద్ధి. ఇక్కడి నుండి ప్రతీ సంవత్సరము కోల్కోత్తకి మామిడి కాయలు ఎగుమతి చేస్తారు. ఎర్రమట్టిని ఉపయోగించి బంగళా పెంకులు తయారు చేసి ప్రక్కనున్న ఒడిషా రాష్ట్రానికి ఎగుమతి చేస్తారు. ఇక్కడ దాదాపు 30 పెంకుల మిల్లులు ఉన్నాయి.

కొత్తవలస రైల్వే కూడలి(Junction)

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 68,579 - పురుషులు 33,776 - స్త్రీలు 34,803

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=కొత్తవలస&oldid=2688289" నుండి వెలికితీశారు