కొత్త కేశవులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొత్త కేశవులు 1904లో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో జన్మించాడు. 1947-48లో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడినాడు. హైదరాబాదు, నిజామాబాదు జైళ్ళలో శిక్షను కూడా అనుభవించాడు.[1] 1954 నుండి 1962 వరకు జడ్చర్ల పురపాలక సంఘ చైర్మెన్‌గా పనిచేశాడు. 1962 జడ్చర్ల శాసనసభ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసి నియోజకవర్గ తొలి ఎమ్మెల్యేగా ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు.[2] 1973 ఆగస్టు 15న భారత ప్రభుత్వంచే స్వాతంత్ర్యసమరయోధులకిచ్చే తామ్రపత్రాన్ని పొందినాడు. ఇటీవల జడ్చర్లలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.[3]

మూలాలు[మార్చు]

  1. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగు యోధులు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ సొసైటి ప్రచురణ, ప్రథమ ముద్రణ 2006, పేజీ 223
  2. ఆంధ్రప్రభ దినపత్రిక, తేది 02-06-2008
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-08-10. Retrieved 2011-08-21.