కొనకళ్ల వెంకటరత్నం
కొనకళ్ల వెంకటరత్నం బంగారిమామ పాటల రచయితగా సుప్రసిద్ధుడు. ఇతడు పశ్చిమ గోదావరి జిల్లా, పెంటపాడు గ్రామంలో 1909లో జన్మించాడు. కాకినాడలో ఇతని విద్యాభ్యాసం జరిగింది. పోలీసుశాఖలో పనిచేసి ఏలూరులో స్థిరపడ్డాడు. 1971, జనవరి 9వ తేదీన ఇతడు మరణించాడు.[1] ఇతడు గేయ రచయితగానే కాకుండా కథారచయితగా కూడా ఎన్నదగినవాడు. ప్రతోళి, బంగారిమామ, పొద్దుతిరుగుడుపూలు వంటి గేయకృతులను వ్రాశాడు. ఇతని కథలు ఆంధ్ర పత్రిక,భారతి, పుస్తకం,ఆంధ్రప్రభ,కథావీధి,ప్రగతి,చిత్రగుప్త,ఆనందవాణి,ఆంధ్ర మహిళ, సాహితి, శ్రావణి మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఇతని గేయం మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో 1959లో విడుదలైన సిపాయి కూతురు సినిమాలో మొదటిసారిగా వాడుకొన్నారు. తరువాత ఇదే పాటను అదృష్టవంతులు సినిమాలో మళ్లీ ఉపయోగించుకున్నారు. అలాగే ఇతని రావోయి బంగారిమామా నీతోటి రాహస్య మొకటున్నదోయి అనే గేయం ఘంటసాల గళంలో ప్రైవేటు రికార్డుగా బహుళ ప్రాచుర్యం పొందింది.
కథల జాబితా
[మార్చు]కథానిలయంలో లభ్యమౌతున్న ఇతని కథలు కొన్ని:[2]
- అడ్డదారి[3]
- అతను ఇకరాడు
- అది నాబిడ్డ
- అద్దంమీద ఆవగింజలు
- అనుకోని విరహం
- అపస్వరం
- అపోహ
- అరటిపళ్లగెల
- ఆఖరు గుణపాఠం
- ఉబ్బులింగడు[4]
- కత్తి మీద సాము
- కులభ్రష్టుడు
- ఖయిదీ జవానూ
- చివరకు మిగిలిన రంగడు
- తగిన సంమంధం
- తొందరపాటు
- తోచిందల్లా
- దాగని సత్యం
- దాపరికం
- దొంగా మనిషీ[5]
- నామీద...
- నిజాయితీగల మనిషి
- పర్యవసానం
- పశుపక్షుల సమావేశం
- పెళ్ళి సన్నాహం
- బాజీ
- బుద్ధిమంతుడు
- మనిషి
- మొదటి సారి
- రాజుబాబు దయారసం
- రోడ్ రోమియో నెం.2
- రోడ్డు రోమియోలు
- విముక్తి
- విశ్వదాత
- వేస్ట్
- శీతారామయ్య పధకం-1
- సంక్రాంతి కానుక
- సంఘర్షణ
- సంప్రదాయం
- సెక్షన్ 109
మూలాలు
[మార్చు]- ↑ ఎడిటర్ (2015-01-03). "రావోయి బంగారి మామా..." సాక్షి దినపత్రిక. Archived from the original on 2 మే 2015. Retrieved 29 March 2015.
- ↑ వెబ్ మాస్టర్. "రచయిత: కొనకళ్ల వెంకటరత్నం". కథానిలయం. కథానిలయం. Archived from the original on 10 మార్చి 2016. Retrieved 29 March 2015.
- ↑ కొనకళ్ల వెంకటరత్నం (1953-06-17). "అడ్డదారి". ఆంధ్ర సచిత్రవార పత్రిక. 45 (42): 10-11&55. Archived from the original on 10 మార్చి 2016. Retrieved 29 March 2015.
- ↑ కొనకళ్ల వెంకటరత్నం (1966-12-23). "ఉబ్బులింగడు". ఆంధ్ర సచిత్రవార పత్రిక. 59 (15): 16–23. Archived from the original on 10 మార్చి 2016. Retrieved 29 March 2015.
- ↑ కొనకళ్ల వెంకటరత్నం (1952-12-24). "దొంగా మనిషీ". ఆంధ్ర సచిత్రవార పత్రిక. 45 (18): 6–9. Retrieved 29 March 2015.[permanent dead link]