కొబ్బరి మట్ట (2019 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొబ్బరి మట్ట
కొబ్బరి మట్ట సినిమా పోస్టర్
దర్శకత్వంస్టీవెన్ శంకర్
రచనస్టీవెన్ శంకర్
నిర్మాతస్టీవెన్ శంకర్
తారాగణంసంపూర్ణేష్ బాబు, ఇషికా సింగ్, గీతాంజలి
ఛాయాగ్రహణంముజీర్ మాలిక్
కూర్పుకార్తీక శ్రీనివాస్
సంగీతంసయ్యద్ కమ్రాన్
నిర్మాణ
సంస్థ
అమృత ప్రొడక్షన్స్
పంపిణీదార్లునోబారియ‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ (నైజాం, విదేశాలు)
విడుదల తేదీ
10 ఆగస్టు 2019 (2019-08-10)
సినిమా నిడివి
140 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కొబ్బరి మట్ట 2019, ఆగస్టు 10న విడుదలైన తెలుగు హాస్య చలనచిత్రం.[1] స్టీవెన్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు, ఇషికా సింగ్, గీతాంజలి, గాయత్రి గుప్తా తదితరులు నటించగా,సయ్యద్ కమ్రన్ సంగీతం అందించాడు. ఈ సినిమాలో పాపారాయుడు, పెదరాయుడు, ఆండ్రాయుడుగా త్రిపాత్రాభిన‌యం[2] చేస్తూ 3 నిమిషాల 27 సెకెన్లున్న డైలాగ్‌ను సంపూర్ణేష్‌బాబు సింగిల్‌ టేక్‌లో చేసి ప్రపంచ సినీచరిత్రలోనే అరుదైన రికార్డును సృష్టించాడు.[3]

ఊరికి పెద్ద దిక్కైన పెదరాయుడు (సంపూర్ణేష్‌ బాబు) ఎవరికి ఏ అన్యాయం జరిగినా దానికి వ్యతిరేకంగా ఎదురు నిలబడి, చిత్ర విచిత్రమైన తీర్పులు చెబుతాడు. తనకి ముగ్గురు తమ్ముళ్ళు, ముగ్గురు భార్యలు ఉంటారు. ఒక రోజు ‘నువ్వే నా తండ్రివి’ అంటూ ఆండ్రాయుడు (సంపూర్ణేష్‌బాబు) వస్తాడు. ఆండ్రాయుడు రాకతో పెదరాయుడు జీవితం అనేక మలుపులు తిరుగుతుంది. ఇంతకీ ఈ ఆండ్రాయుడు ఎవరు? పెదరాయుడుతో తనకున్న సంబంధం ఏమిటి? ఆండ్రాయుడు వచ్చాక పెదరాయుడు జీవితంలో ఏం జరిగింది? పాపారాయుడు (సంపూ)కీ వీళ్లకూ ఉన్న సంబంధం ఏమిటి? అనేది మిగతా కథ.[4]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
 • రచన, దర్శకత్వం: స్టీవెన్ శంకర్
 • నిర్మాత: స్టీవెన్ శంకర్
 • సంగీతం: సయ్యద్ కమ్రాన్
 • ఛాయాగ్రహణం: ముజీర్ మాలిక్
 • కూర్పు: కార్తీక శ్రీనివాస్
 • నిర్మాణ సంస్థ: అమృత ప్రొడక్షన్స్

ఇతర వివరాలు

[మార్చు]
 1. ఈ సినిమా టీజర్ ను సాయి ధరమ్ తేజ్ విడుదల చేశాడు.[5]
 2. ఈ సినిమాను హాస్యానికి పట్టం కట్టిన దర్శకుడు ఈ.వి.వి.సత్యనారాయణకు అంకితమిచ్చారు.[6]
 3. ఈ సినిమా 39రోజుల్లో పూర్తయింది.[7]

మూలాలు

[మార్చు]
 1. "Kobbari Matta progressing briskly". Times of India. 4 September 2014. Retrieved 9 August 2019.
 2. "Sampoo does it again with triple role in Kobbari Matta". Deccan Chronicle. 25 May 2016. Retrieved 9 August 2019.
 3. ఎన్ టీవి, ట్రైలర్స్ (28 July 2019). "'కొబ్బరిమట్ట'లో మూడున్నర నిమిషాల డైలాగ్ ఇదే". NTV Telugu. Archived from the original on 9 August 2019. Retrieved 9 August 2019.
 4. ఈనాడు, సినిమా రివ్యూ (10 August 2019). "కొబ్బరిమట్ట రివ్యూ". www.eenadu.net. Archived from the original on 15 August 2019. Retrieved 15 August 2019.
 5. "Tollywood actor Sampoornesh Babu creates record with 'Kobbari Matta' teaser". dnaindia.com. 24 May 2016. Retrieved 9 August 2019.
 6. ఈనాడు, సినిమా (5 August 2019). "ఈవీవీకి 'కొబ్బరిమట్ట' అంకితం". www.eenadu.net. Archived from the original on 9 August 2019. Retrieved 9 August 2019.
 7. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి - సినిమా కబుర్లు (9 August 2019). "మోహన్‌బాబుగారి ప్రశంస మర్చిపోలేను". www.andhrajyothy.com. Archived from the original on 9 August 2019. Retrieved 9 August 2019.

ఇతర లంకెలు

[మార్చు]