కొమ్మాజోస్యుల ఇందిరాదేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొమ్మాజోస్యుల ఇందిరాదేవి
జననంకొమ్మాజోస్యుల ఇందిరాదే
సెప్టెంబరు 14, 1951
గన్నవరం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
ప్రసిద్ధిరంగస్థల నటి.
తండ్రికాశావర్ఘుల శంకరయ్య
తల్లిలక్ష్మమ్మ

కొమ్మాజోస్యుల ఇందిరాదేవి రంగస్థల నటి.

అరంగేట్రం[మార్చు]

ఇందిరాదేవి 1951, సెప్టెంబర్ 14న కాశావర్ఘుల శంకరయ్య, లక్ష్మమ్మ దంపతులకు కృష్ణా జిల్లా గన్నవరంలో జన్మించింది.

రంగస్థల ప్రస్థానం[మార్చు]

1973లో కీర్తిశేషులు నాటకంలోని ‘జానకి’ పాత్ర ద్వారా నాటకరంగంలోకి అడుగుపెట్టింది. కీర్తిశేషులు, అన్నాచెల్లెలు, పల్లెపడుచు, కులంలేని పిల్ల, యధాప్రజా - తథారాజా, మనసున్న మనిషి, ఇదా ప్రపంచం, మండువాలోగిలి, మరో మొహెంజొదారో, పుణ్యస్థలి, పావలా, కొడుకుపుట్టాల, తీర్పు, యక్షగానం, జగన్నాథ రథచక్రాలు, క్షీరసాగర మథనం, బూచి, లేడి పంజా, ది గేమ్, తర్జని, డియర్ ఆడియన్స్ సిన్సియర్లీ యువర్స్, పూజకు వేళాయెరా, హళ్ళికి హళ్ళి, ఒంటెద్దుబండి, పుటుక్కు జరజర డుబుక్కుమేమే, సైలెన్స్ ప్లీజ్, దొంగలబండి, చిచ్చు, యవనఘోష, నటనాలయం, విషపుష్పాలు, తెరవెనుక, హరిజనాగ్రహారం, ఊరికో రుద్రమ్మ మొదలగు సాంఘిక నాటక/నాటికల్లో నటించింది.

శ్రీకృష్ణ తులాభారం, శ్రీవేంకటేశ్వర మహాత్యం, తారాశశాంకం, అశ్వత్థామ, నర్తనశాల, పాదుకా పట్టాభిషేకం, రామదాసు, చింతామణి, పుత్రాధిచ్చేత్ పరాజయం మొదలగు పద్య నాటకాల్లోనూ నటించింది. 1976 నుంచి రేడియో నాటికల్లో, 1987 నుంచి దూరదర్శన్ ప్రదర్శనల్లో నటిస్తోంది.

సత్కారాలు, అవార్డులు[మార్చు]

పలు నాటక పరిషత్తులలో ఉత్తమ నటిగా శతాధిక బహుమతులందుకొన్నాది

మూలాలు[మార్చు]

కొమ్మాజోస్యుల ఇందిరాదేవి, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 26.