కొమ్మినేని శేషగిరిరావు
కొమ్మినేని శేషగిరిరావు | |
---|---|
జననం | కొమ్మినేని శేషగిరిరావు 1939 |
మరణం | 2008, డిసెంబర్ 5 |
నివాస ప్రాంతం | తెనాలి సమీపంలోని పొన్నెకల్లు |
ప్రసిద్ధి | తెలుగు సినిమా దర్శకుడు, నటుడు. |
కొమ్మినేని శేషగిరిరావు, ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, నటుడు.
ఇతడు ప్రముఖ సంగీత దర్శకుడు కె.చక్రవర్తికి సోదరుడు. వీరి స్వస్థలం గుంటూరు జిల్లా తాడికొండ మండలం లోని పొన్నెకల్లు. ఇతను అనేక సినిమాల్లో నటించాడు. మొదట్లో విలన్‌గా నటించినా, గొప్పవారి గోత్రాలు (1967) సినిమాలో కథానాయకుడిగా నటించాడు. ఆ తరువాత శ్రీకృష్ణపాండవీయం, తాతామనవడు, సంసారం సాగరం, చిరంజీవి రాంబాబు వంటి యాభైకి పైగా సినిమాలలో నటించాడు.
దర్శకునిగా కొమ్మినేని తొలిచిత్రం గిరిబాబు హీరోగా నటించిన దేవతలారా దీవించండి. ఆ చిత్ర విజయం తరువాత సింహగర్జన సినిమాకు, ఆ తరువాత తాయారమ్మ బంగారయ్య సినిమాకు దర్శకత్వం వహించాడు. తాయారమ్మ బంగారయ్య సినిమాను తమిళంలో శివాజీ గణేశన్‌తో నిర్మించారు. అదికూడా ఘన విజయం సాధించింది. ఈయన కన్నడంలో కూడా రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు.
కొమ్మినేని 2008, డిసెంబరు 5న చెన్నైలో శరీరంలోని అనేక అంగాలు వైఫల్యం చెందడంతో మరణించాడు. ఇతనికి భార్యతో పాటు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
చిత్ర సమాహరం
[మార్చు]ఇతడు పనిచేసిన చిత్రాల పాక్షిక జాబితా:
నటుడిగా
[మార్చు]- గొప్పవారి గోత్రాలు (1967)
- ఎవరికివారే యమునాతీరే (1974)
- అల్లూరి సీతారామరాజు (1974)
- అందరూ బాగుండాలి (1975)
- ఆస్తికోసం (1975)
- పిచ్చోడి పెళ్ళి (1975)
- బలిపీఠం (1975)
- భారతంలో ఒకమ్మాయి (1975)
- రాజ్యంలో రాబందులు (1975)