Jump to content

కొమ్మూరు (రాజగోపాలపురం)

వికీపీడియా నుండి
కొమ్మూరు (రాజగోపాలపురం)
  రెవిన్యూ గ్రామం  
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం అగిరిపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521212
ఎస్.టి.డి కోడ్ 08656

కొమ్మూరు కృష్ణా జిల్లా, అగిరిపల్లి మండలానికి చెందిన గ్రామము.

గ్రామ చరిత్ర

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంత భాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

అగిరిపల్లె మండలం

అగిరిపల్లె మండలం మొత్తంతో పాటు పట్టణ పరిధిలో ఉన్న ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామ భౌగోళికం

[2] సముద్రమట్టానికి 24 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

నూజివీడు, హనుమాన్ జంక్షన్, విజయవాడ, ఏలూరు

సమీప మండలాలు

గన్నవరం, నూజివీడు, మైలవరం, బాపులపాడు

గ్రామంలో విద్యా సౌకర్యాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

నూజివీడు, మైలవరం, గన్నవరం నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 28 కి.మీ

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి కె.రంగమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [1]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

కొమ్మూరు గ్రామ పంచాయతీ కార్యాలయ సమీపంలోని గంగానమ్మ, పోతురాజుల విగ్రహాల పునఃప్రతిష్ఠాకార్యకమం, 2014,డిసెంబరు-15, సోమవారం నాడు ఉదయం 8 గంటలకు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. [1]

మూలాలు

  1. http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Agiripalli/Kommuru". Retrieved 20 June 2016. {{cite web}}: External link in |title= (help)

వెలుపలి లంకెలు

[1] ఈనాడు విజయవాడ; 2014,డిసెంబరు-16; 5వపేజీ.