కొర్రమట్ట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొర్రమట్ట
కొర్రమట్ట
శాస్త్రీయ వర్గీకరణ edit
Unrecognized taxon (fix): చన్నా
Species:
Template:Taxonomy/చన్నాచ. స్ట్రియాటా
Binomial name
Template:Taxonomy/చన్నాచన స్ట్రియాటా
(మార్కస్ ఎలీసర్ బ్లాక్, 1793)
'చన్నా స్ట్రియాటా' పంపిణీ..

మడగాస్కర్ రిపోర్టులు "సి. మాక్యులేటా తప్పుడు గుర్తింపులు.

Synonyms
  • ఒఫిసెఫాలస్ స్ట్రియాటస్ బ్లోచ్, 1793
  • చన్నా స్ట్రియాటా (బ్లోచ్, 1793)
  • ఓఫియోసెఫాలస్ వ్రాల్ బెర్నార్డ్ జర్మైన్ డి లాసెపేడ్, 1801
  • ఓఫియోసెఫాలస్ చెనా ఫ్రాన్సిస్ బుకానన్-హామిల్టన్, 1822
  • ఒఫిసెఫాలస్ ప్లానిసెప్స్ జార్జెస్ కువియర్, 1831
  • ఓఫియోసెఫాలస్ వాగస్విల్హెల్మ్ పీటర్స్, 1868
  • ఓఫియోసెఫాలస్ ఫిలిప్పినస్ పీటర్స్, 1868

కొర్రమీను దీనిని బొమ్మె లేదా మట్టగిడస లేదా కొర్రమట్ట అని కూడా అంటారు. ఈ చేప నలుపురంగులో గట్టి దేహంతో హుషారుగా వుండే చేప రకం.[1] దక్షిణాసియా, ఆగ్నేయాసియా ప్రాంతాలలో ఎక్కువగా కనిపించే ఈ చేపరకాన్ని శాస్త్రీయంగా చెన్నాస్ట్రయేటా (Channa striata) అంటారు. తెలంగాణా రాష్ట్ర చేపగా దీనిని ఎంచుకున్నారు.

రూపం అలవాట్లు[మార్చు]

కొర్రమట్ట మీటరు వరకూ పొడవు పెరుగుతుంది. భారతదేశంలో వేర్వేరు ప్రాంతాలలో ఎక్కువగా కనిపించే ఈ చేప దక్షిణ చైనా, పాకిస్తాన్, దక్షిణ నేపాల్ బంగ్లాదేశ్, శ్రీలంక ఆగ్నేయాసియా ప్రాంతాలలో కనిపిస్తుంది. మిగిలిన చేపలకంటే సాధారణంగా దొరకె రకాలలో మట్టగిడస కూరకు ఒక ప్రత్యేకత ఉంది. తెల్ల చేపల రకం కంటే దీనిలా నల్ల చేపల రకానికి మార్కెట్ రేటు కూడా అదనంగా వుంటుంది. ఇది ముదురు గోధుమ రంగులో దేహం ఉంది. దానిపై నల్లటి మసక బారిన చారలు కనిపిస్తాయి. మంచినీటి నదులు, సరస్సులలో వరదలున్నప్పుడు పొలాల నీళ్ళలోనూ బాగా పెరుగుతుంది. బురద నేల లాగా తడి వున్నప్పటికీ ఇది బ్రతికేయగలదు. అందుకే దీన్ని ఎక్కువగా బురద మట్టలు అంటారు. చిన్న చిన్న ఆకులు శైవలాలతో పాటు కప్పలు కప్ప పిల్లలు చిన్న చేపలను ఇవి తింటాయి. గుడ్లు పెట్టడం ద్వారా సంతానొత్పత్తి చేస్తాయి.[2]

ఆహార విలువలు[మార్చు]

చేపలు ఉత్తమ పోషకాల్ని అందిస్తాయి. గుండెజబ్బుతో బాధపడుతున్నవారు చేపల్ని తినడం మంచిది. వీటిల్లో 18-20 శాతం మాంసకృత్తులు ఉంటాయి. ఇవి తేలిగ్గా అరుగుతాయి. వీటి మాంసకృత్తుల్లో మనకవసరమైన ఎనిమిదిరకాల అమైనో యాసిడ్లు లభిస్తాయి. ముఖ్యంగా గంధకం కలిగిన లైసీన్‌, మిథియోనిన్‌, సిస్టీన్‌ అమైనోయాసిడ్లు లభిస్తాయి. చేపల... రకం, వయస్సును బట్టి వీటిలో కొవ్వు 0.2 నుండి 20 శాతం వరకూ ఉంటుంది. కానీ, దీనిలో ఉండే కొవ్వు నాణ్యమైనది (పోలి అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌). దీనిలో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్లు పిల్లల పెరుగుదలకు అవసరం. ఇవి గుండెజబ్బుల్ని కలిగించవు. పిండంలో మెదడు పెరుగుదలకు ఈ కొవ్వు దోహదపడుతుంది. దీనివల్ల నెలలు నిండకుండానే ప్రసవించే ప్రమాదం తగ్గుతుంది. చేప కొవ్వు ద్వారా ఎ, డి, ఇ, కే విటమిన్లు మన శరీరానికి తేలికగా అందుతాయి. సూక్ష్మ పోషకాలైన విటమిన్‌ ఎ, డి చేపల్లో పుష్కలం. థయామిన్‌, రిబోఫ్లేవిన్‌, నియోసిన్లు చేపల్లో అధికంగా ఉంటాయి. ఆకుకూరల ద్వారా లభించే విటమిన్‌ ఎ కన్నా చేపల్లో ఉన్న విటమిన్‌ ఎ తేలిగ్గా అందుతుంది. ఇది మంచి కంటిచూపుకు దోహపడుతుంది. చేపల కాలేయంలో ఉండే విటమిన్‌ డి ఎముకల పెరుగుదలకు కీలకం. ఆహారంలో ఉన్న కాల్షియాన్ని స్వీకరించడానికి, వినియోగానికి విటమిన్‌ డి అవసరం. థయామిన్‌, నియోసిన్‌, రిబోఫ్లేమిన్‌ ఆహారంలో శక్తి వినియోగానికి, విడుదలకు అవసరం. తాజా చేపల్ని తిన్నప్పుడు విటమిన్‌ సి కూడా అందుతుంది. సముద్రపు చేపల్లో అయోడిన్‌ అధికంగా ఉంటుంది. చేపల్లో ఇనుము, కాల్షియం, జింకు, భాస్వరం, ఫ్లోరిన్లు బాగా ఉపయోగపడే రూపంలో ఉంటాయి. చిన్న చేపల్ని (చేతి పరికెలు) ముల్లుతో సహా తిన్నప్పుడు కాల్షియం, భాస్వరం, ఐరన్‌ అధికంగా లభిస్తాయి. కానీ, ముల్లు తీసేసి తింటే ఇవి తక్కువగా లభిస్తాయి. గట్టి ఎముకలకు, పళ్లకు ఫ్లోరిన్‌ అవసరం. రక్తవృద్ధికి హీమోగ్లోబిన్‌ అవసరం. ఇందుకు ఇనుము బాగా తోడ్పడుతుంది. ఇది చేపల్లో విరివిగా లభిస్తుంది. అయోడిన్‌ మెదడు ఎదుగుదలకు దోహదపడుతుంది. ఇది చేపల్లో పుష్కలంగా లభిస్తుంది. ఇది లోపస్థాయిలో ఉన్నప్పుడు గాయిటర్‌ అనే జబ్బు వస్తుంది. మానసిక ఎదుగుదల లేకుండా పోతుంది. జింక్‌ అత్యవసర ఎంజైమ్‌ల ఉత్పత్తికి, నిరోధకశక్తి పెరుగుదలకు, ఆరోగ్యకర చర్మానికి అవసరం.[3]

చేప ప్రసాదంలో ప్రాముఖ్యత[మార్చు]

ఉబ్బసం వ్యాధిని నివారించుటకు ప్రతి ఏటా మృగశిర కార్తె రోజున బత్తిని సోదరులు పంపిణీ చేసే మందులో ఈ చేపలను వాడతారు.[4]చేప ప్రసాదం వల్ల ఉబ్బస వ్యాధిలో ఉపశమనం వుంటోందని భావించడం వల్ల దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా మత్స్య శాఖ ద్వారా పెంపొందించి కొర్రమీను చేప పిల్లలను సరఫరా చేస్తుంది.[5]

వాడుకలో కొర్రమట్ట[మార్చు]

  • దేహం నల్లగా వున్నా నున్నగా దృఢంగా నిగనిగ లాడుతుంటే మట్టగిడస లాగా వున్నాడు, మట్టగిడస లాగా నిగనిగ లాడుతున్నాడు అంటారు.[6]
  • మట్టగిడస లాగా గిలగిల గిల కొట్టేసుకుంటున్నాడు అనే మాట కూడా వుంది ఒడ్డున పడ్డాసరే పోరాడటానికి ఒక ఉదాహరణగా చెప్తారు.[7][8]

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. USGS, Southeast Ecological Science Center: Channa striata. Retrieved 27 June 2014.
  2. Recipes
  3. Venkatesh K, Prasanth B, Rajesh P, Annie JG, Mukesh P, Jesu A (2014). "A murrel cysteine protease, cathepsin L: bioinformatics characterization, gene expression and proteolytic activity". Biologia. 39: 395–406. doi:10.2478/s11756-013-0326-8.
  4. http://www.10tv.in/news/Fish-medicine-for-asthma-is-not-a-medicine[permanent dead link]
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-06-12. Retrieved 2015-06-08.
  6. http://web.usm.my/mjps/MJPS%203(2)%202005/MJPS%203.2.3.pdf[permanent dead link]
  7. "Indians flock for asthma 'cure'". BBC News. 9 June 2003. Retrieved 5 June 2011.
  8. "SHRC moved against `fish medicine'". Times of India. 1 June 2011. Archived from the original on 16 జూన్ 2012. Retrieved 5 June 2011.

బయటి లింకులు[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]