Jump to content

కొర్ల భారతి

వికీపీడియా నుండి
కొర్ల భారతి

శాసనసభ్యురాలు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2009 - 2014
నియోజకవర్గం టెక్కలి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 27 అక్టోబర్ 1960
లక్ష్మీపురం, పలాస మండలం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ జై సమక్యాంధ్ర పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు కవిటి జానకి రామయ్య & సీతామహాలక్ష్మీ
జీవిత భాగస్వామి కొర్ల రేవతీపతి
సంతానం శిరీష, స్రవంతి, అనూష, అనిల్ కుమార్
నివాసం గాంధీ నగర్, కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా

కొర్ల భారతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009 ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

కొర్ల భారతి భర్త కొర్ల రేవతీపతి 2009 ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుంచి గెలిచి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయకుండానే మరణించడంతో ఆ తరువాత 2009లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్‌ అభ్యర్థినిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై శాసనసభలో మహిళా శిశు సంక్షేమ శాఖ సభ్యురాలిగా పని చేసింది. ఆమె వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మరణాంతరం వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వైకాపా పార్టీ పార్టీలోకి వెళ్లి తిరిగి కాంగ్రెస్‌లో చేరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం 2014లో నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏర్పాటు చేసిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరి అక్కడి నుండి పోటీ చేసి ఓడిపోయింది.

మూలాలు

[మార్చు]
  1. Sakshi (30 March 2019). "టెక్కలి నియోజకవర్గం ముఖచిత్రం". Archived from the original on 24 May 2022. Retrieved 24 May 2022.

బయటి లింకులు

[మార్చు]