కొఱ్ఱలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొఱ్ఱలు
Immature seedhead
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Subfamily:
Genus:
Species:
S. italica
Binomial name
Setaria italica
(లి.) P. Beauvois
Synonyms

Panicum italicum L.
Chaetochloa italica (L.) Scribn.

కొఱ్ఱలు (Foxtail millet, Italian millet, German millet, Chinese millet, and Hungarian millet) ఒక విధమైన చిరుధాన్యాలు (Millets). ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రధానమైన ఆహారంగా ఉపయోగపడే ధాన్యపు పంటగా రెండవ స్థానంలో ఉన్నది. దీని శాస్త్రీయ నామం సెటేరియా ఇటాలికా (Setaria italica). ఇది ఎక్కువగా తూర్పు ఆసియా ప్రాంతంలో అతి ప్రాచీనకాలం నుండి పండిస్తున్నారు. చైనాలో సుమారు క్రీ.పూ.6వ శతాబ్దం నుండి పెంచబడుతున్నాయి.

కుంరం భీం జిల్లా లొ చిరుధాన్యాలు

ప్రాథమిక లక్షణాలు

[మార్చు]

కొఱ్ఱలు గడ్డిజాతికి చెందిన చిన్న మొక్కలు. ఇవి సన్నగా ఆకులతో కప్పబడిన కాండం కలిగి సుమారు 120-200 సెం.మీ. (4-7 అడుగులు) పొడవు పెరుగుతాయి. కంకులు జుత్తును కలిగి సుమారు 5-30 సెం.మీ. (2-12 అంగుళాలు) పొడవుంటాయి. కొర్ర గింజలు చిన్నవిగా సుమారు 2 మి.మీ. వ్యాసం ఉండి పలుచని పొరతో కప్పబడి ఉంటాయి. ఈ పొట్టును దంచి సులువుగా వేరుచేయవచ్చును. గింజ ఎరుపు, పసుపు, తెలుపు, నలుపు రంగులలో నాలుగు రకములుగా ఉంటాయి. ఇందులోని పీచుపదార్థం అధికము గా ఉన్న కారణం గా ఇది తిన్న వారికి ఒంటి లో కొవ్వు తగ్గుతుంది.

ఉపయోగాలు

[మార్చు]
  • కొఱ్ఱ బియ్యంలో పరమాన్నం చేసుకొని తింటారు.
  • కొఱ్ఱలతో కూడా గంజి చేసుకొని తాగుతారు.
  • కొఱ్ఱ అన్నము మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాల మంచిది.
  • కొఱ్ఱ బియ్యంలో మాంసకృత్తులు ఎక్కువ.
  • ఉప్మాలాగా కూడా చేసుకొనవచ్చు.
  • గారెలు, దోశలు కూడా చేసుకొనవచ్చు.

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కొఱ్ఱలు&oldid=3711826" నుండి వెలికితీశారు