కొలచల సీతారామయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొలచల సీతారామయ్య (జూలై 15, 1899 - సెప్టెంబరు 29, 1977) ఆయిల్ టెక్నాలజీ పరిశోధక నిపుణులు. యంత్రాలు, వాహనాలలో యంత్ర భాగాల ఘర్షనను నిరోధించే కందెనలు (లూబ్రికెంట్స్) మీద పరిశోధనలు చేసి కెమటాలజీ (మోటారు ఆయిల్స్, కందెనలకు సంబంధించిన రసాయన శాస్త్రము) కి పునాది వేసిన రసాయన శాస్త్రవేత్త. ఈయనను ఫాదర్ ఆఫ్ కెమటాలజీ అంటారు.

జీవిత విశేషాలు[మార్చు]

ఈయన కృష్ణా జిల్లా లోని ఉయ్యూరు గ్రామంలో జన్మించారు. ఈయన జాతీయ భావాలు గల మధ్య తరగతి కుటుంబంలో జూలై 15 1899లో జన్మించారు.మదనపల్లె నేషనల్ కాలేజి (చిత్తూరు) రసాయన శస్త్రాధ్యయనం చేశారు. ప్రయోగాల పరంపర చేశారు. 1921 లో మద్రాసు విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేట్ స్కూల్ లో ప్రవేశించారు. 1924 జూన్ 10 వ తేదీన రసాయన శాస్త్రంలో ఈయనకు మాస్టర్స్ డిగ్రీ ప్రదానం జరిగింది. స్పాతంత్ర్యోద్యమం ముమ్మరంగా జరుగుతున్న కాలంలో ఆస్తినంతటినీ అమ్మివేసి అమెరికా వెళ్లారు. చికాగో యూనివర్శిటీకి వెళ్ళి ఆయిల్ టెక్నాలజీలో పరిశోధన చేశారు. అతి ప్రామాణికమైన సిద్ధాంత రూపకల్పన చేసి పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ అందుకున్నారు.

పెట్రోకెమికల్ రంగంలో ప్రైవేటు కంపెనీలో 1925 నుండి 1927 దాకా అమెరికాలో పనిచేశారు. ఈ కాలంలో న్యు హెవెస్ లో గల కంపెనీ ప్రయోగ శాలకు ఈయన అధిపతిగా ఉండేవారు. అదే కాలంలో మెల్ విశ్వవిద్యాలయం నుండి డిగ్రీని పొందారు. సానెబాల్స్ సంస్థలో పనిచేసిన కాలంలో లూబ్రికెంట్ ల నాణ్యతను పెంచే ఉత్పత్తులను కనుగొన్నారు. ఈ పరిశోధనల ఫలితాలన్నింటికి పేటెంట్ హక్కులు లభించిన ఖ్యాతి సీతారామయ్యకు దక్కింది. 1982 లో అమెరికాను వదిలి రష్యాకు వెళ్లాడు.

రష్యా పౌరసత్యం - పరిశోధనలు[మార్చు]

1930లో ఐరోపా పర్యటన చేశారు. ప్రపంచవ్యాప్తంగా తొంగిచూస్తున్న సమకాలీన రాజకీయ పరిణాలాలను పరిశీలించారు. ముఖ్యంగా రష్యన్ విప్లవం పట్ల ఆకర్షితులైనారు. సోషలిస్టు దేశంగా అఖండ ప్రచారాన్నిపొందుతున్న రష్యా దేశానికి వెళ్ళి అచట అనతికాలంలోనే భూ పరిశోధకునిగా ప్రసిద్ధి పొందిన ఒక విద్యావేత్త అయిన "గుచికిక్"తో పరిచయం యేర్పడింది. ఆయన రష్యా ప్రభుత్వ ఆయిల్ రీసెర్చి ఫౌండేషన్ డైరక్టరు. ఆ దేశంలోని వోల్గా ప్రాంతం నుంచి ఉరల్స్ ప్రాంతం వరకు గల భూగర్భంలో నూనె నిల్వలు అపరిమిత స్థాయిలో ఉన్నట్లు సీతారామయ్యకు తెలుపుతూ పరిశోధనలలో తనకు సహకరించవలసినదిగా పోత్సహించారు.

సీతారామయ్యకు గల ఆయిల్ కెమికల్ సైన్సు రంగంలో ఉన్న పరిశోధనానుభవం, కృషి సాఫల్యతల గూర్చి తెలుసుకొన్న గుచికిక్ మరింత మద్దతునిచ్చి, దేశ పౌరసత్వాన్ని లభింపజేసి, ఆయిల్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ లోని లూబ్రికెంట్స్ రీసెర్చి డివిజన్ కు డైరక్టరుగా నియమింపజేశాడు.

ఈ పరిణామం సీతారామయ్య పరిశోధనా జీవితాన్ని వ్యక్తిగత జీవితాన్ని సమూలంగా మార్చివేసింది. ఈయన పేరు "కాన్‌స్తాంతిన్ సెర్లియేవిచ్"గా రూపాంతరం చెందింది. ఫక్తు రష్యనుగా మారిపోయాడు. జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. సోవియట్ రష్యా దేశంలోని ఆయిల్ వనరులు ఉన్న ఆయిల్ రిఫైనరీస్ ఉన్న ప్రాంఆలలో క్షుణ్ణంగా పరిశీలించారు. ఆధునిక సాంకేతిక విధానాలను ప్రవేశపెట్టడానికి అధ్యయనాలు నిర్వహించి కృషిచేశారు. అనతి కాలంలోనే ఆ ప్రభుత్వ గుర్తింపు పొందారు. ఆటోమొబైల్, మోటార్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లోని ఆయిల్ రీసెర్చి డివిజన్ కు హెడ్ గా నియమితులయ్యారు.

రష్యాలో స్థిరపడిన చాలాకాలం వరకు ఉయ్యూరు గ్రామం వైపు చూడలేదు. రష్యన్ యువతిని వివాహం చేసుకున్నారు. సోవియట్ రష్యా దేశపు పౌరసత్వం లభింపజేసుకోవడంలోనే ఈయన ప్రతిభా సంపత్తిని, అఖండ మేధా సంపన్నతను మనం అంచనా వేయవచ్చు.

విజయాలు[మార్చు]

యుద్ధ కాలంలో ఈయన పరిసోధనా కృషి అనితా సాధ్యమైనది. ఎటువంటి ప్రతికూల వాతావరణంలోనైనా యుద్ధ ట్యాంకులు నిలిచిపోకుండా ఉండేందుకు ఈయన కనుగొన్న ఇంధనం సోవియట్ మిత్రకూటమి విజయపరంపరలో కీలకమైనది. అనతి కాలంలోణే ఈయన ప్రముఖ శాస్త్రవేత్తగా అఖండ కీర్తినార్జించడమే కాక ఆటోమొబైల్స్, మోటార్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ విభాగాధిపతిగా నియమింపబడ్డారు.

ఈయన స్వదేశం విడిచి వెళ్ళిన నాలుగు దశాబ్దాల తర్వాత తిరిగి 1963 లో ఉయ్యూరులో పాదం మోపారు. ఆయన 1977 సెప్టెంబరు 29 న మరణించారు.

మూలాలు[మార్చు]