కొలనుపాక జైనమందిరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొలనుపాక జైనమందిరం
కొలనుపాక జైనమందిరం
ప్రదేశం
దేశం:భారతదేశం
state:తెలంగాణ
జిల్లా:నల్గొండ జిల్లా
స్థానిక ప్రాంతం:కొలనుపాక
నిర్మాణం మరియు సంస్కృతి
ముఖ్యమైన పండుగలు:మహావీర్ జయంతి

ఈ జైనమందిరం తెలంగాణలోని ప్రముఖ జైన క్షేత్రము. ఇది వరంగల్ - హైదరాబాదు రహదారిలో హైదరాబాదుకు 65 కి.మీ, ఆలేరుకు సుమారు 6 కి.మీ.ల దూరంలో ఉంది.

ఆలయ విశేషాలు[మార్చు]

ఈ ఆలయ ప్రవేశ ద్వారం కోటద్వారాన్ని తలపిస్తుంది.అక్కణ్ణుంచి రెండు నల్లని ఏనుగులు లోపలికి ఆహ్వానిస్తున్నట్లుంటాయి. ఆలయ నిర్మాణానికి ఢోల్‌పూర్ రాయిని రాజస్థాన్ నుంచి తెప్పించారు. బయటకు వచ్చేందుకు కుడిపక్కా ఎడమపక్కా రెండు ద్వారాలున్నాయి. లోపలంతా భారీ గోపురం. ప్రతి స్తంభంలోనూ సూక్ష్మచిత్రకళ అబ్బుర పరుస్తుంది. ఇందులో ఆదినాథుడు, మహావీరుడు, నేమినాథుడు లాంటి జైనదేవుళ్ళ బొమ్మలే ప్రధాన ఆకర్షణ. ఆలయం లోనికి అడుగుపెట్టగానే ఎడమవైపునుంచి తీర్థంకరుల బొమ్మలు కనిపిస్తాయి. ఇందులో బంగారం, పాలరాయి, నల్లరాతితో చేసినవి ఉన్నాయి. లోపల నేలంతా పాలరాయే. ఆలయం చుట్టుపక్కల చెట్లు, ఇంకా మరో దేవాలయం ఉన్నాయి. ఆలయ ఆవరణమంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇందులో నలుగురు తీర్థంకరుల బొమ్మలతో ఏర్పాటు చేసిన పెద్ద బొమ్మ ఉంది. దీనికి జైనుల పండుగ దినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.

భగవాన్ మహావీర్ విగ్రహం[మార్చు]

మూల విరాట్టుకు కుడివైపున గల గర్భగుడిలో 1.5 మీ. ఎత్తైన మహావీరుని విగ్రహం ఉంది. ఈ విగ్రహం కుంభకంతో కూడిన సిద్దాసనం మరియు అర్ధ పద్మాసనంలో ప్రశాంతమైన యోగముద్రలో ఉంది. వేళ్ళు పొడువుగా ఉన్నాయి. నవ్వు ముఖం, పాల భాగం విశాలంగా ఉండి చుబుకం మనోహరంగా ఉంది. వజ్ర విశేషజ్ఞుల అభిప్రాయం ప్రకారం ఇది ఫిరోజా రాతితో నిర్మించబడింది. ఇలాంటి అత్యధ్బుతమైన ప్రతిమ భారతదేశంలో మరెక్కడా లేదు.

మాణిక్య దేవ ఋషభ దేవ విగ్రహము[మార్చు]

ఈ విగ్రహం మధ్య గర్భగుడిలో మూల నాయక రూపంలో నెలకొని యున్నది. ఇది నలుపు రంగులో శ్రేష్టమైన రత్నంతో నిర్మించబడి యున్నది. 38.5 అంగుళాల వెడల్పు, 34.56 అంగుళాల పొడువు కలిగి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది ఈ విగ్రహం. విగ్రహం ఆహార్యము బహు గొప్పగా మలచబడింది. అర్ధ పద్మాసన సిద్దాసనంలో ఉండి ముఖ ముద్ర గాంభీర్యంగా ఉన్నది, కాంతి మండలం గుండ్రంగా ఉన్నది, లలాటం మీద చంద్రుడు, చుబుకం మీద సూర్యుడు, నాభి పై ఆకారం, అరచేతి మీద శంఖం మరియు చక్రం ఉన్నాయి. ఇది భరత చక్రవర్తి నెలకొల్పిన అతి ప్రాచీనమైన విగ్రహం.

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

ఇతరలింకులు[మార్చు]