కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం
కొల్లాపూర్ | |
— శాసనసభ నియోజకవర్గం — | |
![]() |
|
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format |
|
---|---|
దేశము | భారత దేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మహబూబ్ నగర్ |
ప్రభుత్వం | |
- శాసనసభ సభ్యులు |
మహబూబ్ నగర్ జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం 5 మండలాలు ఉన్నాయి. పునర్విభజన ఫలితంగా ఇదివరకు నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో భాగంగా ఉన్న కొన్ని గ్రామాలు కూడా ఇప్పుడు ఈ నియోజకవర్గంలో కలిశాయి. 1952 నుండి ఇప్పటివరకు 12 సార్లు ఎన్నికలు జరుగగా కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 7 సార్లు విజయం సాధించగా, [1] 3 సార్లు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందినారు. తెలుగుదేశం పార్టీ, కమ్యూనిష్టులు ఒక్కోసారి విజయం పొందినాయి.
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు[మార్చు]
నియోజకవర్గపు గణాంకాలు[మార్చు]
- 2001 లెక్కల ప్రకారము జనాభా: 2,45,766.
- ఓటర్ల సంఖ్య (ఆగస్టు 2008 నాటికి) : 2,17,368.[2]
- ఎస్స్టీ, ఎస్టీల శాతం: 18.42%, 6.40%.
నియోజకవర్గపు చరిత్ర[మార్చు]
కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. అప్పటి నుండి జరిగిన 12 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, ఇండిపెండెంట్ అభ్యర్థులు 3 సార్లు విజయం సాధించగా, తెలుగుదేశం పార్టీ, సి.పి.ఐ.లు ఒక్కొక్క సారి గెలుపొందినాయి. 1952లో జరిగిన మొదటి ఎన్నికలలో కమ్యూనిష్టుల మద్దతుతో పి.డి.ఎఫ్. అభ్యర్థి గెలువగా, 1957లో విజయం సాధించిన నర్సింగరావు మంత్రివర్గంలో స్థానం పొందినాడు. 1962లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కె.రంగదాసు విజం సాధించాడు. 1967లో కూడా మళ్ళీ కాంగ్రెస్ టికెట్టు రంగదాసుకే లభించగా కాంగ్రెస్ పార్టీ వారే వ్యతిరేకించి ఇండిపెండెంట్ అభ్యర్థి నర్సింహారెడ్డిని గెలుపించుకున్నారు. 1972లో రంగదాసుకు టికెట్టు లభించకున్ననూ ఇండిపెండెంట్‌గా పోటీకి దిగి విజయం సాధించాడు. 1978, 83, 85 లలో కొత్త వెంకటేశ్వరరావు వరసగా మూడు సార్లు గెలిచి హాట్రిక్ సాధించాడు. 1989లో వెంకటేశ్వరరావు సోదరుడు కొత్త రామచంద్రారావు కాంగ్రెస్ తరఫున గెలిచాడు. 1994లో ఇద్దరు సోదరులు (కాంగ్రెస్, ఇండిపెండెంట్) పోటీపడడంతో తొలిసారిగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం గెలుపొందినది. మధుసూధరావు బంధువు జూపల్లి కృష్ణారావు 1999లో కాంగ్రెస్ పార్టీ తరఫున, 2004లో కాంగ్రెస్ రెబల్‌గా ఇండిపెండెంట్‌గా పోటీచేసి గెలిచాడు.
ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]
కొల్లాపూర్ నియోజకవర్గానికి జూపల్లి కృష్ణారావు 1999 నుంచి వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అందులో 2012లో జరిగిన ఓ ఉప ఎన్నిక కూడాఉంది. కాగా ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్, రోశయ్య కేబినెట్‌లో, తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిగా చేశారు. 2018లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ప్రస్తుతం బీరం హర్షవర్ధన్‌రెడ్డి కొల్లాపూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ ఈనాడు దినపత్రిక. మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, తేది 23-03-2009
- ↑ ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, పేజీ 1, తేది 01-10-2008.
- ↑ ఈనాడు దినపత్రిక, పేజీ 2, తేది 07-01-1983.
- ↑ ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, తేది 17-05-2009
- ↑ Namasthe Telangana (12 April 2022). "అసెంబ్లీ స్థానాలు-ప్రత్యేకతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
నాగర్‌కర్నూల్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలుజిల్లాల వారీగా నియోజకవర్గాలు ఆదిలాబాదు · మంచిర్యాల · నిర్మల్ · కొమరంభీం · కరీంనగర్ · జగిత్యాల · పెద్దపల్లి · రాజన్న సిరిసిల్ల · నిజామాబాదు · కామారెడ్డి · వరంగల్ (పట్టణ) · వరంగల్ (గ్రామీణ) · జయశంకర్ భూపాలపల్లి · జనగామ · మహబూబాబాద్ · ఖమ్మం · భద్రాద్రి కొత్తగూడెం · మెదక్ · సంగారెడ్డి · సిద్దిపేట · మహబూబ్‌నగర్ · వనపర్తి · నాగర్‌కర్నూల్ · జోగులాంబ గద్వాల · నల్గొండ · సూర్యాపేట · యాదాద్రి భువనగిరి · వికారాబాద్ · మేడ్చల్ మల్కాజ్గిరి · రంగారెడ్డి · హైదరాబాదు