కొల్లాపూర్ పురపాలకసంఘం
కొల్లాపూర్ పురపాలకసంఘం | |
— పురపాలకసంఘం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°09′55″N 78°20′19″E / 16.1653400°N 78.3387066°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నాగర్‌కర్నూల్ |
మండలం | కొల్లాపూర్ |
ప్రభుత్వం | |
- చైర్‌పర్సన్ | రఘుప్రోలు విజయలక్ష్మి |
- వైస్ చైర్‌పర్సన్ | మహదాబేగం |
వైశాల్యము | |
- మొత్తం | 20 km² (7.7 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 23,041 |
- పురుషుల సంఖ్య | 11,825 |
- స్త్రీల సంఖ్య | 11,216 |
- గృహాల సంఖ్య | 5,709 |
పిన్ కోడ్ - 509102 | |
Area code(s) | ఎస్.టి.డి కోడ్ - 08501 |
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్ |
కొల్లాపూర్ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ. కొల్లాపూర్ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం.[1] ఈ పురపాలక సంఘం నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం లోని కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]
చరిత్ర
[మార్చు]మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న కొల్లాపూర్ 2011, జూన్ 15న పురపాలక సంఘంగా ఏర్పడింది.
భౌగోళికం
[మార్చు]కొల్లాపూర్ 20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 16°06′22″N 78°19′08″E / 16.106°N 78.319°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 180 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం నాగర్‌కర్నూల్ నుండి 49.6 కిలోమీటర్ల దూరంలో ఉంది.
జనాభా గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 23041 మంది కాగా, అందులో 11825 మంది పురుషులు, 11216 మంది మహిళలు ఉన్నారు. 5709 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 3 రెవెన్యూ వార్డుగా విభజించబడింది.[3]
పౌర పరిపాలన
[మార్చు]పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 20 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం రఘుప్రోలు విజయలక్ష్మి చైర్‌పర్సన్‌గా, మహదాబేగం వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[4][5] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.
వార్డు కౌన్సిలర్లు
[మార్చు]- పిన్నంశెట్టి జ్యోతి
- బడే అనిత
- ఎం. బాలస్వామి
- పసుక కృష్ణ
- మహానున బేగం
- మేకల రమ్య
- బరిగెల రాములు
- బరిగెల లక్ష్మి
- నయీం
- షేక్ రహీమ్ పాషా
- పగిడల కరుణ
- పబ్బా హైమవతి
- ఎం. శిరిష
- భోగ్యం చిట్టెమ్మ
- పాండిల్ సత్యం
- నర్సింహారావు
- ఎం. కృష్ణమూర్తి
- మారేడు అలివేలు
- పటోళ్ళ శ్రీదేవి
- విజయలక్ష్మి
మూలాలు
[మార్చు]- ↑ "Kollapur Municipality". kollapurmunicipality.telangana.gov.in. Retrieved 12 April 2021.
- ↑ Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 12 April 2021.
- ↑ "Basic Information of Municipality, Kollapur Municipality". kollapurmunicipality.telangana.gov.in. Retrieved 12 April 2021.
- ↑ సాక్షి, తెలంగాణ (27 January 2020). "తెలంగాణ: మున్సిపల్ చైర్మన్లు వీరే". Sakshi. Archived from the original on 27 January 2020. Retrieved 12 April 2021.
- ↑ నమస్తే తెలంగాణ, తెలంగాణ (27 January 2020). "ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల జాబితా." ntnews. Archived from the original on 3 March 2021. Retrieved 12 April 2021.