కొల్లూరు శ్రీకృష్ణ
| కొల్లూరు శ్రీకృష్ణ | |
|---|---|
| జననం | 1958 అక్టోబరు 15 ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
| జాతీయత | భారతీయుడు |
| రంగములు |
|
| వృత్తిసంస్థలు |
|
| చదువుకున్న సంస్థలు | |
| ప్రసిద్ధి | హిందూ మహాసముద్రం పరిణామంపై అధ్యయనం |
| ముఖ్యమైన పురస్కారాలు |
|
కొల్లూరు శ్రీ కృష్ణ (జననం 1958) భారతీయ సముద్ర భూభౌతిక శాస్త్రవేత్త, భారతదేశంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలో మాజీ ప్రధాన శాస్త్రవేత్త.[1] హిందూ మహాసముద్ర పరిణామంపై చేసిన అధ్యయనాలకు ప్రసిద్ధి చెందాడు.[2] మూడు ప్రధాన భారతీయ సైన్స్ అకాడమీలలో ఆయన ఎన్నికైన సభ్యుడు: ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ, [3] ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, [4] నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. [5] భూమి, వాతావరణం, మహాసముద్రం, గ్రహ శాస్త్రాలలో ఆయన చేసిన కృషికిగాను కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, 2001 లో ఆయనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి శాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతిని ప్రదానం చేసింది.[6][note 1]
జీవిత చరిత్ర
[మార్చు]శ్రీకృష్ణ ఆంధ్రప్రదేశ్‌లో 1958 అక్టోబర్ 15న జన్మించాడు. 1979లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి సైన్స్‌లో పట్టభద్రుడయ్యాడు. 1982లో అదే విశ్వవిద్యాలయం నుండి జియోఫిజిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశాడు.[7] 1983లో టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్ అనుబంధ సంస్థ అయిన జియోఫిజికల్ సర్వీస్ ఇంక్.లో భూకంప శాస్త్రవేత్తగా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ కంపెనీ కృష్ణ-గోదావరి, కావేరి నదుల బేసిన్‌లలో హైడ్రోకార్బన్ అన్వేషణలలో పాల్గొంది. ఆ కంపెనీలో ఒక సంవత్సరం పనిచేసాడు.[8] 1984 లో అతను గోవాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (NIO)లో బి-గ్రేడ్ శాస్త్రవేత్తగా చేరాడు, అక్కడ 2009 నుండి ప్రధాన శాస్త్రవేత్త పదవిలో ఉన్నాడు. ఈ కాలంలో, అతను NIOలో అనేక శాస్త్రవేత్త పదవులను నిర్వహించాడు. 1996లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌డి కూడా పొందాడు.[1]
వారసత్వం
[మార్చు]శ్రీకృష్ణ అత్యంత ముఖ్యమైన రచనలలో ఒకటి హిందూ మహాసముద్రం పరిణామంపై ఆయన చేసిన అధ్యయనాలు. దానిపై ఆయన టెక్టోనిక్ నమూనాలను అభివృద్ధి చేసి, దానిని ధృవీకరించాడు.[2] హిమాలయాల ఉద్ధరణకు సంబంధించి మధ్య హిందూ మహాసముద్రంలో లిథోస్పిరిక్ అధ్యయనాల పైన, ప్రైమరీ హాట్‌స్పాట్స్ ఆఫ్ ది గ్లోబల్ ఓషన్స్ అండ్ మాంటిల్ సర్క్యులేషన్ పైనా[8] ఆయన విస్తృతమైన అధ్యయనాలను నిర్వహించాడు. దీని కోసం ఆయన సముద్ర యాత్రలు చేసాడు.[9] హిమాలయాల పెరుగుదల, బంగాళాఖాతంలో అవక్షేపణ, భారత రుతుపవనాల మధ్య సంబంధం గురించి విస్తృత అవగాహనకు ఆయన అధ్యయనాలు సహాయపడ్డాయి. ఆయన అధ్యయనాలను అనేక సాటివారి-సమీక్షిత వ్యాసాలలో వివరించాడు;[10][note 2] శాస్త్రీయ వ్యాసాల ఆన్‌లైన్ రిపోజిటరీ అయిన రీసెర్చ్‌గేట్, వాటిలో 80ఐదింటిని జాబితా చేసింది. [11]
2015లో జరిగిన అమెరికన్ జియోఫిజికల్ యూనియన్ శరదృతువు సమావేశానికి శ్రీకృష్ణ కన్వీనర్‌గా పనిచేసాడు. 2015 డిసెంబర్ 16 న జరిగిన సెషన్‌కు అధ్యక్షత వహించాడు. బంగాళాఖాతంలో అవక్షేప వ్యాప్తి నమూనా- బెంగాల్ ఫ్యాన్ అవక్షేపణ ప్రారంభానికి ఆధారాలు పై ఒక పత్రాన్ని సమర్పించాడు. ఆయనకు అనేక సైన్స్ జర్నల్స్‌తో సంబంధం ఉంది; 2005 నుండి 2010 వరకు అమెరికన్ జియోఫిజికల్ యూనియన్ ప్రచురించిన జర్నల్ ఆఫ్ జియోఫిజికల్ రీసెర్చ్ లోని సాలిడ్ ఎర్త్ విభాగానికి అసోసియేట్ ఎడిటర్‌గా పనిచేశాడు. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెరైన్ సైన్సెస్ (2008–10), ప్రొసీడింగ్స్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (2015), అసోసియేషన్ ఆఫ్ ఎక్స్‌ప్లోరేషన్ జియోఫిజిసిస్ట్స్ (2015) సంపాదకీయ బోర్డులలో ఉన్నాడు.[7]
పురస్కారాలు, గౌరవాలు
[మార్చు]శ్రీకృష్ణ 1996 లో ఇండియన్ జియోఫిజికల్ యూనియన్ వారి కృష్ణన్ పతకాన్ని అందుకున్నాడు; IGU 2010 లో మళ్ళీ అతనిని తన దసాబ్ది పురస్కారంతో సత్కరించింది. [12] ఈలోగా, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ 2001 లో అత్యున్నత భారతీయ సైన్స్ అవార్డులలో ఒకటైన శాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతిని ప్రదానం చేసింది. [13] 2010 సంవత్సరం అతనికి గనుల మంత్రిత్వ శాఖ వారి నేషనల్ జియోసైన్సెస్ పురస్కారం లభించింది.[14] 2013 లో ఇండియన్ జియోఫిజికల్ యూనియన్ వారి తొలి అన్నీ తల్వాని మెమోరియల్ బహుమతిని అందుకున్నాడు.[15]
శ్రీకృష్ణ లండన్ రాయల్ సొసైటీ వారి రెండు ఫెలోషిప్‌లను పొందాడు; 1999లో INSA-రాయల్ సొసైటీ ఫెలోషిప్, 2008లో అంతర్జాతీయ ఫెలోషిప్. [7] ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ 2002లో అతనిని తన ఫెలోగా ఎన్నుకుంది.[4] మరో రెండు ప్రధాన భారతీయ సైన్స్ అకాడమీలైన నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీలు 2010, 2013లో కూడా అతన్ని సభ్యుడుగా తీసుకున్నాయి.[5] అతను ఇండియన్ జియోఫిజికల్ యూనియన్ (2002),[16] ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (2011) లకు కూడా ఎన్నికైన ఫెలో. 2012లో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం వారి జెసి బోస్ నేషనల్ ఫెలోషిప్ కూడా పొందాడు. అతను చేసిన అవార్డు ప్రసంగాలలో 2016 లో తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వారి ఎస్. బాలకృష్ణ మెమోరియల్ ప్రసంగం ఒకటి.[7]
ఎంచుకున్న గ్రంథ పట్టిక
[మార్చు]- Krishna, K. S., Mohammad Ismaiel, Karlapati Srinivas, D. Gopala Rao, J Mishra, D Saha (2016). "Sediment pathways and emergence of Himalayan source material in the Bay of Bengal".
- Krishna, K. S. (2009). "Geoid and gravity anomaly data of conjugate regions of Bay of Bengal and Enderby Basin: new constraints on breakup and early spreading history between India and Antarctica".
- Chatterjee, Sirsendu (2007). "Validation of ERS-1 and high-resolution satellite gravity with in-situ shipborne gravity over the Indian offshore regions: accuracies and implications to subsurface modeling".
- Krishna, K. S. (2002). "Formation of diapiric structure in the deformation zone, central Indian Ocean: a model from gravity and seismic reflection data".
- Krishna, K. S. (1999). "Paleocene on-spreading-axis hotspot volcanism along the Ninetyeast Ridge: an interaction between the Kerguelen hotspot and the Wharton spreading center".
ఇవి కూడా చూడండి
[మార్చు]- దక్షిణ ఆసియా రుతుపవనాలు
- ప్రశాంత్ గోస్వామి
గమనికలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Details of Dr. Kolluru Sree Krishna". Ocean Expert. 2016.
- ↑ 2.0 2.1 "Brief Profile of the Awardee". Shanti Swarup Bhatnagar Prize. 2016. Retrieved 12 November 2016.
- ↑ "Indian fellow". Indian National Science Academy. 2016. Archived from the original on 2023-02-14. Retrieved 2026-01-29.
- ↑ 4.0 4.1 "Fellow profile". Indian Academy of Sciences. 2016.
- ↑ 5.0 5.1 "NASI fellows" (PDF). National Academy of Sciences, India. 2016. Archived from the original (PDF) on 2015-08-06.
- ↑ "View Bhatnagar Awardees". Shanti Swarup Bhatnagar Prize. 2016. Retrieved 12 November 2016.
- ↑ 7.0 7.1 7.2 7.3 "Faculty profile". National Institute of Oceanography. 2016.
- ↑ 8.0 8.1 "Dr. K.S. Krishna becomes a Fellow of the National Academy of Sciences, India". National Institute of Oceanography. 2016.
- ↑ "Understanding the Structure and Tectonics of the Indian Ocean". Ocean Leadership. 2008.
- ↑ "Browse by Fellow". Indian Academy of Sciences. 2016.[permanent dead link]
- ↑ "On ResearchGate". 2016.
- ↑ "Krishnan Medal". Indian Geophysical Union. 2016. Archived from the original on 2016-12-20. Retrieved 2026-01-29.
- ↑ "Earth Sciences". Council of Scientific and Industrial Research. 2016. Archived from the original on 2016-03-03.
- ↑ "Smt. Meira Kumar Confers National Geoscience Awards-2010" (PDF). Ministry of Mines. 2010. Archived from the original (PDF) on 2 November 2013. Retrieved 31 December 2016.
- ↑ "Annie Talwani Memorial Prize". Indian Geophysical Union. 2016. Archived from the original on 2016-12-20. Retrieved 2026-01-29.
- ↑ "IGU fellows" (PDF). Indian Geophysical Union. 2016. Archived from the original (PDF) on 2023-03-15. Retrieved 2026-01-29.