Coordinates: 16°42′00″N 74°14′00″E / 16.7000°N 74.2333°E / 16.7000; 74.2333

కొల్హాపూర్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  ?కొల్హాపూర్
మహారాష్ట్ర • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 16°42′00″N 74°14′00″E / 16.7000°N 74.2333°E / 16.7000; 74.2333
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 569 మీ (1,867 అడుగులు)
జిల్లా (లు) కొల్హాపూర్
జనాభా 4,19,000 (2001 నాటికి)
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్
వాహనం

• 416001
• +0231
• MH-09


కొల్హాపూర్ (మరాఠీ:कोल्हापूर) ఉత్తర మహారాష్ట్రలో ఒక పట్టణం , జిల్లా ప్రధానకేంద్రం. ఈ పట్టణం భారతదేశంలోని అత్యంత పురాతనమైన నగరాలలో ఒకటి. దీని ప్రస్తుత జనాభా ఇంచుమించుగా 419,000 ఉంటుంది. ఇక్కడి ప్రధాన భాష మరాఠీ. ఇది పంచగంగ నది ఒడ్డున ఉంది. ఇక్కడి మహాలక్ష్మి దేవాలయం బాగా ప్రసిద్ధిచెందినది. ఈ పట్టణం కొల్హాపూర్ చెప్పులకు కూడా ప్రసిద్ధి.

చూడవలసిన ప్రదేశాలు[మార్చు]

కొల్హాపూర్ లో ముఖ్యంగా చూడవలసినవి మహాలక్ష్మి దేవాలయం , మహారాజ భవనం.

కొల్హాపూర్ మహాలక్ష్మి

మహాలక్ష్మి దేవాలయం 'హేమాడ్ పంతి' నిర్మాణశైలిలో కట్టబడింది. ఇది చాలా విశాలమైన ప్రాంగణంలో చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడతో ఉంటుంది. ప్రాంగణం మధ్యలో ఉన్న అమ్మవారి ఆలయం ఒక అద్భుత కళాసృష్టి అని చెప్పవచ్చు. ఆలయమంతా మనోహరమైన శిల్పాలతో నిండి ఉంటుంది. పశ్చిమాభిముఖంగా ఉండే గర్భగుడి ముందుగా సుమారు వందడుగుల పొడవు గల విశాలమైన మండపం ఉంటుంది. గర్భగుడి చుట్టూ సన్నని ప్రదక్షిణ మార్గం ఉంది.

గర్భగుడిలో సుమారు ఆరడుగుల చదరంగా ఉన్న ఎత్తైన వేదిక మీద రెండడుగుల పీఠం, దానిమీద మహాలక్ష్మి విగ్రహం కూర్చొని ఉన్న భంగిమలో ఉంటుంది. మూడడుగుల ఎత్తున్న మూర్తి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. మహారాష్ట్రీయులకు కొల్హాపూర్ మహాలక్ష్మి అత్యంత పవిత్ర యాత్రాస్థలం. వీరు అమ్మవారిని 'అంబాబాయి' అని పిలుస్తారు. ఇక్కడ జరిగే ప్రధాన ఉత్సవం నవరాత్రి ఉత్సవం. ముఖ్యంగా ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు విశేషంగా గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఆ రోజున అమ్మవారి ఉత్సవమూర్తిని నగరానికి తూర్పుగా ఐదు కి.మీ. దూరంలో ఉన్నతెంబ్లాయి అమ్మవారి ఆలయం దగ్గరికి ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు. ఇదిగాక చైత్ర పూర్ణిమ రోజున జరిగే ఉత్సవంలో అమ్మవారిని నగరమంతా ఊరేగిస్తారు. గుడి ప్రాంగణంలో ఉన్న అనేక ఆలయాలలో విఠోబా ఆలయం కూడా చాలా పురాతనమైనది.

ఇక మహారాజ భవనం సుమారు రెండు వందల గదులతో మూడు అంతస్తులతో చక్కగా విశాలమైన మైదానం మధ్యలో ఉంటుంది. ఆనాటి రాజుల ఆయుధాలు, రాజరికపు సామగ్రి మొదలైనవి ఇందులో పొందుపరిచారు.

కొల్హాపూర్ సంస్థానం[మార్చు]

కొల్హాపూర్ సంస్థాన పతాకము

కొల్హాపూర్ బ్రిటిష్ కాలంలో బొంబాయి ప్రెసిడెన్సీలో ఒక ప్రముఖ సంస్థానం. ఆ కాలంలో నాలుగు ముఖ్యమైన సంస్థానాలలో ఒకటి; మిగిలిన మూడు బరోడా, గ్వాలియర్ , ఇండోర్. దీని పాలకులైన బోంస్లే రాజ్యం 19-గన్ సెల్యూట్ కు అర్హులు.

కొల్హాపూర్ జిల్లా పటం

కొల్హాపూర్ సంస్థానం క్రింద 3,165 చదరపు మైల్లు (8,200 చ.కి.మీ.) ఉండేది. ఈ సంస్థానంలో 1901 జనాభా లెక్కల ప్రకారం దీనిలో 910,011, ప్రజలు నివసించేవారు, వీరిలో 54,373 కొల్హాపూర్ పట్టణంలో ఉండేవారు. దీని ఆదాయం £300,000.

కొల్హాపూరును పరిపాలించిన రాజులు, తంజావూరు , సతారాలను పాలించిన భోంసాలే వంశాల వలె మరాఠా భోంసాలే రాజవంశము నుండి ఉద్భవించారని చెప్పుకుంటారు. మరాఠా సామ్రాజ్య వారసత్వ విషయమై తలెత్తిన వివాదాల వలన సతారా , కొల్హాపూరు రాజ్యాలు 1707లో ఏర్పడ్డాయి.

మరాఠా సామ్రాజ్యానికి వారసుడైన షాహూ శంభాజీని మొగలులు తొమ్మిదేళ్ళ వయసులో పట్టి బంధించి ఖైదులో ఉంచారు. షాహూ శంభాజీ తండ్రి, మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన ఛత్రపతి శివాజీ పెద్దకొడుకు శంభాజీ. శంభాజీ మరణం తర్వాత శివాజీ చిన్నకొడుకు రాజారాం ఛత్రపతి అయ్యాడు. 1700లో అనారోగ్యము వలన రాజారాం మరణించగా ఆయన భార్య మహారాణి తారాబాయి తన కొడుకు రెండవ శంభాజీని మహారాజుగా ప్రకటించి, తాను ప్రతినిధిగా పాలించింది. 1707లో మెగలులు కొన్ని షరతులతో షాహూను విడుదల చేశారు. విడుదలైన షాహూ తన వంశానుగతమైన రాజ్యాన్ని తిరిగి పొందే ప్రయత్నం చేశాడు.

నూతన రాజసౌధం, కొల్హాపూర్

ఖేడ్ వద్ద జరిగిన యుద్ధంలో షాహూ, తారాబాయి ఓడించి సతారాపై తన అధికారాన్ని స్థాపించాడు. ఓడిపోయిన రాణి తన కొడుకుతో కలిసి కొల్హాపూరులో స్థిరపడింది. 1710 కల్లా రెండు వేర్వేరు రాజ్యాలుగా పరిణమించాయి. దీన్ని 1731లో కుదుర్చుకున్న వార్నా సంధి ధ్రువీకరించింది.

బ్రిటీషు వారు కొల్హాపూరుపై 1765లోనూ, 1792లోనూ సైన్యాన్ని పంపారు. 1812లో మరాఠా సామ్రాజ్య పతనం తర్వాత కొల్హాపూరు రాజులు బ్రిటీషు వాళ్లతో సంధి కుదుర్చుకున్నారు. 19వ శతాబ్దపు తొలినాళ్లలో బ్రిటీషువారు తిరిగి కొల్హాపూరుపై దాడిచేసి, తాత్కాళికంగా రాజ్యవ్యవహారాలు నిర్వహించడానికి ఒక రాజకీయ అధికారిని నియమించారు.

కొల్హాపూరు చివరి పాలకుడైన మహారాజా ఛత్రపతి రెండవ షాహాజీ పువర్ 1947లో భారత స్వాతంత్ర్యానంతరం కొల్హాపూరును 1947, ఆగస్టు 14న భారతదేశంలో విలీనం చేశాడు. కొల్హాపూరు రాజ్యం 1949, మార్చి 1న బొంబాయి రాష్ట్రంలో కలిసిపోయింది. 1960లో భాషాప్రాతిపదికన బొంబాయి రాష్ట్రము మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలుగా విభజించిబడినప్పుడు, కొల్హాపూరు సంస్థానము యొక్క సరిహద్దులు, కొల్హాపూరు జిల్లా సరిహద్దులైనవి.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]