కోగంటి గోపాలకృష్ణయ్య
కోగంటి గోపాలకృష్ణయ్య తెలుగు నాటక రచయిత, గాయకుడు.అతను కొన్ని వందల గేయాలను వ్రాశాడు.
జీవిత విశేషాలు
[మార్చు]అతను కృష్ణా జిల్లా బొమ్ములూరులో 1923 ఏప్రిల్ 23న జన్మించాడు. అతనికి చిన్నతనం నుండి నాటకాలపట్ల ఆసక్తి. ఐదో తరగతి చదువుతున్నప్పుడే అరుగుల మీద పరదాలు కట్టి నాటకాలు ఆడేవాడు. అలా పెరిగిన ఆసక్తి ఫాసిస్టు వ్యతిరేకోద్యమంలో పెద్దదైంది. తమ ఆసక్తికి అనుగుణమైన పాటల్ని, సాహిత్య కళారూపాల్ని తామే ఏర్పాటు చేసుకోవలసి వచ్చింది. ప్రజాశక్తినగర్ గుడ్డిదీపం వెలుగులో "హిట్లర్ పరాబహ్వం" వీధి బాగోతం రాసాడు.
బెంగాల్ కరువు, రాయలసీమ కరువు కాలంలో జోలెకట్టుకొని బజారుల్లో, రైల్వే స్టేషన్లలో పాటలు పాడుతూ చిత్ర విచిత్ర వేషాలు వేస్తూ డాబ్బు వసూలు చేసాడు.
బొంబాయి వైజ్ఞానిక ప్రదర్శనల్లో కోగంటి కోయవేషం మంచి పేరు సంపాదించింది. బొంబాయి నుండి వచ్చాక ద్విగుణీకృత ఉత్సాహంతో పనిచేసాడు. అతనికున్న లయజ్ఞానం అసమానమైనది. అతి తక్కువ సమయంలో పాటలు రాసేవాడు.. ప్రతి పాటకు ఏదో ఒక ప్రజల పాట బాణీ ఉండేది. అతని పాటలకు ప్రేక్షకులను, శ్రోతలను ఆకర్షించే గుణం ఉండేది.
1944 భోనగిరి ఆంధ్రసభ కార్యక్రమాలకు హాజరయ్యాడు. సభల తదుపరి అక్కడే ఉండి తెలంగాణా ప్రజల జీవితాన్ని దగ్గరగా చూసాడు. భోనగిరి సభల్లో జాగీరు రైతుల గురించి పాటలు రాసాడు. తెలంగాణాకి రాకముందే రాజమండ్రిలో అరెస్టు కాబడి 9 నెలల జైలు శిక్ష అనుభవించాడు.
తెలంగాణ పోరాటాం వివిధ దశల్లోనూ పాటలు రాసి వేదిక మీద పాడేవాడు. అందులో కొన్ని పాటలు తెలంగాణా ప్రజల దాకా వచ్చాయిఅ."ఓయ్ హోయ్ నైజామోయ్" పాట మొదట "జాపానోయ్" అని రాసాడు. దాన్నే కొద్దిగా మార్చి తలంగాణాకు అన్వయించాడు. ఈ పాటని ప్రజలు తమకు తోచిన బాణీలో పాడుకున్నారు. నైజాం రాజుని దృష్టిలో పెట్టుకొని "బద్మాష్‌పాదుషా" వీధి నాటకాన్ని రాసాడు. పోలీసులు ఈ పుస్తకాన్ని నిషేధించారు. ప్రతులన్నింటినీ కాల్చివేసారు. 60,70 ప్రదర్శనలు కూడా జరిగాయి.. ఇంద్రజాలం-వీధినాటకం, పేరిగాడిరాజ్యం, జలియుగ కురుక్షేత్రం మొదలగు కళారూపాలు వెలువరించాడు.
అతను కవి, గాయకుడూ, నటులూ ప్రయోక్త కావడం వల్ల వందలాది ప్రదర్శనలు ఇవ్వగలిగాడు. ఆ క్రమంలోనే ఎస్.వి.కె. ప్రసాద్ ద్వారా వరంగల్, హైదరాబాదు, సూర్యాపేట మొదలగు ప్రాంతాలు ప్రదర్శించామని ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. ఐతే ఎలాంటి ప్రదర్శనలు ఇచ్చారో వివరాలు తెలియిఅదు. "తెలుగునాడంత మేల్కొన్నదోయ్ తెలంగాణ ప్రజల కండగ నున్నారోయ్" అని 1946 చివరిలోనే తెలంగాణా ప్రజలకు హామీ ఇచ్చాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ Pruthvi Azad (2015-04-04). "2014 03-28 131848-farmerstruggle2".
{{cite journal}}
: Cite journal requires|journal=
(help)