కోచింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కోచింగ్ అనేది ఒక అభివృద్ధి కార్యక్రమం. దీనిలో అనుభవజ్ఞుడైన వ్యక్తి అభ్యాసకుడికి శిక్షణ, మార్గదర్శకత్వం అందిస్తూ అతడొక నిర్దిష్ట వ్యక్తిగత లేదా వృత్తిపరమైన లక్ష్యాన్ని సాధించడంలో తోడ్పడతాడు . [1] అనుభవజ్ఞుడైన వ్యక్తిని కోచ్ అంటారు. అప్పుడప్పుడు, కోచింగ్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక అనౌపచారిక (ఇన్‌ఫార్మల్) సంబంధం అని అనుకోవచ్చు. వీరిలో ఒకరికి మరొకరి కంటే ఎక్కువ అనుభవం, నైపుణ్యం ఉంటుంది. రెండవవారికి సలహాలు, మార్గదర్శకత్వం అందిస్తారు. కోచింగ్, మెంటరింగ్ లాగా కాకుండా, నిర్దుష్టమైన పనులు లేదా లక్ష్యాలపై దృష్టి పెడుతుంది. [1] [2] [3]

ఉద్భవం[మార్చు]

"కోచ్" అనే పదాన్ని మొదటిసారిగా 1830 లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఓ బోధకుడు ఒక విద్యార్థిని పరీక్షకు "సిద్ధం చేసిన"పుడు పుట్టింది. [4] "కోచింగ్" అనేది ప్రజలను తామున్న స్థానం నుండి తాము చేరదలచిన స్థానానికి తీసుకువెళ్ళే ప్రక్రియ. క్రీడలకు సంబంధించి ఈ పదాన్ని మొదటిగా 1861 లో ఉపయోగించారు. [4]

వర్తనం[మార్చు]

క్రీడలు, కళలు, నటన (ఆంగికం, వాచికం, అభినయాల్లో కోచ్‌లు), వ్యాపారం, విద్య, ఆరోగ్య సంరక్షణ, సంబంధాలు (ఉదాహరణకు, పాశ్చాత్య దేశాల్లో డేటింగ్ కోచ్‌లు) వంటి రంగాలలోకి కోచింగ్ విస్తరించింది. క్లయింట్లు వారి దృక్కోణాలను మార్చుకోడానికి, తద్వారా వారి లక్ష్యాలను సాధించడానికి వేర్వేరు విధానాలను కనుగొనడంలో కోచ్‌లు అనేక రకాల కమ్యూనికేషన్ నైపుణ్యాలను ఉపయోగిస్తారు. [5] ఈ నైపుణ్యాలను దాదాపు అన్ని రకాల కోచింగ్‌లలో ఉపయోగించవచ్చు. ఈ కోణంలో, కోచింగ్ అనేది ఒక "మెటా-ప్రొఫెషన్" అని చెప్పవచ్చు. కొన్ని రకాల కోచింగ్ కార్యకలాపాలు ఒకదాని లోకి మరొకటి అతివ్యాప్తి (ఓవర్‌ల్యాప్) చెందవచ్చు. [6] కోచింగ్ విధానాలు సాంస్కృతిక భేదాల ద్వారా కూడా ప్రభావితమవుతాయి. [7]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Passmore, Jonathan, ed. (2016) [2006]. Excellence in Coaching: The Industry Guide (3rd ed.). London; Philadelphia: Kogan Page. ISBN 9780749474461. OCLC 927192333.
  2. Renton, Jane (2009). Coaching and Mentoring: What They are and How to Make the Most of Them. New York: Bloomberg Press. ISBN 9781576603307. OCLC 263978214.
  3. Chakravarthy, Pradeep (20 December 2011). "The Difference Between Coaching And Mentoring". Forbes. Retrieved 4 July 2015.
  4. 4.0 4.1 .
  5. .
  6. Cox, Elaine; Bachkirova, Tatiana; Clutterbuck, David, eds. (2018) [2010]. The Complete Handbook of Coaching (3rd ed.). Los Angeles; London: Sage Publications. ISBN 9781473973046. OCLC 1023783439.
  7. Rosinski, Philippe (2003). Coaching Across Cultures: New Tools for Leveraging National, Corporate, and Professional Differences. London; Yarmouth, Maine: Nicholas Brealey Publishing. ISBN 1857883012. OCLC 51020293.
"https://te.wikipedia.org/w/index.php?title=కోచింగ్&oldid=3810544" నుండి వెలికితీశారు