కోట (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కోట
—  మండలం  —
నెల్లూరు జిల్లా పటములో కోట మండలం యొక్క స్థానము
నెల్లూరు జిల్లా పటములో కోట మండలం యొక్క స్థానము
కోట is located in ఆంధ్ర ప్రదేశ్
కోట
ఆంధ్రప్రదేశ్ పటములో కోట యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°02′00″N 80°03′00″E / 14.0333°N 80.0500°E / 14.0333; 80.0500
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా నెల్లూరు
మండల కేంద్రము కోట
గ్రామాలు 19
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 51,172
 - పురుషులు 26,410
 - స్త్రీలు 24,762
అక్షరాస్యత (2001)
 - మొత్తం 65.08%
 - పురుషులు 72.43%
 - స్త్రీలు 57.17%
పిన్ కోడ్ {{{pincode}}}
{{{official_name}}}
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

కోట గ్రామము కోట మండలానికి చెందిన గ్రామము. ఇది నెల్లూరు జిల్లాలో ఉంది.

కోట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక గ్రామము మరియు మండలము. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు రాజకీయ కేంద్రంగా దీన్ని అభివర్ణించడం జరుగుతుంది. మండలంలో ఉన్న 19 గ్రామాలలో ఇది ఒకటి.కోట చెన్నై - కొలకత్తా రహదారికి తూర్పున 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనా కేంద్రం మరియు నేలపట్టు పక్షుల సంరక్షణా కేంద్రం ఇక్కడకు 40 కిలోమీటర్ల దూరంలో ఉనాయి. కోట సముద్రమట్టానికి 8 మీటర్ల ఎత్తులో ఉంది.

ఓ చిన్న గుట్ట దాని పక్కనే సాగే యేరు. ఆ నడుము వొంపులో మా ఊరు, ఊరి మధ్యలోని ఆంజనేయ స్వామీ గుడి గంటలు మోగుతూ పవిత్రంగా కనిపిస్తుంది ఈ ఊరు. స్వర్ణముఖీ నది సముద్రంలో కలిసే ముందు రెండు పాయలుగా చీలి సాగితే దానిలోని ఒక పాయ చల్ల కాలువ పక్కన ఈ ఊరు ఉంటుంది.ఇది మండల కేంద్రం.బంగాళా ఖాతంకి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉంది.స్వర్ణ ముఖి రెండుగా చీలిన ఊరు గూడలి. ఇక్కడ సంగమేశ్వరుడు అగస్త్యుడు ప్రతిష్ఠించాడు అని ప్రతీతి.

పంటలు వాణిజ్యం[మార్చు]

ఇక్కడ మాగాణి.వరి,వేరు శెనగ,అరటి ఇలాంటి పంటలు బాగా పండుతాయి.మాగుంట .సుబ్బ రామిరెడ్డి గారు ఇక్కడకు పది కిలోమీటర్ల దూరంలో గల సముద్ర తీరం తూపిలి పాళెంలో రొయ్యల హచరీస్ పెట్టిన తరువాత ఇక్కడ చుట్టు పక్కల కూడా పొలాలు కొన్ని రొయ్యల గుంటలుగా మారిపోయాయి.ఇక్కడి నుండి టైగర్ రొయ్యలు ఒకప్పుడు బాగా ఎగుమతి అయ్యేవి.

సముద్రతీరం[మార్చు]

ఇక్కడ నుండి సముద్రాన్ని చూడాలి అంటే తూపిలి పాళెం, గుమ్మల్ల దిబ్బ, దుగారాజపట్నం, ఈ మూడు తీరాలికి వెళ్లి చూడొచ్చు. గుమ్మల్ల దిబ్బకు వెళితే పడవ షికారు చేయడమే కాక, అటు వైపు కృష్ణ పట్నం ఓడ రేవు చూడొచ్చు.

గ్రామదేవత[మార్చు]

 1. ఈ ఊరి గ్రామ దేవత కోటమ్మ. ఆమె పేరు మీద ఈ ఊరికి ఆ పేరు వచ్చింది. జమదగ్ని మహర్షి రేణుకా దేవి తలను ఖండించమని తన పుత్రుడు పరశురాముని ఆదేశించితే, ఇక్కడే ఆయన తల నరికాడు అని ప్రశస్తి. అయితే ఖండించిన తరువాత తల అతికించేటపుడు, తొందరలో పక్కనే ఉండే మాతమ్మ తల కోటమ్మకు (రేణుకా దేవికి), కోటమ్మ తల మాతమ్మకు అతికించాడు అంటారు. ఇప్పటికీ కోటమ్మ తిరనాళలో జమదగ్ని ఋషి, పరుశురాముడు, మాతమ్మ విగ్రహాలు ఊరేగిస్తూ ఉంటారు.
 2. గ్రామదేవత కోటమ్మ సాగనంపు ఉత్సవం, 2014, జూన్- 20, శుక్రవారం నాడు, ఘనంగా నిర్వహించారు. కోటమ్మ ఉత్సవ విగ్రహానికి ప్రట్యేక ఆభరణాలతో విశిష్ట అలంకరణలు చేసారు. ఉత్సవంలో భక్తులు, దారిపొడవునా కర్పూరహారతులిచ్చుచూ, అమ్మవారి దర్శనం చేసుకున్నారు. కీలుగుర్రాల విన్యాసాలు అలరించినవి. చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నవి. [1]
 3. ఈ ఆలయంలో శ్రావణపూర్ణిమ సందర్భంగా, 2014, ఆగస్టు -10, ఆదివారం నాడు, అమ్మవారికి ఘనంగా విశిష్టపూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేకంగా పుష్పాలంకరణ చేసారు. మేళతాళాలతో, బాణసంచా వేడుకలతో పొంగళ్ళుపెట్టి, పూజలు చేసారు, నైవేద్యాలు సమర్పించారు. [2]

ఇతర ఆలయాలు[మార్చు]

 • ఇక్కడే గంగమ్మ గుడి, నాగ దేవత పుట్ట ఉంటుంది.
 • పెళ్ళి కూతుర్ని చేసినా, పిల్లలు పుట్టక పోయినా, పుట్టిన తరువాత అయినా ఇక్కడకు వచ్చి మొక్కుకోవడం, పొంగలితో మొక్కు తీర్చుకోవడం, ఇక్కడి వాళ్లకు అలవాటు.

ప్రముఖులు[మార్చు]

రాజకీయ ప్రాముఖ్యత[మార్చు]

రాజకీయంగా మంచి పేరు. జిల్లా రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉంటూ నడిపించే నల్లపరెడ్డివాళ్ళు ఈ ఊరి వాళ్ళే.కోవూరు కంచు కోటగా ఒక్క సారి తప్ప ప్రతి సారీ ఏ పార్టీలో అయినా గెలిచి శాసన సభకు ప్రాతినిధ్యం వహించారు వాళ్ళు.

శ్రీనివాసుల రెడ్డి[మార్చు]

నల్లపరెడ్డి .శ్రీనివాసుల రెడ్డి గారు రెవిన్యూ మినిష్టర్ గా చాలా సేవలు రాష్ట్రానికి అందించారు.ఏ సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళినా ప్రతి వంతెన మీద ఆయన పేరే ఉంటుంది. ఇక్కడి వాళ్ళు ఇంత అభివృద్ధి చెందటానికి ఆయన కృషి చాలా ఉంది. దీనికి గుర్తుగా వాళ్ళ విగ్రహాలు కూడా ఇక్కడ ఉంటాయి.

వివరణ[మార్చు]

 • జిల్లా: నెల్లూరు
 • భాష: తెలుగు
 • రెవెన్యూ డివిజన్: గూడూరు
 • అసెంబ్లీ నియోజకవర్గం: గూడూరు
 • పార్లమెంట్ నియోజకవర్గం: నెల్లూరు
 • పోస్టల్ కోడ్లు: 524 411 (కోటా), 524 413 (విద్యా నగర్)

విద్య[మార్చు]

పంచాయతీ రాజ్, ప్రభుత్వం మరియు సహాయక సంస్థలు

 • స్కూల్ విద్య - సెకండరీ స్కూల్ విద్య (ఎస్.ఎస్.సి ) బోర్డు, ఎ.పి
 • ఇంటర్మీడియట్ విద్య - ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎ.పి
 • ఈ ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థానిక ప్రాంతం కింద వస్తుంది.
 • ఉన్నత పాఠశాలలు: 4
 • జూనియర్ కళాశాలలు: 1
 • డిగ్రీ కళాశాలలు: 1

పాఠశాలలు[మార్చు]

 • ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలలు: 67
 • ఉన్నత పాఠశాలలు: 11
 • జూనియర్ కళాశాలలు: 3
 • డిగ్రీ కళాశాలలు: 2
 • B.Ed కళాశాలలు: 1
 • ఇంజనీరింగ్ కళాశాలలు: 1

ప్రముఖులు[మార్చు]

పార్లమెంట్ శ్రీ సభ్యులు, పనబాక లక్ష్మీ (నెల్లూరు) కోటా గ్రామంలో నుండి.

గణాంకాలు[మార్చు]

 • 2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
 • జనాభా 15590
 • పురుషుల సంఖ్య 8387
 • స్త్రీల సంఖ్య 7203
 • నివాసగృహాలు 3370
 • విస్తీర్ణం 1524 హెక్టారులు
 • ప్రాంతీయ భాష తెలుగు

సమీప గ్రామాలు[మార్చు]

 • సిద్దవరం 1 కి.మీ
 • శ్రీనివాససత్రం 1 కి.మీ
 • జరుగుమల్లి 1 కి.మీ
 • తిన్నెలపూడి 1 కి.మీ
 • వంజివాక 1 కి./మీ

సమీప మండలాలు[మార్చు]

 • దక్షణాన వాకాడు మండలం
 • దక్షణాన చిత్తమూరు మండలం
 • పశ్చిమాన చిల్లకూరు మండలం
 • పశ్చిమాన ఓజిలి మండలం

ప్రయాణ వసతులు[మార్చు]

భారతదేశంలోని ఇతర భూభాలతో కోట రహదారి మార్గం ద్వారా చక్కగా అనుసంధానించబడింది. సమీపంలో ఉన్న రైల్వేస్టేషన్ గుడూరు జంక్షన్. ఇది చెన్నై- విజయవాడ మరియు తిరుపతి-విజయవాడ మార్గాల కూడలి. సమీపంలో ఉన్న హార్బర్ చెన్నై.

కోడ్స్[మార్చు]

 • పిన్ కోడ్: 524411
 • ఎస్.టీ.డీ.కోడ్:
 • వాహనం రిజిస్ట్రేషన్ కోడ్:

మండలంలో గ్రామాలు[మార్చు]
వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు నెల్లూరు; 2014, జూన్-21; 9వపేజీ. [2] ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి; 2014, ఆగస్టు-11; 1వపేజీ.