కోడలు పిల్ల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోడలు పిల్ల
(1972 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం.మల్లికార్జునరావు
తారాగణం కృష్ణ,
కె.ఆర్.విజయ
సంగీతం జి.కె. వెంకటేష్
నిర్మాణ సంస్థ జై శంకర్ & కో
భాష తెలుగు

కోడలు పిల్ల 1972, జూన్ 29వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో నాగభూషణం ద్విపాత్రాభినయం చేశాడు.

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: ఎం.మల్లికార్జునరావు
  • నిర్మాత: నారాయణన్ చెట్టియార్
  • కథ: బాలమురుగన్
  • సంభాషణలు: రాజశ్రీ
  • పాటలు: ఆరుద్ర, అనిసెట్టి
  • సంగీతం: జి.కె.వెంకటేష్
  • నేపథ్య గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి
  • ఛాయాగ్రహణం: ప్రకాష్
  • కూర్పు: ప్రకాశం

పాటలు[మార్చు]

పాట రచయిత సంగీతం గాయకులు
నన్ను తాకిరి ఎవ్వరో ఎవ్వరో ఆరుద్ర జి.కె.వెంకటేష్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
ఆ గోపాలుడు ఆరుద్ర జి.కె.వెంకటేష్ ఎస్.జానకి
దీనులను కావ ఆరుద్ర జి.కె.వెంకటేష్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,ఎస్.జానకి
తైతక్కలాడు ఆరుద్ర జి.కె.వెంకటేష్ పి.సుశీల

కథ[మార్చు]

శశిభూషణం, నాగభూషణం ఇద్దరూ అన్నదమ్ములు. ఇద్దరిదీ ఒకే పోలిక. కాని మనస్తత్వాలు వేరు. శశిభూషణం ఉత్తముడు. పరోపకారి. నాగభూషణం దుర్మార్గుడు. మద్యం, మగువ మొదలైన దుర్వ్యసనాలకు లోనైనవాడు. దుర్వ్యసనాలకు లోనై తన ఆస్తినంతా పోగొట్టుకుంటాడు. ఇలాంటి నాగభూషణం ఒక హత్య చేసి, ఆ హత్యానేరం నుండి తప్పించుకోవడానికి వేరేమార్గం లేక తన అన్న శశిభూషణాన్ని హత్యచేస్తాడు. తానే శశిభూషణంగా చలామణీ అవుతూ వస్తాడు. అసలు విషయం తెలియని లోకం అతడే శశిభూషణమని, నాగభూషణం మరణించాడని నమ్మింది. ఆవిధంగా నాగభూషణం తన అన్నపేరు పెట్టుకుని పైకి అన్నలాగే దానధర్మాలు చేస్తూ ఊళ్ళో ఉత్తముడని పేరు పొందాడు. లోపల మాత్రం అనేక అకృత్యాలు చేస్తూ వచ్చాడు. అనేకమంది స్త్రీలను చెరిచి, తనకు ఎదురు తిరిగినవారిని హత్యలు చేయించి, వాటిని ఆత్మహత్యలుగా చిత్రించాడు. అన్నగారి భార్య అన్నపూర్ణను, కొడుకు భాస్కర్‌ను ఊళ్ళోనుంచి వెళ్ళగొట్టాడు. తన భార్య లక్ష్మి, కొడుకు రాజాలను కూడా దిక్కులేనివారిని చేశాడు. తన దగ్గర నౌకరు రామయ్య కూతురు సుమతిపై నాగభూషణం కన్నుపడింది. తనకు ఎదురుతిరిగిన రామయ్యను హత్యచేయించాడు. విషయం తెలుసుకున్న సుమతి నాగభూషణంపై కక్షబూనింది. శశిభూషణంగా చలామణీ అవుతున్న నాగభూషణానికే కోడలు అయ్యి, భాస్కర్ సహాయంతో అతని నిజరూపం బయట పెట్టి తన పగ తీర్చుకుంటుంది[1].

మూలాలు[మార్చు]

  1. రెంటాల (7 July 1972). "చిత్ర సమీక్ష:కోడలుపిల్ల". ఆంధ్రప్రభ దినపత్రిక. Retrieved 29 July 2020.[permanent dead link]

బయటిలింకులు[మార్చు]