కోడిహళ్లి మురళీ మోహన్

వికీపీడియా నుండి
(కోడీహళ్లి మురళీ మోహన్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కోడిహళ్లి మురళీ మోహన్
Kodihalli muralimohan.jpg
కోడిహళ్లి మురళీ మోహన్ చిత్రం
జననంకోడిహళ్లి మురళీ మోహన్
(1966-04-02) 1966 ఏప్రిల్ 2 (వయస్సు: 54  సంవత్సరాలు)
మడకశిర, అనంతపురం జిల్లా
నివాసంహైదరాబాదు
ఇతర పేర్లుస్వరలాసిక
చదువుఎలెక్ట్రికల్ ఇంజనీరింగులో డిప్లొమా
యజమానిదక్షిణమధ్యరైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్
ప్రసిద్ధులుతెలుగు రచయిత,సంపాదకులు
మతంహిందూ
జీవిత భాగస్వామిశాంతకుమారి
పిల్లలుకె.శ్రీహరిప్రమోద్, కె.శ్రీసాయిప్రణీత
తల్లిదండ్రులుశ్రీమతి కె.పద్మావతి, శ్రీ కె.గోపాలకృష్ణ

కోడీహళ్లి మురళీ మోహన్ తెలుగు రచయిత. ఈయన "స్వరలాసిక" కలం పేరుతో ఆంధ్రభూమి దిన పత్రిక, నేటి నిజం దినపత్రిక, ఈవారం, జాగృతి లాంటి పత్రికలలో వివిధ గ్రంథాలపై చేసిన సమీక్షల్ని "గ్రంథావలోకనమ్" పేరుతో వెలువరించారు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన దక్షిణ మధ్య రైల్వే విభాగంలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాదులో నివసిస్తున్నాడు.[2] కోడీహళ్లి సమీక్షలలో సమకాలీన సాహిత్యం ఎదుర్కొంటున్న సమస్యలు కనిపిస్తాయి.ఆధునికమైన తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియల స్వరూప స్వభావాలను చక్కగా చూడగల దక్షుడు.[3] అబ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థ కార్యవర్గంలో కార్యదర్శిగా ఉన్నాడు[4] .

రచనలు[మార్చు]

  • గ్రంథావలోకనం (సమీక్షావ్యాసాల సంపుటి)
  • సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం-సహసంపాదకత్వం [5]
  • కథాజగత్ (కథాసంకలనం) -సంపాదకత్వం
  • గడ్డిపూవు (వచనకవితా సంకలనం) - సంపాదకత్వం[6]
  • జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు[7]
  • ఆంధ్రసాహిత్యములో బిరుదనామములు

ఇంకా కొన్ని కథలు, పుస్తకసమీక్షలు, సాహిత్యవ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురణకు నోచుకున్నాయి.

సాహితీవ్యాపకం[మార్చు]

  1. అబ్జక్రియేషన్స్ సాహిత్యసాంస్కృతిక సంస్థ (రి, హైదరాబాద్‌కు వ్యవస్థాపక కార్యదర్శి.
  2. పొద్దు అంతర్జాల పత్రిక సంపాదకమండలిలో సభ్యునిగా కొన్నాళ్లు.
  3. కథాజగత్ వెబ్సైటు, తురుపుముక్క, శ్రీసాధనపత్రిక బ్లాగుల నిర్వహణ
  4. అరసం మహాసభలు, రెండవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు, నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు, జాగృతి పాత్రికేయ శిక్షణాశిబిరం, జాగృతి కథారచయితల సమ్మేళనం మొదలైన సభలలో పాల్గొన్న అనుభవం.

తెలుగు వికీపీడియాలో కృషి[మార్చు]

వికీపీడియా 11 వ వార్షికోత్సవాల ప్రారంభంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న స్వరలాసిక

ఆయన తెలుగు వికీపీడియాలో ఏప్రిల్ 10 2013 న చేరి[8] సాహితీ ప్రముఖుల జీవిత చరిత్రలు, పుస్తక సమీక్షలకు సంబంధించిన వ్యాసాలను చేర్చి[9] తెలుగు వికీపీడియాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఆయన తెలుగు వికీపీడియా 11 వ వార్షికోత్సవ సమావేశాలను జ్యోతి ప్రజ్వలన చేసి 2015 ఫిబ్రవరి 14 న ప్రారంభించారు.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]