Jump to content

కోతి దేవుని జాతర - నిర్మల్

Coordinates: 19°06′N 78°21′E / 19.10°N 78.35°E / 19.10; 78.35
వికీపీడియా నుండి
కోతి దేవుని జాతర- లక్ష్మణ్‌చందా
కోతి దేవుని జాతర- లక్ష్మణ్‌చందా is located in Telangana
కోతి దేవుని జాతర- లక్ష్మణ్‌చందా
కోతి దేవుని జాతర- లక్ష్మణ్‌చందా
తెలంగాణ కోతి దేవాలయ ఉనికి
భౌగోళికాంశాలు :19°06′N 78°21′E / 19.10°N 78.35°E / 19.10; 78.35
పేరు
ఇతర పేర్లు:కోతి దేవుడు
ప్రధాన పేరు :కోతి దేవుని జాతర - ధర్మారం
దేవనాగరి :कोति देवुनी

देवस्थान धर्माराम , लक्ष्मणचांदा

तहसील निर्मल जिला, तेलंगाना।
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:నిర్మల్ జిల్లా,లక్ష్మణ్‌చందా మండలం
ప్రదేశం:ధర్మారం గ్రామం
ఆలయ వివరాలు
ఉత్సవ దైవం:కోతి దేవుడు
ముఖ్య_ఉత్సవాలు:మాఘ మాసంలో
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :దక్షిణ భారతదేశం హిందూదేవాలయం
దేవాలయాలు మొత్తం సంఖ్య:01
ఇతిహాసం
నిర్మాణ తేదీ:ఈ ఆలయాన్ని 1978లో నిర్మించారు.
సృష్టికర్త:భక్తులు

కోతి దేవుని జాతర తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లా, లక్ష్మణ్‌చందా మండలం ధర్మారం గ్రామంలో వెలసిన కోతి దేవుడి పేరుతో ప్రతి సంవత్సరం మాఘ మాసంలో రెండు రోజులు జాతర నిర్వహిస్తారు. భక్తుల విరాళాలతో ఈ ఆలయాన్ని 1976 లో నిర్మించారు[1][2][3].

చరిత్ర

[మార్చు]

1976 లో లక్ష్మణ్‌చందా మండలంలోని ధర్మారం అటవీ ప్రాంతం నుండి ఒక కోతి ఆ గ్రామానికి రావడంతో అలవాటు చేసుకుంది. అప్పట్లో గ్రామంలో భజన, కీర్తనలు, బుర్ర కథలు, వీధి నాటకాలు ఎక్కువగా వేసె వారు. ఐతే అటవీ నుండి వచ్చిన కోతి పాటాలను వినడం ప్రారంభించింది. విస్తుపోయిన గ్రామస్థులు కోతితో సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టారు. కొన్ని రోజుల తర్వాత కోతి పగ పట్టి మనుషులకే ఆటపటించడం మొదలు పెట్టింది. కోతి మనుషుల పై దాడి చేయడం, ఇంట్లో చొరబడి ఆహార పదార్థాలు తీసుకెళ్ళడం మామూలు కావడంతో విసుగు చెందిన గ్రామస్థులు కోతిని చంపి పాతి పెట్టారు. కొన్ని రోజుల తర్వాత గ్రామస్థులకు కోతి లెని లోటు కనిపించింది. ఆ తర్వాత గ్రామస్థులు అందరూ కలిసి ఆ కోతి సమాధి కట్టి పూజలు చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి కోరిన కోరికలు తీర్చే దేవుడిగా ప్రసిద్ధ చెందిందని గ్రామ పెద్దలు చెబుతారు.

కోతికి గుడి

[మార్చు]

ధర్మారం గ్రామ ప్రజలు గ్రామస్థులతో లక్షల రూపాయలు విరాళం సేకరించి ఒక వానరానికి గుడి కట్టారు[4]. 1976 సంవత్సరంలో కోతి సమాధి ఇచ్చిన స్థలములో గుడి నిర్మాణం గావించారు.కోతి చనిపోయిన తర్వాత గ్రామ పెద్దల కలలో వచ్చి గుడి నిర్మాణం చేపట్టాలని కోరడంతో ఆలోచించిన ధర్మారం గ్రామస్థులు చందాలు సేకరించి 1978 లో గుడి నిర్మాణం పూర్తి చేసి అందులో కోతి దేవుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రతిష్టాపన చేశారు.అప్పటి నుండి ప్రతి సంవత్సరం మాఘ మాసం రెండు రోజులు జాతర కూడా నిర్వహిస్తూ వస్తున్నారు.

జాతర

[మార్చు]

ధర్మారం గ్రామంలో కోతి దేవుని జాతర ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో రెండు రోజులు పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. తొలి రోజున కోతి దేవుని ఆలయాభివృద్ధి కమిటీ , ధర్మారం గ్రామ ప్రజలు పూజలు చేసి దేవుని నైవేద్యం సమర్పించి జాతర ప్రారంభిస్తారు. అదే రోజు రథయాత్ర కూడా నిర్వహిస్తారు. రెండు రోజు భక్తులకు పెద్ద మొత్తంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తో పాటు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు పెద్దసంఖ్యలో హాజరై మొక్కులు చెల్లిస్తారు[5].

భక్తుల తాకిడి

[మార్చు]

నిర్మల్ జిల్లా లక్ష్మణ్‌చందా మండలం లోని ధర్మారం గ్రామాల్లో కొలువైన కోతి దేవుని జాతర మార్గశిర మాసంలో అనగా డిసెంబర్ 19,20 తేది లో కోతి దేవుని జాతర జరుగుతుంది. రైతులకు పత్తి సీజన్ కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలి వచ్చి కోతి దేవుని సన్నిధిలో అభిషేకం పూజలు చేసి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. భక్తులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండే కాకుండా మహారాష్ట్రలోని నాందేడ్, మొదలగు ప్రాంతాల నుండి భక్తులు జాతరకు తరలి వస్తారు. ఈ జాతరలో తినుబండారాలు, చిన్న పిల్లల ఆటవస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు, వంట పాత్రలు మొదలు ఇతరేతర వస్తువులు కొంటారు.

ఎలా చేరుకోవచ్చు

[మార్చు]

కోతి దేవుని జాతరకు వచ్చే భక్తులు బస్సులో నిర్మల్ నుండి నేరుగా లక్ష్మణ్‌చందా మండలంలోని ధర్మారం గ్రామానికి బస్సులో కానీ ఇతర ప్రైవేటు వాహనాల్లో కూడా వెళ్ళవచ్చు. మహారాష్ట్ర నుండి వచ్చే భక్తులు భైంసా పట్టణం మీదుగా లక్ష్మణ్‌చందా కు చేరుకొని అచటి నుండి ధర్మారం గ్రామానికి ఆటోలో గాని ఇతర వాహనాల్లో ప్రయాణించి చేరుకోవచ్చు.

మూలాలు

[మార్చు]
  1. Bharat, E. T. V. (2020-12-20). "ఘనంగా కోతి దేవుని జాతర... పోటెత్తిన భక్తులు". ETV Bharat News. Retrieved 2025-03-01.
  2. Velugu, V6 (2023-12-19). "కోరిన కోర్కెలు తీర్చే మారుతి ఆలయం ఎక్కడ ఉందో తెలుసా." V6 Velugu. Retrieved 2025-03-01.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Bharat, E. T. V. (2021-12-21). "Monkey fair: ఆ కోతిని వేడుకుంటే కొంగు బంగారం అవుతోంది!". ETV Bharat News. Retrieved 2025-03-01.
  4. "కోతికి గుడి కట్టిన గ్రామస్థులు.. కోరిన కోరికలు తీర్చే దేవునిగా ప్రసిద్ది.. ఎక్కడంటే." telugu.news18.com. 2024-01-01. Retrieved 2025-03-01.
  5. "కోతి దేవుని జాతరకు వేళాయే." EENADU. Retrieved 2025-03-01.