కోదండ రాముడు (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోదండ రాముడు
(2000 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్. వి. కృష్ణారెడ్డి
తారాగణం జె.డి.చక్రవర్తి
రంభ
సంగీతం ఎస్. వి. కృష్ణారెడ్డి
నిర్మాణ సంస్థ కాంతి కృష్ణ ఆర్ట్స్
భాష తెలుగు

కోదండ రాముడు ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో 2000 లో వచ్చిన సినిమా. జె. డి. చక్రవర్తి, రంభ ఇందులో ప్రధాన పాత్రధారులు.[1]

కథ[మార్చు]

రాముడు (జె. డి. చక్రవర్తి) అరకు లోయలో ఒక టూరిస్టు గైడు. అతను నగరంలో పుట్టి పెరిగిన మౌనిక (రంభ) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. మౌనికకు ప్రేమ మీద అంతగా నమ్మకం ఉండదు. అదే అభిప్రాయంతో రాముడు కూడా తన ప్రేమగా నటిస్తున్నాడనుకుని అతన్ని తన అవసరాలకు వాడుకుంటూ ఉంటుంది. కానీ అతన్ని తనను ప్రేమించేలా చేసుకుని చివరకు అతను రాముడు తన పెద్దమ్మ (నిర్మలమ్మ) నేసిన పట్టు చీరను బహుమతిగా ఇస్తూ తన ప్రేమను వ్యక్తపరచబోతే అతన్ని ఘోరంగా అవమానిస్తుంది. దాంతో కోపగించుకున్న రాముడు ఎలాగైనా ఆమెను తన కాళ్ళదగ్గరికి వచ్చేలా చేసుకుంటానని శపథం చేస్తాడు.

అంతలో అరకులోయకు లత (లయ), అవధాని (ఎ. వి. ఎస్) లతో కూడిన ఒక సంగీత నాట్యబృందం వస్తుంది. లత కూడా రాముడిని అభిమానించి అతనికి దగ్గరవ్వాలని చూస్తుంది. మౌనిక తన తండ్రి (రంగనాథ్) ద్వారా లత భారతదేశంలోనే అతిపెద్ద వ్యాపారవేత్తల్లో ఒకరి కూతురనీ, తన తండ్రి వాళ్ళ కిందే పనిచేస్తున్నాడని తెలుస్తుంది. అప్పటి నుంచి తాను రాముని కాదన్నందుకు పశ్చాత్తాపం మొదలవుతుంది. తరువాత మౌనిక రాము దగ్గరకు వెళ్ళి తాను పొరపాటు చేశానని, తన ప్రేమను అంగీకరించమని అడుక్కుంటుంది. అందుకు తను అంగీకరించకపోవడంతో ఒక కొండ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. రాము వెళ్ళి ఆమెను రక్షించి తన తప్పును తెలుసుకోవాలని అలా నాటకం ఆడానని చెప్పి ఆమెను పెళ్ళి చేసుకోవడంతో కథ ముగుస్తుంది.

తారాగణం[మార్చు]

  • రాము\కోదండరాముడు గా జె. డి. చక్రవర్తి
  • మౌనిక గా రంభ
  • లత గా లయ
  • పెద్దమ్మ గా నిర్మలమ్మ
  • పెద్దమ్మ భర్త గా జె. వి. సోమయాజులు
  • టూరిస్టు గైడు గా బ్రహ్మానందం
  • టూరిస్టు గైడు గా ఆలీ
  • అవధాని గా ఎ. వి. ఎస్
  • మౌనిక తండ్రి గా రంగనాథ్
  • రాము తండ్రి గా సుబ్బరాయ శర్మ
  • రాము తల్లి గా అన్నపూర్ణ
  • స్టేషన్ మాస్టరు గా ఎం. ఎస్. నారాయణ
  • సూర్య
  • మౌనిక స్నేహితురాలు గా మధుమణి

పాటలు[మార్చు]

  • మౌనిక మౌనిక ఒహో మౌనిక
  • సన్నజాజి తీగ మీటుకుంటా
  • కోదండ రామయ్యకు కళ్యాణ
  • మణిపురి నడకలతో
  • ఇది కాకుల లోకంలో
  • ఈ లాహిరి పాడే లాలి

మూలాలు[మార్చు]

  1. "naasongs.com లో కోదండరాముడు సమాచారం". naasongs.com. Archived from the original on 25 మార్చి 2017. Retrieved 8 August 2017.

బయటి లింకులు[మార్చు]