కోనమనేని అమరేశ్వరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోనమనేని అమరేశ్వరి

జస్టిస్ కె. అమరేశ్వరి (కోనమనేని అమరేశ్వరి) (జులై 10, 1928 - జులై 25, 2009) భారతదేశంలో తొలి మహిళా న్యాయమూర్తి.[1]

జననం[మార్చు]

గుంటూరు జిల్లా అప్పికట్ల గ్రామములో ఒక వ్యవసాయ కుటుంబములో 1928, జులై 10 వ తేదీన జన్మించింది.[1] 14వ ఏటనే పెళ్ళి ఐననూ భర్త ప్రోత్సాహముతో చదువు సాగించి ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు నుండి రాజకీయ శాస్త్రము, చరిత్రలో 1948 సంవత్సరములో M.A పట్టభద్రురాలయ్యింది. న్యాయశాస్త్రములో కూడా పట్టా పొంది మద్రాసు ఉన్నత న్యాయస్థానములో న్యాయవాదిగా పనిచేశారు. 1960-1961లో బార్ కౌన్సిల్ సభ్యురాలు. ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత న్యాయస్థానములో ఏప్రిల్ 29, 1978లో న్యాయమూర్తిగా నియమింపబడి దేశములోనే తొలి మహిళా న్యాయమూర్తిగా పేరొందింది. పదమూడున్నర సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేసి 1990 సంలో సీనియర్ గా పదోన్నతి పొంది పదవీ విరమణ చేశారు[2].

భారత మహిళా న్యాయవాదుల సంఘమునకు ఉపాధ్యక్షురాలిగా, ఆంధ్ర ఉన్నత న్యాయస్థానము లోని న్యాయవాదుల సంఘమునకు ఉపాధ్యక్షురాలిగా (1975-1976) పనిచేశారు.

మరణం[మార్చు]

అమరేశ్వరి 2009, జులై 25కొత్త ఢిల్లీలో మరణించింది[3].

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Justice Amareswari passes away". The Hindu. July 26, 2009.
  2. గుంటూరు జిల్లా ఆణిముత్యాలు, గుత్తికొండ జవహర్ లాల్, కమలా పబ్లికేషన్స్, హైదరాబాద్, 2009, పుట. 19
  3. http://www.hindu.com/2009/07/26/stories/2009072653710400.htm