కోనసీమ తిరుపతి వాడపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దివ్యక్షేత్రం వాడపల్లి- దివ్య చరిత వాడనిమల్లి"[మార్చు]

దేవాలయం చరిత్ర[మార్చు]

కోనసీమ తిరుపతి గా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దివ్యమంగళ విగ్రహం

ఒకసారి సనకసనందనాది మహర్షులందరూ వైకుంఠం లోని శ్రీమన్నారాయణుని దర్శించుకుని ఆయనను అనేకవిధములుగా స్తుతించిన తరువాత తాము వచ్చిన పనిని తెలిపారు. కలియుగం లో ధర్మం ఒంటిపాదం లో నడుస్తోంది ప్రజలు ఆహార విహారాలకే ప్రాధాన్యత నిస్తూ ఆచారహీనులుగా జీవిస్తూ కామక్రోధాలకు వశులై అధర్మ జీవితం గడుపుచున్నారు ఉపేక్షిస్తే అధర్మం మిగిలిన యుగాలకు కూదా ప్రాప్తిస్తుంది.కనుక ప్రజల్ని చక్కదిద్ది ధర్మాన్ని ఉద్ధరించే ఉపాయం సెలవిమ్మని ఋషులు మహావిష్ణువును ప్ర్రార్ధించగా అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈవిధంగా చెప్పెను. అధర్మం ప్రబలినప్పుడు స్వయముగా యుగ యుగమందున అవసరాలకు అనుగుణంగా వివిధ అవతారాలు ధరించితిని కాని కలియుగం లో పాపభూయిష్టము యెక్కువ అయిఉంది కొద్ది మాత్రమే పుణ్యాన్వితమ్ కావున కలియుగం లో అర్చా స్వరూపుడనై భూలోకమున లక్ష్మీ క్రీడా స్తానమై మానవుల యొక్క ఘోర సంసార బాధలను సాగరమున నౌక వలె దరిచేర్చునది అగు గౌతమీ తీరమున నౌకపురమును (వాడపల్లి) పురమందు వెలయుదును. లక్ష్మీ సహితంగా ఒక చందన పేటికలో గౌతమీ ప్రవాహ మార్గం లో నౌకపురి (వాడపల్లి) చేరుకుంటాను.ఈ వృత్తాంతం అంతా తెలిసిన నారదుడుపురజనులకు తెలియ పరుస్తాడు. కొంత కాలానికి నౌకపురి ప్రజలకు గౌతమీ ప్రవాహంలో కొట్టుకు వస్తున్న చందన వృక్షం కనిపించింది తీరా వడ్డుకు తీసుకువద్దామని వెళ్ళినంతలో అదృశ్యమై పోవడం ప్రారంభించింది.ఒక రోజు గ్రామం లోని వృద్ధ బ్రాహ్మణులకు కలలొ కనిపించి కలికల్మషం వల్ల జ్ఞానం లోపించి మీరు నన్ను కనుగొనలేక పోతున్నారు.కనుక పురజనులందరూ వేకువనే గౌతమీ స్నానంతో పవిత్రులై మంగళ వాయిద్యాలతో నౌకలో నదీ గర్భం లోకి వెళితే కృష్ణ గరుడ వాలిన చోట నేనున్న చందన పేటిక దొరుకుతుందని చెబుతాడు.పురజనులు స్వామి ఆదేశాన్ని పాటించి నౌకలో నది గర్భంలోనికి వెళ్ళగా చందన పేటిక లభిస్తుంది.దానిని ఒడ్డుకు తీసుకువచ్చి నిపుణుడైన శిల్పితో తెరిపించగా అందులో శంఖు,చక్ర,గదలతో ఒప్పుతున్న స్వామీ దివ్యమంగళ విగ్రహం కనిపించింది. అంతలో అక్కడికి దేవర్షి నారదుడు విచ్చేశాడు.గతంలో ఋషులు వైకుంఠమునకు వెళ్లి ప్రజలకు ధర్మాన్ని ఉద్ధరించడానికి ఉపాయం చూపవలసినదిగా విష్ణువును ప్రార్ధించడం,విష్ణువు నౌకపురిలో అర్చావతారంగా వెలుస్తానని చెప్పడం మొదలైన విషయాలు నారదుడు పురజనులకు చెబుతాడు.తరువాత మూడు మండపాలలో ఎత్తైన ప్రాకార గోపురాలతో దేవాలయం కట్టింప జేసినాడు."వేం"అంటే పాపాలను "కట" అంటే పోగొట్టే వాడు కనుక స్వామికి "వేంకటేశ్వరుడు"అని నారదుడే స్వయంగా నామకరణం చేసి ప్రతిష్టింప చేసినాడు.వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి నిలువెత్తు రూపం చూడగానే కళ్ళకు ఆకట్టుకుని తిరుమలేశుని దర్శించిన అనుభూతి కలిగిస్తుంది.భారతదేశం లో అశేష భక్తజనం సందర్శించే ఆరాధ్య దేవాలయాల్లో "వాడపల్లి" ఒకటి వాడపల్లి తీర్ధం అనగా వాడవాడలా ఉత్సవమే.ఆబాలగోపాలానికీ ఆనందమే.ప్రతీఏటా చైత్రశుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామీ వారి తీర్ధం,కల్యాణోత్సవం వైభవంగా జరుగుతాయి. స్వామివారి బ్రహ్మోత్సవ, కల్యాణోత్సవ కార్యక్రమములను కన్నుల పండుగగా భక్తీ ప్రపత్తులతో తిలకిస్తారు. ఏటా కళ్యాణంతో పాటు నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శిస్తుంటారు.

ఏడు శనివారముల వెంకన్న దర్శనం -ఏడేడు జన్మల పుణ్యఫలం[మార్చు]

స్వయంభూ క్షేత్రమైన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామీ వారిని వరుసగా " 7 " శనివారములు దర్శించినచో భక్తుల కోర్కెలు తప్పక నెరవేరును.ప్రారంభించే మొదటి శనివారం ధ్వజస్థంభం వద్ద నిలబడి మీ మనస్సులోని కోరికను స్వామీ వారికి నివేదించుకొని " 7 " సార్లు ప్రదక్షిణము చేసి స్వామి వారిని దర్శించు కోవలెను . స్త్రీల విషయంలో ఏదైనా ఒక శనివారం అవాంతరం కలిగినచో మరొక శనివారం అదనంగా చేసినచో " 7 " శనివారముల ఫలితము కలుగును. " 7 " శనివారములు దర్శనాలు పూర్తి అయిన పిదప స్వామి వారి ఆలయంలో అన్నదానమునకు బియ్యం, పప్పులు, నూనెలు, ఏదైనా గాని భక్తుని స్తోమతను బట్టి 7 కుంచాలు లేదా 7 కేజీలు లేదా 7 గుప్పెళ్ళు గాని సమర్పించు కొనవచ్చును.

శనివారం అంటే శ్రీనివాసునకు ఎందుకిష్టం?[మార్చు]

 • శ్రీనివాసుడు వెంకటాద్రికి తరలివచ్చిన రోజు.....శనివారం
 • ఓంకారం ప్రభవించిన రోజు.....శనివారం
 • శ్రీ స్వామి వారు శ్రీనివాసుని అవతారం లో ఉద్భవించిన రోజు...శనివారం
 • సకల జనులకు శని పీడలు తొలగించే రోజు.....శనివారం
 • శ్రీ మహా లక్ష్మిని వక్షస్థలాన నిలిపిన రోజు....శనివారం
 • శ్రీనివాసుని భక్తీ శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో వారి జోలికి రానని శనీశ్వరుడు వాగ్దానం చేసిన రోజు...శనివారం
 • పద్మావతి శ్రీనివాసుల కల్యాణం జరిగిన రోజు ...... శనివారం
 • శ్రీ వారిని ఆభరణాలతో అలంకరించే రోజు....శనివారం
 • స్వామి వారిని ఏడుకొండలపై మొదటిగా భక్తులు గుర్తించిన రోజ....శనివారం.
 • ఏపని చేసినా సుస్తిరతలు చేకూర్చే రోజు కాబట్టి శనివారమునకు స్థిరవారమని పేరు

సమాచారం కొరకు[మార్చు]

కార్యనిర్వహణాధికారి,శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం,వాడపల్లి,ఆత్రేయపురం మండలం,తూర్పు గోదావరి జిల్లా.533237,ఫోన్: 08855-271888

రూటు[మార్చు]

రావులపాలెం నుండి 8 కిలోమీటర్ల దూరంలో లొల్ల మీదుగా వాడపల్లి చేరవచ్చు.

మూలాలు[మార్చు]

వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం స్థలపురాణం
 • వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం వారు ఇచ్చిన స్థలపురాణం పేపరు ఆధారంగా వ్రాయబడింది.దేవస్థానం ప్రధాన అర్చకుల అనుమతితో.

ఇవి కూడా చూడండి

వెలుపలి లంకెలు[మార్చు]