కోనేరు రామకృష్ణారావు
Jump to navigation
Jump to search
కోనేరు రామకృష్ణారావు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పారాసైకాలజిస్ట్, తత్వవేత్త, విద్యావేత్త[1].
ఆంధ్ర విశ్వకళా పరిషత్లో విద్యార్థిగా, గ్రంథాలయాధికారిగా, ఉపన్యాసకునిగా, ఆచార్యునిగా పనిచేశాడు. ఆ సమయములోనే ప్రతిష్ఠాత్మకమగు రాకిఫెల్లర్ పురస్కారము పొంది చికాగో విశ్వవిద్యాలయములో మానసిక శాస్త్రములో పరిశోధనలు చేశాడు. అతీంద్రియ మనోవిజ్ఞానశాస్త్రములో రామకృష్ణారావు చేసిన పరిశోధనలు ప్రపంచఖ్యాతి పొందాయి. 34వ ఏటనే ప్రపంచ పారా సైకాలజి సంఘమునకు అధ్యక్షుడైనాడు. తిరిగి 1978లో ఆ పదవిని మరలా అధిష్టించాడు. అమెరికా ఆహ్వానముపై అచటి సైకాలజి సంస్థకు అధ్యక్షునిగా వెళ్ళాడు. తిరిగి 1984లో తను చదివిన ఆంధ్ర విశ్వవిద్యాలయమునకు ఉపకులపతిగా వచ్చాడు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము వారి ఉన్నత విద్యా పరిషత్ అధ్యక్షునిగా నియమింపబడ్డాడు[2].
200 పరిశోధనాపత్రాలు, 12 పుస్తకాలు ప్రచురించాడు.
2011 జనవరి 26న భారత ప్రభుత్వము పద్మశ్రీ పురస్కారము ప్రకటించింది.
పదవులు, పురస్కారాలు[మార్చు]
- అధ్యక్షుడు - అమెరికా పారాసైకాలజి సంఘము
- అధ్యక్షుడు - భారత ఆప్లయిడ్ సైకాలజి అకాడెమి
- సంపాదకుడు - భారత సైకాలజి జర్నల్
- సంపాదకుడు - పారాసైకాలజి జర్నల్ (20 ఏండ్లు)
- Executive Director- Foundation for Research on the Nature of Man - డ్యూక్ విశ్వవిద్యాలయము, అమెరికా.
- Editor - Current Trends in Indian Philosophy.
- Editorial Fellow - Project History of Indian Science, Philosophy and Culture
- President - Institute for Human Science & Service.
- Doctor of Letters (Honoris Causa) degrees - Andhra and Kakatiya Universities.
- Doctor of Science (Honoris Causa) degree - Acharya Nagarjuna University.
మూలాలు[మార్చు]
యివి కూడా చూడండి[మార్చు]
వర్గాలు:
- All articles with dead external links
- Articles with dead external links from జనవరి 2020
- Articles with permanently dead external links
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with BNF identifiers
- పద్మశ్రీ పురస్కారం పొందిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు
- 1932 జననాలు
- జీవిస్తున్న ప్రజలు
- కృష్ణా జిల్లా తత్వవేత్తలు
- ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉప కులపతులు
- కృష్ణా జిల్లా శాస్త్రవేత్తలు