కోయంబత్తూరు ఖైదీ
కోయంబత్తూరు ఖైదీ (1968 తెలుగు సినిమా) | |
తారాగణం | రవిచంద్రన్, జయలలిత, నగేష్, మనోరమ, అశోకన్ |
---|---|
నిర్మాణ సంస్థ | వెంకట సత్యనారాయణ పిక్చర్స్ |
భాష | తెలుగు |
కోయంబత్తూరు ఖైదీ 1968 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] అదే సంవత్సరం విడుదలైన అండ్రు కండ ముగం అనే తమిళ థ్రిల్లర్ సినిమా దీనికి మాతృక.
నటీనటులు
[మార్చు]- రవిచంద్రన్ - రాజా
- జయలలిత - కాంచన
- నగేష్ - సుబ్బు
- అశోకన్ - రామనాథం
- వి.కె.రామస్వామి - సోమయ్య
- సుందరరాజన్ - దేవన్ బహదూర్
- రామారావు - నీలకంఠశాస్త్రి
- మనోరమ - బేబి
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం : జి.రామకృష్ణన్
- నిర్మాత: ఎస్.వి.కృష్ణారావు
- మాటలు: మహారథి
- పాటలు: ఆరుద్ర
- కూర్పు : కందస్వామి
- సంగీతం:కె.వి.మహదేవన్, టి.వి.రాజు
- నేపథ్య గాయకులు: పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పిఠాపురం నాగేశ్వరరావు
సంక్షిప్త కథ
[మార్చు]రామనాథం విదేశాలకు వెళ్ళివచ్చిన పెద్ద లాయరు. బాగా డబ్బున్నవాడు. అతని అసిస్టెంట్ సుబ్బు. కాంచన అనే అందమైన అమ్మాయి రామనాథం వద్ద జూనియర్‌గా చేరుతుంది. రామనాథం కాంచనను ప్రేమిస్తాడు. వీరు ముగ్గురు సోమయ్య అనే ఒక జమీందారు ఆహ్వానంపై అతని ఇంటికి వెళతారు. సోమయ్య గారాలపట్టి బేబీ. ఒకరోజు కాంచన, సోమయ్య విహారానికి వెళ్తే అక్కడ రాజా ఒక బస్సు వద్ద మూర్చిల్లి ఉంటాడు. రాజాను చూసి కాంచన తన క్లాస్‌మేట్‌గా గుర్తుపట్టి అతనిపై అనురాగం నింపుకుంటుంది. కానీ ఇది రామనాథానికి ఇష్టం ఉండదు. రాజాపై ఒక ఆరోపణ పడుతుంది. బ్రిటీషువారి కాలంలో ఒక పోలీసు ఆఫీసర్‌ను చంపినాడని ఆ ఆరోపణ. అనేక మంది దుండగులు రాజాని చంపడానికి ప్రయత్నిస్తారు. కాని అసలు హంతకుడు ఎవరు? రాజా ఎలా రక్షింపబడ్డాడు? రాజా కాంచనలు కలుసుకుంటారా? మొదలైన ప్రశ్నలకు సమాధానం చివరలో తెలుస్తుంది.[2]
పాటలు
[మార్చు]- నీ మనసే కోరి రమ్మంది నిను నా మనసే సుధ ఇమ్మంది - పి. సుశీల , ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- వలపు గొనుమా వన్నెలు కనుమా ప్రేమ నీకు లేదా - పి. సుశీల, ఎస్.పి. బాలు
- వినరా పక్షీ వినరా ఎన్రామూర్ఖా ఉడకవు పప్పులు - పిఠాపురం, ఎస్.పి. బాలు
- హృదయం పులకించదా కన్నె యిదే వన్నెయిదే కలయమని - పి. సుశీల
మూలాలు
[మార్చు]- ↑ http://ghantasalagalamrutamu.blogspot.in/2012/02/1968.html[permanent dead link]
- ↑ ఎస్.వి.కృష్ణారావు (1968). కోయంబత్తూరు ఖైదీ పాటల పుస్తకం. p. 8. Retrieved 22 May 2021.