Jump to content

కోయంబత్తూరు జిల్లా

అక్షాంశ రేఖాంశాలు: 11°00′45″N 76°58′17″E / 11.0125°N 76.9714°E / 11.0125; 76.9714
వికీపీడియా నుండి
Coimbatore
Covai
Clockwise from top-left: Marudhamalai Temple, Pandava Graves site, hills near Pollachi, Tea plantation near Valparai, North Coimbatore flyover
Nickname: 
Manchester of South india
Location in Tamil Nadu
Location in Tamil Nadu
పటం
Coimbatore district
Coordinates: 11°00′45″N 76°58′17″E / 11.0125°N 76.9714°E / 11.0125; 76.9714
Country భారతదేశం
State Tamil Nadu
HeadquartersCoimbatore
TaluksAnnur, Anaimalai, Coimbatore North, Coimbatore South, Kinathukadavu, Madukkarai, Mettupalayam, Perur, Pollachi, Sulur, Valparai
Government
 • BodyCoimbatore Local Planning Authority
 • District CollectorG. S. Sameeran, IAS
 • Commissioner of Police (City)Pradip Kumar, IPS
 • Superintendent of Police (Rural)V.Badrinarayanan, IPS
విస్తీర్ణం
 • Total4,723 కి.మీ2 (1,824 చ. మై)
Elevation
420 మీ (1,380 అ.)
జనాభా
 (2011)[1]
 • Total34,58,045
 • జనసాంద్రత730/కి.మీ2 (1,900/చ. మై.)
Languages
 • OfficialTamil
Time zoneUTC+5:30 (IST)
PIN
641xxx, 642xxx
Telephone code+91-0422
ISO 3166 codeISO 3166-2
Vehicle registrationTN-37(Coimbatore South),

TN-37Z(Sulur), TN-38(Coimbatore North), TN-40(Mettupalayam), TN-41(Pollachi), TN-41Z(Valparai), TN-66(Coimbatore Central),

TN-99(Coimbatore West),
Largest cityCoimbatore
Sex ratioM-50.00%/F-50.00% /
Literacy92.98%
State legislative assembly (India) constituency10
Precipitation700 మిల్లీమీటర్లు (28 అం.)
Avg. summer temperature36 °C (97 °F)
Avg. winter temperature18 °C (64 °F)

కోయంబత్తూర్ జిల్లా, భారతదేశం, తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఒక జిల్లా.ఈ జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం కోయంబత్తూర్[2] ఇది తమిళనాడు రాష్ట్రం లోని అత్యంత పారిశ్రామిక జిల్లాలలో ఒకటి. ప్రధానంగా వస్త్ర, పారిశ్రామిక, వాణిజ్య, విద్యా, సమాచార సాంకేతిక, ఆరోగ్య సంరక్షణ తయారీ కేంద్రంగా ఉంది.[3] ఈ జిల్లా ప్రాంతమంతా పచ్చదనంతో నిండి ఉంది. ఈ జిల్లాకు తూర్పున తిరుప్పూర్ జిల్లా, ఉత్తరాన నీలగిరి జిల్లా, ఈశాన్యంలో ఈరోడ్ జిల్లా, పాలక్కాడ్ జిల్లా, దక్షిణ, పశ్చిమ అర్ధగోళంలో ఇడుక్కి జిల్లా, త్రిస్సూర్ జిల్లా, ఇతర చిన్న భాగాలు, పారుగు రాష్ట్రం కేరళ లోని ఎర్నాకుళం జిల్లా ఉన్నాయి.2011 నాటికి కోయంబత్తూర్ జిల్లాలో 3,458,045 జనాభా ఉంది. అక్షరాస్యత రేటు 84%.[4]

ప్రాచీన చరిత్ర

[మార్చు]

కోయంబత్తూరు జిల్లా చేరా వంశీకుల పాలించిన ప్రాచీన కొంగు నాడు ప్రాంతంలో భాగంగా ఉంది. ఇది పశ్చిమ తీరం, తమిళనాడు మధ్య ప్రధాన వాణిజ్య మార్గం అయిన పాలక్కాడ్ ప్రాంతానికి తూర్పు ప్రవేశ ద్వారంగా పనిచేస్తుంది.[5] కోయంబత్తూరు ప్రాంతం దక్షిణ భారతదేశంలోని ముజిరిస్ నుండి అరికమేడు వరకు విస్తరించిన రోమన్ వాణిజ్య మార్గం మధ్యలో ఉంది.[6][7] మధ్యయుగ చోళులు 10వ శతాబ్దంలో కొంగునాడును స్వాధీనం చేసుకున్నారు.[8][9] ఈ ప్రాంతాన్ని 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం పాలించింది. కొంగునాడు ప్రాంతం విజయనగర సామ్రాజ్య పాలకులు 24 పాళ్యములుగాగా విభజించి పాలయక్కరర్ వ్యవస్థను ప్రవేశపెట్టి అమలుపర్చారు.[10] 18వ శతాబ్దపు చివరి భాగంలో, కోయంబత్తూరు ప్రాంతం మైసూర్ రాజ్యం కిందకు వచ్చింది. ఆంగ్లో-మైసూర్ యుద్ధాలలో టిప్పు సుల్తాన్ ఓటమి తరువాత, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1799లో కోయంబత్తూరును మద్రాసు ప్రెసిడెన్సీలో విలీనం చేసింది.

కోయంబత్తూర్ ప్రాంతం ధీరన్ చిన్నమలై కార్యకలాపాల ప్రాంతంగా ఉన్నప్పుడు రెండవ పోలిగర్ యుద్ధం (1801)లో ప్రముఖ పాత్ర పోషించింది.[11] 1804లో కోయంబత్తూరు కొత్తగా ఏర్పడిన కోయంబత్తూరు జిల్లాకు రాజధానిగా స్థాపించబడింది.[12][13][14] ముంబైలో పత్తి పరిశ్రమ క్షీణత కారణంగా 19వ శతాబ్దం ప్రారంభంలో జిల్లా వస్త్ర విజృంభణను చవిచూసింది.[15]

జిల్లా సమాచారం

[మార్చు]

1804లో, కోయంబత్తూరు జిల్లా కొత్తగా ఏర్పడింది. కొత్తగా ఏర్పడిన జిల్లాకు కోయంబత్తూరు రాజధానిగా స్థాపించబడింది. జిల్లా కోర్టు మొదట ధరాపురంలో ఉంది, తరువాత దానిని కోయంబత్తూరుకు మార్చారు. జిల్లాలో ఈరోడ్, తిరుప్పూర్, నీలిగిర్స్, కేరళలోని కరూర్, పాలక్కాడ్, కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలు ఉన్నాయి. నీలగిరి జిల్లా 1868లో వేరు చేయబడింది. 1876-78లో జరిగిన మహా కరువు సమయంలో ఈ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. దాని ఫలితంగా దాదాపు 200,000 మంది కరువు సంబంధిత మరణాలుకు గురైయ్యారు. 1900 ఫిబ్రవరి 8న కోయంబత్తూరు నగరం రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. 20వ శతాబ్దపు మొదటి మూడు దశాబ్దాలలో దాదాపు 20,000 ప్లేగు సంబంధిత, తీవ్రమైన నీటి కొరత ఏర్పడింది.

భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఈ ప్రాంతం ముఖ్యమైన పాత్ర పోషించింది. స్వాతంత్య్రానంతరం, పారిశ్రామికీకరణ కారణంగా జిల్లా వేగంగా అభివృద్ధి చెందింది.1927లో కరూర్ తాలూకా, జిల్లా నుండి విడిపోయి తిరుచిరాపల్లి జిల్లాలో విలీనం చేయబడింది. 1956లో కొల్లేగల్ తాలూకా మైసూర్ రాష్ట్రానికి బదిలీ చేయబడింది. 1979లో, భవానీ, గోబిచెట్టిపాళయం, సత్యమంగళం, ఈరోడ్, పెరుందురై, కాంగేయం, ధరాపురం అనే ఆరు తాలూకాలను విభజించి పెరియార్ జిల్లా (ఈరోడ్ జిల్లా) ఏర్పడింది. 2012లో ఈరోడ్ జిల్లా, కోయంబత్తూరు జిల్లాలోని కొన్ని భాగాలను కలిపి తిరుప్పూర్ జిల్లా ఏర్పడింది.

ధక్షిణ భారతదేశంలోని దాని వ్యూహాత్మక స్థానంతో గుర్తించదగిన ఉనికిని కలిగిన సైనికదళం, నావికాదళం, వైమానిక దళం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వంటి పారా-మిలటరీ బలగాల విభాగాలతో, రక్షణ దళాలు కోయంబత్తూరు జిల్లాలో ఉన్నాయి.

జనాభా గణాంకాలు

[మార్చు]
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±% p.a.
19016,97,894—    
19117,54,483+0.78%
19217,87,002+0.42%
19319,14,515+1.51%
194110,50,676+1.40%
195112,59,135+1.83%
196115,01,084+1.77%
197118,86,146+2.31%
198122,16,562+1.63%
199124,93,715+1.19%
200129,16,620+1.58%
201134,58,045+1.72%
ఆధారం :[16]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, కోయంబత్తూర్ జిల్లాలో 34,58,045 జనాభా ఉంది. ప్రతి 1,000 మంది పురుషులకు 1,000 మంది స్త్రీల లింగ నిష్పత్తి ఉంది.ఇది జాతీయ సగటు 929 కంటే ఎక్కువ. 75.73% మంది జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.[17] A మొత్తం జనాభాలో 3,19,332 మంది ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు, వీరిలో 16,3,230 మంది పురుషులు కాగా, 156,102 మంది స్త్రీలు ఉన్నారు. జనాభాలో షెడ్యూల్డ్ కులాలు జనాభా 15.5% మంది ఉండగా, షెడ్యూల్డ్ తెగలు జనాభా 0.82% మంది ఉన్నారు. జిల్లా సగటు అక్షరాస్యత 83.98% శాతం ఉంది.[18] A జిల్లాలో మొత్తం 9,58,035 గృహాలు ఉన్నాయి. మొత్తం 15,67,950 మంది కార్మికులు ఉన్నారు.వారిలో 75,411 సాగుదారులు, 201,351 ప్రధాన వ్యవసాయ కార్మికులు, 44,582 గృహ పరిశ్రమలపై ఆధారపడినవారు, 11,21,908 ఇతర కార్మికులు, 12,4,698 ఉపాంత కార్మికులు, 4,806 ఉపాంత కార్మికులు ఉన్నారు.[19]

పరిపాలనా విభాగాలు

[మార్చు]

కోయంబత్తూరు జిల్లా కోయంబత్తూరు నార్త్, కోయంబత్తూర్ సౌత్ పొల్లాచ్చి అనే మూడు రెవెన్యూ బ్లాక్‌లుగా విభజించబడింది, జిల్లాలో అన్నూరు, అనైమలై, కోయంబత్తూరు ఉత్తర తాలూకా, కోయంబత్తూరు దక్షిణ తాలూకా, కిణతుక్కడవు, మదుక్కరై, మెట్టుపాళయం, పేరూర్, పొల్లాచి, సూలూరు, వల్పరై అనే పదకొండు తాలూకాలు ఉన్నాయి.[20]

పరిపాలన

[మార్చు]

జిల్లా పరిపాలన జిల్లా కలెక్టరు ద్వారా నిర్వహించబడుతుంది. కోయంబత్తూర్ జిల్లా గ్రామీణ పోలీసు ప్రధాన కార్యాలయం కోయంబత్తూరులో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఇండియా) నేతృత్వంలో ఉంది. కోయంబత్తూరు సిటీ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హోదాలో కమీషనర్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలో ఉంంది. ఇది జిల్లా పోలీసులతో సంబంధం లేకుండా ఉంటుంది. జిల్లా కేంద్ర కారాగారం కోయంబత్తూరులో ఉంది.

రాజకీయాలు

[మార్చు]

జిల్లాలో కోయంబత్తూరు, పొల్లాచ్చి, నీలగిరి అనే 3 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాలో కోయంబత్తూరు నార్త్, కోయంబత్తూరు దక్షిణం, కౌండంపళయం, సింగనల్లూరు, సూలూరు, తొండముత్తూరు, కిణతుకడవు, పొల్లాచ్చి, వాల్పరై, మెట్టుప్పలయం అనే శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.

మతాల ప్రకారం (2011) [21]
మతం శాతం
హిందూ
  
88.03%
ఇస్లాం
  
6.10%
క్రిష్టియన్స్
  
5.50%
ఇతరులు
  
0.37%

మతాల ప్రకారం

[మార్చు]

పట్టణ జనాభాలో హిందువులు 90.08% మంది ఉన్నారు, ముస్లింలు 6.10% మంది, క్రైస్తవులు 5.50% మంది, ఇతరులు 0.37% మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో హిందువులు ఎక్కువ.[21]

భాషలు ప్రకారం

[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం కోయంబత్తూరు జిల్లాలో 69.13% మంది తమిళం, 16.32% మంది తెలుగు, 6.76% మంది కన్నడ, 4.90% మంది మలయాళం, 1.14% మంది ఉర్దూ వారి మొదటి భాషగా మాట్లాడతారు.[22]

రవాణా సౌకర్యాలు

[మార్చు]

వాయు మార్గం

[మార్చు]

జిల్లాకు కోయంబత్తూరులోని కోయంబత్తూరు అంతర్జాతీయ విమానాశ్రయం సేవలు అందిస్తోంది. కోయంబత్తూర్ అంతర్జాతీయ విమానాశ్రయం చెన్నై, ముంబై, బెంగుళూరు, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, అహ్మదాబాద్ వంటి ప్రధాన భారతీయ నగరాలకు దేశీయ విమానాలను నడుపుతుంది.అలాగే షార్జా, శ్రీలంక, సింగపూర్‌లకు అంతర్జాతీయ విమానాలను అందిస్తుంది.[23] దీని రన్‌వే పొడవు 9,760 అడుగులు (2,970 మీ), అంతర్జాతీయ విమానాల కోసం ఉపయోగించే విశాలమైన విమానాలను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.[24] నగరానికి సమీపంలోని కంగయంపాళయం వద్ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెందిన సూలూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వైమానిక స్థావరం ఉంది.

రైలు మార్గం

[మార్చు]

కోయంబత్తూర్ జిల్లాలో రైలు సేవలు 1863లో ప్రారంభమయ్యాయి, పొడనూర్ - మద్రాస్ లైన్ నిర్మాణం తర్వాత కేరళ, పశ్చిమ తీరాన్ని భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలుపుతుంది.[25] బ్రాడ్ గేజ్ రైళ్లు కోయంబత్తూరును భారతదేశం, తమిళనాడులోని అన్ని ప్రాంతాలకు కలుపుతాయి. కోయంబత్తూరు జంక్షన్ అన్ని ప్రధాన భారతీయ నగరాలకు బాగా అనుసంధానించబడి ఉంది. జిల్లా సేలం డివిజన్ అధికార పరిధిలోకి వస్తుంది. కోయంబత్తూర్ నార్త్, పోదనూర్, పొల్లాచ్చి, మెట్టుపాళయం జిల్లాలోని ఇతర ముఖ్యమైన రైల్వే స్టేషన్లు. ఇతర స్టేషన్లలో పీలమేడు, సింగనల్లూరు, ఇరుగూర్, పెరియానాయకన్‌పాళయం, మదుక్కరై, సోమనూర్, కినాతుకడవు, సూలూర్ రోడ్ ఉన్నాయి.

త్రోవ మార్గం

[మార్చు]

కోయంబత్తూర్ జిల్లా రోడ్లు, హైవేల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. కోయంబత్తూర్ సౌత్ (పీలమేడు), కోయంబత్తూరు సెంట్రల్ (గాంధీపురం), కోయంబత్తూరు ఉత్తరం (తుడియాలూరు), కోయంబత్తూర్ వెస్ట్ (కోవైపుదూర్), మెట్టుపాళయం, పొల్లాచ్చి, సూలూర్‌లో ఏడు ప్రాంతీయ రవాణా కార్యాలయాలు ఉన్నాయి. జిల్లాను రాష్ట్రాలలోని ఇతర ప్రాంతాలకు కలిపే ఐదు జాతీయ రహదారులు ఉన్నాయి:

తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు పట్టణ అంతర్గత మార్గాలలో చాలా ప్రాంతాలతో పాటు జిల్లాలోని ఇతర పట్టణాలు, గ్రామాలకు సేవలు అందిస్తాయి. ఈ జిల్లా నుండి పొరుగు రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రధాన పట్టణాలతో కూడా బస్సులు జిల్లాను కలుపుతాయి.

మూలాలు

[మార్చు]
  1. "2011 Census of India" (MS Excel). Indian government. 16 April 2011.
  2. "Manchester of South India". Archived from the original on 3 మే 2015. Retrieved 30 August 2015.
  3. "Indian Government press release". Press Information Bureau, Government of India. 31 October 2011. Archived from the original on 30 June 2015. Retrieved 31 January 2013.
  4. "Coimbatore district, Census 2011". Government of India. Retrieved 30 August 2015.
  5. Subramanian, T. S (28 January 2007). "Roman connection in Tamil Nadu". The Hindu. Archived from the original on 19 సెప్టెంబరు 2013. Retrieved 28 October 2011.
  6. "Kovai's Roman connection". The Hindu. 8 January 2009. Archived from the original on 25 January 2009. Retrieved 9 June 2010.
  7. "On the Roman Trail". The Hindu. 21 January 2008. Archived from the original on 10 November 2012. Retrieved 9 June 2010.
  8. Vanavarayar, Shankar (21 June 2010). "Scripting history". The Hindu. Archived from the original on 10 November 2012. Retrieved 9 May 2011.
  9. M, Soundariya Preetha (30 June 2007). "Tale of an ancient road". The Hindu. Archived from the original on 3 July 2007. Retrieved 9 May 2011.
  10. "The land called Kongunad". The Hindu. 19 November 2005. Archived from the original on 29 March 2006. Retrieved 9 June 2010.
  11. "Remembering Dheeran Chinnamalai". The Hindu. 3 August 2007. Archived from the original on 28 March 2008. Retrieved 15 January 2011.
  12. "Namma Kovai". The Hindu. 31 December 2013. Retrieved 28 June 2015.
  13. "The city that is Coimbatore". The Hindu. 30 April 2005. Archived from the original on 26 July 2011. Retrieved 9 June 2010.{{cite news}}: CS1 maint: unfit URL (link)
  14. S. Muthiah (14 April 2003). "'Golden Tips' in the Nilgiris". The Hindu. Archived from the original on 7 August 2007. Retrieved 9 June 2010.{{cite news}}: CS1 maint: unfit URL (link)
  15. "The cotton classic". Frontline (magazine). 30 January 2004. Archived from the original on 29 June 2006. Retrieved 9 June 2010.{{cite news}}: CS1 maint: unfit URL (link)
  16. Decadal Variation In Population Since 1901
  17. "Census Info 2011 Final population totals". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Retrieved 26 January 2014.
  18. "Census Info 2011 Final population totals". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Retrieved 26 January 2014.
  19. "Census Info 2011 Final population totals - Coimbatore district". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Retrieved 26 January 2014.
  20. "Government sanctions two new taluks". The Hindu. 2013-12-05. ISSN 0971-751X. Retrieved 2023-03-21.
  21. 21.0 21.1 "Table C-01 Population by Religion: Tamil Nadu". censusindia.gov.in. Registrar General and Census Commissioner of India. 2011.
  22. "Table C-16 Population by Mother Tongue: Tamil Nadu". Census of India. Registrar General and Census Commissioner of India.
  23. "Front Page : Coimbatore sees growth in air passenger traffic". The Hindu. 6 February 2015. Retrieved 6 February 2015.
  24. "Front Page : Extended runway ready at Coimbatore Airport". The Hindu. 20 April 2008. Archived from the original on 23 April 2008. Retrieved 23 September 2009.
  25. "Business Plan for Coimbatore Corporation" (PDF). Wilbur Smith Associates. Retrieved 9 May 2011.

వెలుపలి లంకెలు

[మార్చు]