కోయ భాష

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కోయ భాష గిరిజన జాతియైన కోయ వారు ఎక్కువగా మాట్లాడే భాష. ఆంధ్ర ప్రదేశ్‍లోని ఖమ్మం, వరంగల్, కోస్తాలోని కొన్ని అతి తక్కువ ప్రాంతాల వారు మాత్రమే కోయ భాషను మాట్లాడతారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని భద్రాచలం నుండి చత్తీస్ గఢ్ బార్డర్ చుట్టు ప్రక్కల ప్రాంతాలు, మహారాష్ట్రలోని సరిహద్దు ప్రాంతాలలోనూ కోయలు ఊన్నారు. ఇది పూర్తిగా గిరిజన, లిపి లేని భాష. అంతరించిపోతున్న భారతీయ భాషల కోవలోకి చేరిన భాష. అడవి ప్రాంతాలలోని కోయలు పూర్తిగా కాకున్నా కొంత అనాగరికలుగానే ఉంటున్నారు. వీరు తమ మాతృభాషతోపాటు తెలుగు కూడా మాట్లాడగలరు. వ్యవసాయం, పశు పెంపకం వీరి ముఖ్య జీవనభృతులు. అడవుల సమూహం మధ్యలో గడ్దితో కప్పిన ఇల్లలో వీరు ఎక్కువగా నివసిస్తారు. కోయభాష గోండిభాషకు ఒక మాండలికం అనే వాదన కొందరు భాషావేత్తలలో ఉన్నా కోయభాష పూర్తిగా తెలుగు, తమిళం, కన్నడ భాష లాగానే ఒక స్వతంత్ర భాష అని అధికుల విశ్వాసం.

కోయభాషలో కొన్ని మాటలు

[మార్చు]
  1. దోడ తిత్తినే (అన్నం తిన్నావా?)
  2. బాత్ కుసిరి (ఏం కూర?)
  3. దెమ్ము (పడుకో)
  4. ఏరు వాట (నీరు ఇవ్వు, పెట్టు)
  5. మీ పెదేరు బాత ( నీ పేరు ఏమిటి?)

మరం (చెట్టు), వీసి (ఈగ), కెల్లా (చెప్పుtell) గొగ్గోడు (కోడిపుంజు), వెరకాడు (పిల్లి) ఇయ్య (నాన్న), అవ్వ (అమ్మ) .... ఇత్యాది మాటలు.

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కోయ_భాష&oldid=2991554" నుండి వెలికితీశారు