కోరింగ వన్యప్రాణి అభయారణ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
IUCN category IV (habitat/species management area)
Coringa Wildlife Sanctuary.JPG
కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వద్ద గోదావరి పాయ
Map showing the location of కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
Map showing the location of కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
ఆంధ్ర ఒరదేశ్ లోని కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం స్థలం
ప్రదేశంఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
సమీప నగరంకాకినాడ
భౌగోళికాంశాలు16°49′53″N 82°20′12″E / 16.83139°N 82.33667°E / 16.83139; 82.33667Coordinates: 16°49′53″N 82°20′12″E / 16.83139°N 82.33667°E / 16.83139; 82.33667
విస్తీర్ణం235.7 kమీ2 (58,200 acres)
స్థాపితంజూలై 5, 1978 (1978-07-05)
పాలకమండలిఆంధ్ర ప్రదేశ్ అటవీ శాఖ

కోరింగ అభయారణ్యం లేదా కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అతిపెద్ద మడ అడవులు అభయారణ్యం. ఈ అడవులు గోదావరి నదీ ముఖద్వారంలోని ఒక భాగంలో ఉన్నాయి. ఇవి కాకినాడకి సమీపంలో కోరింగ వద్ద ఉన్నాయి[1]

మడ అడవులు[మార్చు]

కోరంగి అభయారణ్యం (ఆంగ్లము: CORINGA WILD LIFE SANCTUARY) మడ అడవులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడనుండి 10 కి.మీ. దూరంలో ఉంది. అటవీశాఖ వారి లెక్కప్రకారం 235 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న మడ అడవులు దేశంలోనే రెండవ పెద్ద మడ అడవులుగా స్థానం సంపాదించుకున్నాయి. చిత్తడినేలలో పెరిగే చెట్లయొక్క వేర్ల వ్యవస్థ భిన్నంగా ఉంటుంది. భూమిలోనికి ఉండే వేర్లవల్ల ఈ చెట్లకి కావలసినంత ఆక్సిజన్‌ తీసుకొనే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే, ఇక్కడి నేలలు నిరంతరం నీటిలో మునిగి ఉంటాయి. వేర్ల ద్వారా గాలిపీల్చుకునే ఈ 'చిత్తడి అడవులు ' కేవలం నదీ సాగర సంగమ ప్రదేశంలో ఏర్పడ్డ చిత్తడి (బురద) నేలల్లోనే పెరరుగుతాయి. అన్ని నదీ సాగర సంగమాలు చిత్తడి నేలలని ఏర్పరచవు. గంగాతీర ప్రాంతం పశ్చిమ బెంగాల్లోని "సుందర వనాలు " మడ అడవుల తరువాతి స్థానం కోరంగి అభయారణ్యానిదే. అందంగా, గుబురుగా, దట్టంగా పెరిగే ఈ అడవులు సముద్రపు కోతనుంచి భూమిని రక్షించే పెట్టని కోటలుగా ఉన్నాయి.

వృక్ష, జంతు సంపద[మార్చు]

మడ అడవులు వివిధ రకాల పక్షిజాతులకు ఆవాస ప్రాంతంగా ఉందని, ఉభయచరాలు, పక్షులు, క్షీరజాతులు మొత్తం 119రకాల జీవజాలం వీటిలో నివసిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ అటవీశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ (డబ్ల్యుఎల్‌) జగదీష్‌ కిష్వంత్‌ పేర్కొన్నారు [2]. ఇక్కడ పొన్న, మడ, కళింగ, గుగ్గిలం మొదలైనటువంటి మడజాతి మొక్కలతో దట్టమైన వృక్ష సంపద కలిగి వున్న ప్రాంతం. ఇక్కడ చేపలు పట్టు పిల్లి, నీటికుక్క, నక్క వంటి జంతువులు ఉన్నాయి. ఇక్కడ సముద్రపు తాబేలు, ఉప్పునీటి మొసలిని చూడవచ్చు. పక్షులలో ఎక్కువగా కనిపించేవి నీటి కాకి, కొంగ, నారాయణ పక్షులు, ఉల్లం పిట్టలు, బాతులు, సముద్రపు చిలకలు.

సందర్శనకు అనువైన సమయం[మార్చు]

వర్షాకాలం వెళ్ళిన తరువాత అక్టోబరు నుంచి మే వరకు కోరింగ అభయారణ్యాన్ని సందర్శించడానికి అనువైన సమయం[3]. నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు వలస పక్షులను చూడవచ్చు. జనవరి నుంచి మార్చి నెలల వరకు  సముద్రపు తాబేళ్ళు, సముద్ర తీరాన గుడ్లు పెట్టడానికై వస్తాయి. సంవత్సరంలో 12 నెలలూ ఈ అభయారణ్యాన్ని దర్శించవచ్చు ఐతే  దర్శించటానికి నవంబరు, డిసంబరు నెలలు  అత్యుత్తమమైనవి. జీవవైవిధ్యాన్ని ప్రత్యక్షంగా చూపడానికి, విజ్ఞానాన్నీ, వినోదాన్నీ ఒకే చోట పొందడానికి ఎకో పర్యాటకం - మడ అడవుల సందర్శన ఎంతగానో ఉపయోగపడుతుంది. రంగురంగుల పడవలు, చిత్తడినేలలు, సముద్రపు గాలీ ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

పర్యటనలు (Tours)[మార్చు]

గౌతమి నది ఉప్పుకయ్య లోని ఈ సుందరమైన మడ అడవులులో పడవల మీద  సముద్రం వరకూ సుమారు 30 నిమిషాల సేపు ప్రయాణించగలిగే సౌకర్యం కూడా ఇక్కడ ఉంది. అభయారణ్య పడవ రేవు నుంచి ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల దాకా పడవ సౌకర్యం ఉంది. మనిషికి 50 రూ||లు ప్రవేశ ధరపై, రేవు నుంచి, సముద్ర ముఖద్వారం దాకా, పడవ లో, మడ అడవుల గుండా తీసుకు వెళ్తారు.  కనీసం 10 మంది ప్రయాణీకులు ఉంటే పడవ నడుపుతారు. లేదా తక్కువైన ప్రయాణీకుల రుసుము కూడా చెల్లించి, సముద్రముఖము వరకు పయనించవచ్చును.

ఇంకా ఓడలకు దిక్కు తెలియుటకై, రేవున ఉండే దీపస్తంభం (Light-house) దాకా పడవ వెళ్ళే మరో పర్యటన కూడా ఉంది. దీనికి ఒక రోజు ముందు ఆరక్షణ (Reservation) చేసుకొనవలెను. సముద్రపు ఆటు పోటు  ల పై ఆధారపడి పడవ ప్రయాణ సమయాలు నిర్ధారిస్తారు. ఉదయం 8 గం||లకు అభయారణ్యానికి పర్యాటకులు రావాల్సుంటుంది. ఇది పూర్తి రోజు పర్యటన. కనీసం 15 మంది ప్రయాణీకులు ఉన్నా లేక  5000/- రూపాయల రుసుము చెల్లించినా ఈ పర్యటన చెయ్యవచ్చు. దీపస్తంభం పై నుంచి మడ అడవుల సౌందర్యాన్ని వీక్షించవచ్చు. ఈ ప్రయాణం లోనే కోరంగి సుందర సముద్రతీరం (Beach) కూడా చూడవచ్చు. దీపస్తంభ యాత్రీకులు తమతో ఆహారము మరియు నీటిని తీసుకు రావలెను. Light-house వద్ద ఎలాంటి తినుబండారాలు లభించవు.

ఈ మడ ఆడవులలో దీపస్తంభం వెళ్ళలేని వారు పడవరేవు దగ్గర ఉన్న ఎత్తైన గోపురం (Watch Tower) పై నుంచి మడ అడవుల సౌందర్యాన్ని వీక్షింపవచ్చు. ఇంకా చూడవలసినవి చెక్కబాట (Boardwalk), కోరంగి తాళ్ళ వంతెన (Corangi Rope Bridge).

ప్రయాణ మార్గం, వసతి[మార్చు]

కాకినాడ రైల్వేస్టేషను నుండి 10 కి.మీ., రాజమండ్రి రైల్వే స్టేషను నుండి 70 కి.మీ. సమీప విమానాశ్రయం రాజమండ్రి. కాకినాడ నుంచి ఆటో లేక టాక్సీలో ఇక్కడకు సులభంగా చేరుకోవచ్చును. ఇక్కడ తిరుగు ప్రయాణానికి వాహనాల లభ్యత తక్కువ కావున, అందుకు ముందుగానే వాహన ఏర్పాటు చేసుకోవాలి. లేనిచో కోరంగి బస్‌స్టాండ్ కు నడవాలి.

వసతి సౌకర్యం: కోరింగ వద్ద అటవీ శాఖ వారి విశ్రాంతి గృహం. ముందస్తు అభ్యర్ధనపై భోజన సౌకర్యం ఉందిక్కడ.

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]