కోశ విధానం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

మూస:Public finance

అర్ధశాస్త్ర రీత్యా, ఆర్ధిక వ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రభుత్వ వ్యయ ఉపయోగం మరియు ఆదాయ సేకరణను కోశ విధానం అనవచ్చు.[1]

మరొక ముఖ్యమైన ఆర్ధిక విధానమైన ద్రవ్య విధానానికి ఇది వ్యతిరేకమైనదిగా పేర్కొనవచ్చు, ఇది వడ్డీరేట్లను మరియు ద్రవ్య సరఫరాను నియంత్రించి ఆర్ధిక వ్యవస్థను స్థిరపరచడానికి ప్రయత్నిస్తుంది. కోశ విధానం యొక్క రెండు ముఖ్యమైన సాధనాలు ప్రభుత్వ వ్యయం మరియు పన్నువిధానం. పన్ను విధానం యొక్క మేళవింపు స్థాయి మరియు ప్రభుత్వ వ్యయాలలో మార్పులు ఆర్ధికవ్యవస్థలోని క్రింది చరాలను ప్రభావితం చేస్తాయి:

  • సరాసరి డిమాండ్ మరియు ఆర్ధిక కార్యక్రమ స్థాయి;
  • వనరుల కేటాయింపు నమూనా;
  • ఆదాయ పంపిణీ.

ఆర్ధిక కార్యకలాపాలపై బడ్జెట్ ఫలితం యొక్క మొత్తం ప్రభావాన్ని కోశావిధానం సూచిస్తుంది. కోశ విధానం ఉండగల మూడు దృక్పధాలు తటస్థ, విస్తరణ, మరియు కుదించబడినది:

  • కోశ విధానం యొక్క తటస్థ దృక్పధాన్ని ఒక సంతులిత బడ్జెట్ కలిగి ఉంటుంది అంటే G = T (ప్రభుత్వ వ్యయం = పన్ను ద్వారా సమకూరే ఆదాయం). ప్రభుత్వ వ్యయం పూర్తిగా పన్ను రాబడి నుంచి చేయబడుతుంది మరియు ఆర్ధిక కార్యకలాపాల స్థాయిపై మొత్తం బడ్జెట్ ఫలితం తటస్థ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.
  • కోశ విధానం యొక్క విస్తరణ దృక్పధంలో ప్రభుత్వ వ్యయంలో పెరుగుదల ద్వారా (G > T) ప్రభుత్వ వ్యయంలో నికర పెరుగుదల, పన్ను ఆదాయంలో తరుగుదల, లేదా రెండిటి కలయిక. ఇది ప్రభుత్వానికి అంతకు ముందు ఉన్నదాని కంటే అధిక బడ్జెట్ లోటుకు లేదా అల్ప బడ్జెట్ మిగులుకు దారి తీస్తుంది, లేదా ప్రభుత్వం ఇంతకు ముందు సంతులిత బడ్జెట్ ను కలిగిఉంటే లోటుకు దారితీస్తుంది. విస్తరణ కోశ విధానం సాధారణంగా లోటు బడ్జెట్ తో కలసిఉంటుంది.
  • అధిక పన్ను ఆదాయం, తగ్గిన ప్రభుత్వ వ్యయం, లేదా రెండిటి కలయిక ద్వారా ప్రభుత్వ వ్యయం తగ్గినపుడు ఈ విధమైన కుదింపు కోశ విధానం ఏర్పడుతుంది (G < T). ఇది ఇంతకుముందు ప్రభుత్వం కలిగిఉన్న దానికంటే తక్కువ బడ్జెట్ లోటుకు లేదా అధిక మిగులుకు దారి తీస్తుంది, లేదా ప్రభుత్వం ఒకవేళ సంతులిత బడ్జెట్ ను కలిగిఉంటే మిగులుకు దారితీస్తుంది. కుదింపు కోశ విధానం సాధారణంగా మిగులుతో కలసిఉంటుంది.

అల్ప మాంద్యాన్ని ఎదుర్కోవడానికి కోశ విధానాన్ని ప్రవేశ పెట్టడం అనే జాన్ మేనార్డ్ కీన్స్ భావన 1930ల లోని గొప్ప మాంద్యానికి ప్రతిస్పందనలో భాగం.

సమీకరణ విధానాలు[మార్చు]

ప్రభుత్వాలు అనేక రకాల విషయాలపై ద్రవ్య వెచ్చింపు చేస్తాయి, దీనిలో సైనిక మరియు పోలీసు వ్యయం నుండి విద్య మరియు ఆరోగ్యం వంటి వాటితో పాటు, శ్రేయస్సు ప్రయోజనాల వంటి మార్పిడి చెల్లింపులు కూడా ఉంటాయి.

ఈవ్యయం విభిన్న మార్గాల ద్వారా సమీకరణ చేయబడుతుంది:

లోటు సమీకరణ[మార్చు]

కోశ లోటు సమీకరణకు తరచూ ప్రభుత్వ బిల్లులు లేదా కన్సోల్స్ వంటి పత్రాలు జారీ చేయబడతాయి. ఇవి ఒక నిర్దిష్టమైన లేక అనిర్దిష్టమైన కాలానికి వడ్డీని చెల్లిస్తాయి. వడ్డీ మరియు మూలధన తిరిగిచెల్లింపు మరీ ఎక్కువైనపుడు ఆ దేశం దాని విదేశీ ఋణదాతలకు ఋణాలను చెల్లించలేదు.

మిగులు వినియోగం[మార్చు]

ఒక కోశ మిగులు భవిష్యత్ అవసరాలకోసం తరచూ పొదుపు చేయబడుతుంది, మరియు స్థానిక (అదే విధమైన ద్రవ్యం) ఆర్ధిక ఉపకరణాలలో తిరిగి అవసరమయ్యేంత వరకు పెట్టుబడిగా పెట్టవచ్చు. ఆర్ధికమాంద్య కాలంలో వలె, పన్ను లేదా ఇతర వనరుల వల్ల వచ్చే ఆదాయం తగ్గినపుడు, అదనపు ఋణాలు తీసుకోకుండానే అదే రేటులో వ్యయాన్ని కొనసాగించడానికి నిల్వలు అనుమతిస్తాయి.

కోశ విధానం యొక్క ఆర్ధిక ప్రభావాలు[మార్చు]

ధర స్థిరత్వం, సంపూర్ణ ఉద్యోగిత, మరియు ఆర్ధిక వృద్ధి వంటి ఆర్ధిక లక్ష్యాలను సాధించే ప్రయత్నంలో ప్రభుత్వాలు ఆర్ధిక వ్యవస్థలో సగటు డిమాండ్ స్థాయిని ప్రభావితం చేయడానికి కోశ విధానాన్ని ఉపయోగిస్తాయి. సగటు డిమాండ్ పెంచడానికి ప్రభుత్వ వ్యయంలో సర్దుబాటు మరియు పన్ను రేట్లు ఉత్తమ పద్ధతులని కీన్స్ అర్ధశాస్త్రం సూచిస్తుంది. అల్ప మాంద్యం లేదా ఆర్ధిక కార్యకలాపాలు తక్కువగాఉన్న సమయంలో శక్తివంతమైన ఆర్ధిక వృద్ధి మరియు సంపూర్ణ ఉద్యోగితకు ప్రయత్నంలో దీనిని ఒక తప్పనిసరి పరికరంగా ఉపయోగించవచ్చు. దాని పరిమాణం మరియు పరువును దృష్టిలో ఉంచుకొని వర్తకాన్ని పెంచుటకు ప్రభుత్వం ఈ లోటు-వ్యయ విధానాలను అమలు చేయవచ్చు. సిద్ధాంత పరంగా, దీనిని తరువాత అనుసరించే వృద్ధి కాలంలో ఆర్ధిక వ్యవస్థ విస్తరణలో ఈ లోట్లు తీర్చబడతాయి; న్యూ డీల్ ఏర్పాటుకు కారణమిదే.

ప్రభుత్వాలు ఈ బడ్జెట్ మిగులును రెండు రకాలుగా ఉపయోగిస్తాయి: బలమైన ఆర్ధిక వృద్ధి గమనాన్ని నిదానపరచేందుకు, మరియు ద్రవ్యోల్బణం మరీఎక్కువగా ఉన్నపుడు ధరలను స్థిరీకరించేందుకు. ఆర్ధిక వ్యవస్థ నుండి నిల్వలను ఉపసంహరించడం సగటు డిమాండ్ స్థాయిలను తగ్గించి దానిని కుంచింపచేసి, తద్వారా ధరలను స్థిరీకరిస్తుందని కీన్స్ సిద్ధాంతం పేర్కొంటుంది.

కొంతమంది సాంప్రదాయ మరియు నయా సాంప్రదాయ ఆర్ధికవేత్తలు కోశ విధానం ఏవిధమైన ఉద్దీపనా ప్రభావాన్ని చూపదని వాదిస్తారు; ఖజానా దృష్టిగా పిలువబడే దీనిని[ఆధారం కోరబడింది], కీన్స్ అర్ధశాస్త్రం తిరిస్కరిస్తుంది. 1930ల ఆర్ధిక ఉద్దీపనకు కీన్స్ పిలుపును వ్యతిరేకించిన, బ్రిటిష్ ఖజానాలోని సాంప్రదాయ ఆర్ధికవేత్తల సైద్ధాంతిక స్థానాలను ఖజానా దృష్టి సూచిస్తుంది. ఇప్పటివరకు ఇదేవిధమైన సాధారణవాదం నయాసాంప్రదాయ ఆర్ధికవేత్తలు కూడా వినిపించారు. వారి దృష్టిలో, ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉన్నపుడు, ప్రజలనుండి ఋణాలుగా (ప్రభుత్వ పత్రాలు జారీ చేసి), విదేశీ ఋణాలు, లేక నూతన ద్రవ్యాన్ని ముద్రించడం ద్వారా నిధులు రావలసి ఉంటుంది. ప్రభుత్వ పత్రాల ద్వారా ప్రభుత్వం లోటును భర్తీ చేసినపుడు, విపణి మొత్తంలో వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఎందుకంటే ప్రభుత్వం ఋణం తీసుకోవడం ఆర్ధిక విపణులలో ఋణం కోసం అధిక డిమాండ్ ను ఏర్పరచి, బడ్జెట్ లోటు లక్ష్యానికి విరుద్ధంగా, సగటు డిమాండ్ (AD) ను తగ్గిస్తుంది. ఈవిషయాన్ని గుంపునుండి వెలుపలకిగా పిలుస్తారు; ఇది ద్రవ్య విధానం యొక్క "సోదరి".

సాంప్రదాయ దృష్టికోణంలో, కోశ విధానం నికర ఎగుమతులను కూడా తగ్గిస్తోంది, ఇది జాతీయ ఫలితాలు మరియు ఆదాయంపై ఉపశమన ప్రభావం కలిగిఉంటుంది. ప్రభుత్వ ఋణాలు వడ్డీ రేట్లను పెంచినపుడు అది విదేశీ పెట్టుబడిదారుల నుండి విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ఎందుకంటే, మిగిలిన అన్ని విషయాలు సమానంగా ఉన్నపుడు, ఒకదేశం కోశ విధాన విస్తరణ నిర్వహణకు జారీచేసిన పత్రాలు ప్రస్తుతం అధిక ప్రతిఫలాన్ని ఇస్తాయి. మరో విధంగా, ప్రణాళికలకు విత్తం సమకూర్చాలనుకునే సంస్థలు వారి ప్రభుత్వాలతో మూలధనం కొరకు పోటీపడవలసి ఉంటుంది అందువలన వారు అధిక ప్రతిఫలాలను చూపుతారు. ఒక ప్రత్యేక దేశం నుండి ఉద్భవించే పత్రాలను కొనాలనుకుంటే, విదేశీ పెట్టుబడిదారులు ఆ దేశం యొక్క ద్రవ్యాన్ని సమకూర్చుకోవలసి ఉంటుంది. అందువలన, కోశ విస్తరణకు గురయ్యే దేశంలోకి విదేశీ ద్రవ్యం ప్రవహించినపుడు, ఆ దేశం యొక్క ద్రవ్యానికి డిమాండ్ పెరుగుతుంది. ఈ పెరిగిన డిమాండ్ దేశం యొక్క ద్రవ్య పెరుగుదలకు కారణమవుతోంది. ఒకసారి ద్రవ్యం పెరిగితే, ఆ దేశంలో తయారయ్యే వస్తువులు విదేశీయులకు ఇంతకు ముందు కంటే ఎక్కువ ఖరీదవుతాయి మరియు విదేశీ వస్తువులు ఇంతకు ముందు కంటే చవకవుతాయి. పర్యవసానంగా, ఎగుమతులు తగ్గి దిగుమతులు పెరుగుతాయి.[2]

కోశ ఉద్దీపన వలన సంభవించగల సమస్యలలో విధాన అమలుకు మరియు ఆర్ధిక వ్యవస్థలో గుర్తించగల ఫలితాలకు మధ్యగల కాల వ్యవధి, మరియు పెరిగిన డిమాండ్ వలన దారితీసే ద్రవ్యోల్బణ ప్రభావాలు ఉన్నాయి. సిద్ధాంతపరంగా, మరేవిధంగా ఉపయోగపడని వనరులను ఉపయోగించినపుడు కోశ ఉద్దీపన ద్రవ్యోల్బణాన్ని కలుగచేయదు. ఉదాహరణకు, ఒక కోశ ఉద్దీపన నిరుద్యోగిగా ఉన్న ఒక కార్మికుడికి ఉద్యోగం కల్పించినపుడు, ఏవిధమైన ద్రవ్యోల్బణ ప్రభావమూ ఉండదు; అయితే ఈఉద్దీపన మరొక ఉద్యోగంలో ఉన్న కార్మికుడిని ఉద్యోగంలోనికి తీసుకున్నపుడు, శ్రామిక సరఫరా స్థిరంగా ఉండగా దాని డిమాండ్ ను పెంచి, ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

సూచనలు[మార్చు]

  1. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3565: bad argument #1 to 'pairs' (table expected, got nil).
  2. http://www.econlib.org/library/Enc/FiscalPolicy.html

గ్రంథ సూచీ[మార్చు]

  • హేయ్న్, P. T., బోఎట్కే, P. J., ప్రిచిట్కో, D. L. (2002) : ది ఎకనామిక్ వే అఫ్ థింకింగ్ (10వ ముద్రణ). ప్రెంటిస్ హాల్.

వెలుపటి వలయము[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=కోశ_విధానం&oldid=2103001" నుండి వెలికితీశారు