కౌంట్ డ్రాక్యులా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డ్రాక్యులా పాత్ర
Bela lugosi dracula.jpg
1931లో డ్రాక్యులా చిత్రంలో బెలా లుగోసి ధరించిన కౌంట్ డ్రాక్యులా పాత్ర
కౌంట్ డ్రాక్యులా
లింగము పురుషుడు
జాతి రక్త పిశాచి
తెగ స్జెకేలీ
మిత్రపక్షాలు రెన్‍ఫీల్డ్ డ్రాక్యులా వధువులు
శత్రువులు జోనాథన్ హార్కర్అబ్రహాం వాన్ హెల్సింగ్
మొదటి పరిచయం డ్రాక్యులా (1897)
సృష్టికర్త బ్రాం స్టోకర్

కౌంట్ డ్రాక్యులా అనేది ఒక కల్పిత పాత్ర, ఇది 1897లో బ్రాం స్టోకర్ వ్రాసిన గోథిక్ భయానక నవల డ్రాక్యులా శీర్షక ప్రధానపాత్ర మరియు రక్త పిశాచి మూలరూపం. అతడి పాత్రకు చెందిన కొన్ని లక్షణాలకు ప్రేరణ, 15వ శతాబ్దపు రోమనియన్ జనరల్ మరియు వల్లచియన్ రాకుమారుడు వ్లాడ్ III ది ఇంపేలర్ కావచ్చు. సంయుక్త రాష్ట్రాలలో, ఈ పాత్ర 1899లో ప్రజా జీవితంలో ప్రవేశించింది, మరియు తరువాత తరచుగా చలనచిత్రాల నుండి అనిమేటెడ్ మీడియా మరియు అల్పాహార రకాలవరకూ, అన్ని రకాల ప్రసిద్ధ సంస్కృతిలోనూ కనిపిస్తుంది.

స్టోకర్ యొక్క నవలలో[మార్చు]

బ్రాం స్టోకర్ యొక్క నవలలో, కౌంట్ డ్రాక్యులా యొక్క లక్షణాలు, శక్తులు, సామర్థ్యాలు మరియు బలహీనతలను వివిధ వ్యాఖ్యాతలు, విభిన్న కోణాల్లో ఒక్కొక్కటిగా వివరిస్తారు.[1] ఈ వ్యాఖ్యాతల్లో ఎక్కువ సమాచారం అందించినవారు, జోనాథన్ హార్కర్, అబ్రహాం వాన్ హెల్సింగ్ మరియు మినా హార్కర్.

జీవితచరిత్ర[మార్చు]

కౌంట్ డ్రాక్యులా (అతడి పేరులో ప్రథమ భాగం నవలలో ఎక్కడా చెప్పబడలేదు) శతాబ్దాల-క్రితం సమయానికి చెందిన రక్త పిశాచి, ఇంద్రజాలికుడు మరియు ట్రాన్సిల్వేనియన్ సంస్థానాధిపతి, ఇతడు తనను తాను అట్టిలా ది హన్ వంశస్తుడైన స్జెకేలీగా చెప్పుకుంటాడు. ఇతడు బోర్గో పాస్ దగ్గరి కార్పతియన్ పర్వతాలలోని ఒక శిథిలమైన కోటలో నివసిస్తాడు. ప్రాచ్య యూరోపియన్ జానపద గాథలలోని జుగుప్సాకరమైన, శవాలను-పోలిన పాత్రలైన రక్త పిశాచులకు భిన్నంగా, డ్రాక్యులా మాత్రం తన లోతైన దుష్టత్వాన్ని కప్పిపుచ్చే రాచరికపు ముసుగును కలిగి ఉంటాడు.

అతడి ప్రారంభ జీవితపు వివరాలు అస్పష్టంగా ఉంటాయి, కానీ డ్రాక్యులా కార్పతియన్ పర్వతాలలో సిబియు నగరం (దీనినే హెర్మన్‍స్టాడ్ అని కూడా అంటారు) పైని, స్కోలోమాన్స్ లోని అకాడమీలో క్షుద్ర విద్యలు నేర్చుకుని, పరుసవేది మరియు ఇంద్రజాలంలో నైపుణ్యం సంపాదించాడని అనిపిస్తుంది.[2] వాయివోడ్‍గా అతడి తాహతు మరియు హోదాలకు అనుగుణంగా, అతడు ఆయుధాలు ధరించి, డాన్యూబ్ నది మీదుగా టర్కులకు వ్యతిరేకంగా సేనలకు నాయకత్వం వహించాడు. వాన్ హెల్సింగ్ చెప్పిన ప్రకారం:

He must indeed have been that Voivode Dracula who won his name against the Turk, over the great river on the very frontier of Turkey-land. If it be so, then was he no common man: for in that time, and for centuries after, he was spoken of as the cleverest and the most cunning, as well as the bravest of the sons of the 'land beyond the forest'.

Mina Harker's Journal, 30 September, Dracula, Chapter 18

మరణించి, అతడి కోటలోని ప్రార్థనా స్థలంలో గొప్ప సమాధిలో ఖననం చేయబడిన డ్రాక్యులా, రక్త పిశాచిగా మరణం నుండి తిరిగి వస్తాడు, మరియు అతడి ప్రక్కన అదే విధంగా సమాధి చేయబడిన ముగ్గురు అందమైన స్త్రీ రక్త పిశాచులతో కలిసి, అతడి కోటలో ఎన్నో శతాబ్దాలపాటు నివసించాడు.[3] "డ్రాక్యులా వధువులు"గా పిలువబడే వీరితో అతడి సంబంధాలు సన్నిహితమైనవి, మరియు వారిలో ఇద్దరికి కుటుంబ సారూప్యం కనిపిస్తుంది[4] కానీ కొందరు ఊహించినట్టూ, వారు అతడికి ప్రియురాళ్ళా, తోబుట్టువులా,[5] కుమార్తెలా[6] లేదా రక్త-సంబంధీకుల మిశ్రమమా అన్నది,[7] కథలో స్పష్టంగా చెప్పబడలేదు.

నవల 19 వ శతాబ్దం చివర్లో ప్రారంభం కావడం వలన, డ్రాక్యులా ప్రపంచాధిపత్యం కొరకు ఒక సుదీర్ఘ కార్యాచరణ ప్రణాళిక వేస్తాడు, మరియు తన భయానక పాలనను ప్రారంభించడానికి లండన్ను ఆక్రమిస్తాడు. అతడు హార్కర్ యొక్క యజమాని ఆధ్వర్యంలో ఉన్న స్థలానికి సంబంధించిన లావాదేవీలో చట్టపరమైన సహకారం కొరకు, ఒక క్రొత్తగా ఉత్తీర్ణుడయిన ఆంగ్ల న్యాయవాది, జోనాథన్ హార్కర్,ను పిలుస్తాడు. డ్రాక్యులా తన స్నేహపూర్వక ప్రవర్తన మరియు చారిత్రిక జ్ఞానంతో మొదట్లో హార్కర్‍ను ఆకర్షిస్తాడు, మరియు అతడిని, రక్త దాహం కలిగిన తన ముగ్గురు వధువుల నుండి కూడా రక్షిస్తాడు. కానీ నిజానికి, డ్రాక్యులా హార్కర్‍ను చట్టపరమైన లావాదేవీలు ముగిసేవరకూ మరియు ఇంగ్లాండ్ గురించి వీలైనంతగా తెలుసుకునే వరకూ, ప్రాణాలతో ఉంచాలని భావిస్తాడు.

డ్రాక్యులా తన కోటను వదలి, ఒక రష్యన్ ఓడ, డిమెటర్ లో ఎక్కుతాడు, ఇందులో తన శక్తిని తిరిగి పొందడానికి, ట్రాన్సిల్వేనియన్ మట్టితో నిండిన పెట్టెలను తీసుకు వెళతాడు. ఉత్తర ఇంగ్లాండ్లోని తీర ప్రాంత పట్టణమైన విట్బీకి ప్రయాణం చేసేటప్పుడు, అతడు ఓడలోని నావికులే ఆహారంగా జీవిస్తాడు. తరువాత కేవలం కెప్టెన్ యొక్క శరీరం లభిస్తుంది, ఇతడి శరీరం ఓడ నడిపే యంత్రానికి కట్టబడి ఉంటుంది. ఈ కెప్టెన్ వ్రాసుకున్న వివరాలు లభిస్తాయి, అందులో ఓడ ప్రయాణంలో జరిగిన వింత సంఘటనలు వివరించబడి ఉంటాయి. డ్రాక్యులా ఒక తోడేలు రూపంలో ఓడను వదలి వెళతాడు.

ఈ కౌంట్ ఆ తరువాత, హార్కర్‍ను వివాహమాడబోయే యువతి విల్హేల్మినా "మినా" ముర్రే, మరియు ఆమె ఆకర్షణీయమైన స్నేహితురాలు, లూసీ వెస్టెన్రాలను బాధిస్తాడు. ఇంకా డ్రాక్యులా మరియు రెన్‍ఫీల్డ్ మధ్య గణనీయమైన సంబంధం ఉంటుంది, రెన్‍ఫీల్డ్ ఒక మానసిక చికిత్సాలయంలో రోగి, ఇతడు బలవంతంగా కీటకాలు, సాలీడులు, పక్షులు, మరియు ఇతర ప్రాణులను, వాటి పరిమాణం వరుసలో, వాటి "జీవన శక్తి"ని పొందడానికి తింటూ ఉంటాడు. డ్రాక్యులా సామీప్యానికి స్పందిస్తూ, మరియు తగిన విధంగా కీలకమైన విషయాలు తెలియజేస్తూ, రెన్‍ఫీల్డ్ ఒక రకమైన గ్రాహకంగా పనిచేస్తుంటాడు. డ్రాక్యులా ప్రతి రాత్రీ లూసీ యొక్క పడక గదిలో ప్రవేశించి, ఆమె రక్తం త్రాగడమే కాక, అదే సమయంలో ఆమెకు రక్త పిశాచిగా మారే శాపాన్ని కూడా సంక్రమించేలా చేస్తూ ఉంటాడు. లూసీ క్షీణించడానికి కారణం తెలియక, ఆమె సన్నిహితులు లూసీని కోరుకున్నవ్యక్తికి మాజీ సలహాదారు, మరియు డచ్ వైద్యుడు అబ్రహాం వాన్ హెల్సింగ్ ను పిలుస్తారు. వాన్ హెల్సింగ్ వెంటనే ఆమె పరిస్థితి యొక్క అతీంద్రియ ఆధారాలను కనుగొంటాడు, కానీ వెలుపలికి చెప్పడు. వెల్లుల్లితో రక్తపిశాచిని దూరంగా ఉంచే ప్రయత్నాలకు అతీతంగా, డ్రాక్యులా లూసీని ఆమె గది నుండి రాత్రిపూట వెలుపలకు రప్పించి, ఆమె రక్తం త్రాగి, ఆమెను చంపి, ఆమెను జీవఛ్ఛవంగా మారుస్తాడు.

వాన్ హెల్సింగ్, హార్కర్, మరియు మునుపు లూసీని కోరుకున్న వ్యక్తులు ఆర్థర్ హోమ్‍వుడ్ మరియు క్విన్సీ మారిస్, ఆమె సమాధిగదిలో ప్రవేశించి, జీవం పొందిన ఆమె శవాన్ని చంపేస్తారు. వారు తరువాత కార్‍ఫాక్స్‌లోని డ్రాక్యులా నివాసంలో ప్రవేశించి, మట్టి నింపిన పెట్టెలను ధ్వంసం చేస్తారు, తద్వారా కౌంట్ తన విశ్రమించే సామర్థ్యాన్ని కోల్పోతాడు. డ్రాక్యులా తన స్వదేశానికి వెళ్ళడానికి ఇంగ్లాండ్ విడిచిపెడతాడు, కానీ వెళ్ళే ముందు మినాను కొరికి వెళతాడు.

నవలలో చివరి భాగంలో కథానాయకులు డ్రాక్యులాను తిరిగి ట్రాన్సిల్వేనియా వరకూ తరిమి కొడతారు, మరియు డ్రాక్యులా యొక్క వలస అంగరక్షకులతో ఆఖరి పోరాటంలో, చివరికి అతడిని నాశనం చేస్తారు. డ్రాక్యులా గుండెలో కత్తి గ్రుచ్చడం అనే దృశ్యం ఎక్కువ ప్రసిద్ధమైనప్పటికీ, మినా వివరించిన ప్రకారం జోనాథన్ హార్కర్ యొక్క కుక్రిచే అతడి గొంతు కోయబడింది, మరియు మారిస్ యొక్క బూయీ కత్తి అతడి గుండెలో దించబడింది (మినా హార్కర్ యొక్క పత్రిక, 6 నవంబర్, డ్రాక్యులా అధ్యాయం 27).

లక్షణాలు[మార్చు]

దస్త్రం:CD70.jpg
జీసస్ ఫ్రాంకో యొక్క కౌంట్ డ్రాక్యులాలో క్రిస్టఫర్ లీ. ఈ చిత్రంలో, లీ అసలైన నవలలో డ్రాక్యులా చిత్రీకరణను పోలినట్టూ ఉండే ప్రయత్నం చేయబడింది.

నవల ప్రారంభంలో డ్రాక్యులా స్నేహపూర్వకమైన ముసుగు ధరించినప్పటికీ, అతడు తరచూ తన పథకాల్లో ఎవరైనా జోక్యం చేసుకున్నప్పుడు, విపరీతంగా కోపం తెచ్చుకోవడం జరుగుతుంది. అతడి కోటలో నివసించే ముగ్గురు రక్తపిశాచి స్త్రీలు, జోనాథన్ హార్కర్‍ను ఆకర్షించే ప్రయత్నం చేసినప్పుడు, డ్రాక్యులా ఒకరిని శారీరకంగా హింసించి, వారి అవిధేయతకు తీవ్రంగా అవినయానిని దూషిస్తాడు. తరువాత తలొగ్గి, వారితో దయతో మాట్లాడతాడు, వారందరినీ నిజంగా ప్రేమిస్తున్నానని చెపుతాడు.

డ్రాక్యులా తన వీర వారసత్వం గురించి తీవ్ర మనోభావం కలిగి ఉంటాడు, హార్కర్‍తో మాట్లాడేటప్పుడు ఉద్వేగంగా, స్జెకేలీ ప్రజలలో ఎలాంటి ధీరుల రక్తం కలిసిందో గర్వంగా చెపుతాడు. అతడు బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క చరిత్ర గురించి కుతూహలాన్ని కనబరుస్తాడు, అక్కడి ప్రజల గురించి గొప్పగా మాట్లాడతాడు. అతడికి ఒకరకంగా ప్రపంచం గురించి ప్రాథమికమైన మరియు బలమైన భావాలుంటాయి; సామాన్య ప్రజలు తమలోని చీకటి భావాలను అసహ్యించుకోవడాన్ని చూసి, అతడు జాలిపడతాడు.

సామాన్యంగా ప్రాచ్య యూరోపియన్ యాస కలిగినట్టూ చిత్రించినప్పటికీ, అసలైన నవలలో మాత్రం, అతడు మాట్లాడే ఆంగ్లం అద్భుతంగా, కానీ చిత్రమైన శబ్దంతో ఉంటుందని చెప్పబడింది.

అతడి రూపం వయసుతో పాటుగా మారుతూ ఉంటుంది. నవల ప్రారంభంలో అతడు సన్నగా, పొడవైన తెల్లని మీసాలతో, వాడియైన చెవులతో మరియు పదునైన పళ్ళతో ఉన్నట్టూ వివరించబడింది. అతడు పూర్తిగా నల్లటి దుస్తులు ధరించి ఉంటాడు మరియు అరచేతులపై వెండ్రుకలు కలిగి ఉంటాడు. జోనాథన్ హార్కర్ అతడిని ముసలి వ్యక్తిగా; 'క్రూరంగా కనిపించే' విధంగా మరియు 'అసాధారణంగా పాలిపోయి' ఉన్నట్టూ వివరిస్తాడు.[8] కోపం వచ్చినప్పుడు, ఈ కౌంట్ తన నిజమైన మృగ స్వభావాన్ని చూపుతాడు, అతడి నీలి కళ్ళు ఎరుపెక్కుతాయి.

I saw... Count Dracula... with red light of triumph in his eyes, and with a smile that Judas in hell might be proud of.

—Jonathan Harker's Journal, Dracula, Chapter 4

నవల ముందుకు సాగే కొద్దీ, డ్రాక్యులా మరింత యవ్వనంతో కనిపిస్తున్నట్టూ చెప్పబడింది. కానీ, అద్దంలో డ్రాక్యులా కనిపించడని, జోనాథన్ హార్కర్ చెప్పడం వలన, డ్రాక్యులాకు భౌతిక శరీరం లేదని తెలుస్తుంది.[9][10]

శక్తులు, సామర్థ్యాలు మరియు బలహీనతలు[మార్చు]

నవలలో కౌంట్ డ్రాక్యులాకు ఎన్నో విభిన్న అతీంద్రియ సామర్థ్యాలు ఉన్నట్టూ చెప్పబడింది. వాన్ హెల్సింగ్ అభిప్రాయంలో, అతడికి 20 మందికి సమానమైన శారీరక బలం ఉంది. జీవచ్చవం కావడం వలన, అతడిపై మామూలు తరహా దాడులు పనిచేయవు. అతడిని చంపేందుకు ఏకైక మార్గం అతడి శిరస్సును ఖండించడం మరియు ఒక చెక్క కత్తిని అతడి గుండెల్లో దించడంగా చెప్పబడింది, కానీ అతడిని ఒక పవిత్రమైన బుల్లెట్‍తో కాల్చినా చాలని సూచించబడింది. ఈ కౌంట్ కొంత మేరకు గురుత్వాకర్షణను ఎదిరించాగలదు, ఇతడు నిలువు ఉపరితలాల్లో పైనుండి క్రిందకు సరీసృపం లాగా కదలగలడు. అతడికి శక్తివంతమైన హిప్నాటిక్ మరియు టెలిపతిక్ సామర్థ్యాలు ఉంటాయి, మరియు ఇతడు రాత్రిళ్ళు సంచరించే జంతువులైన తోడేళ్ళు మరియు ఎలుకలను ఆజ్ఞాపించగలడు. ఇంకా డ్రాక్యులా వాతావరణాన్ని కూడా శాసించగలడు, సామాన్యంగా తన ఉనికిని కప్పిపుచ్చడానికి పొగమంచు సృష్టించగలడు, కానీ డిమెటర్లో ప్రయాణించిన సమయంలో లాగా తుఫాన్లు కూడా సృష్టించగలడు. అతడు ఇష్ట ప్రకారం రూపధారణ చేయగలడు, నవలలో అతడు ధరించిన రూపాలు గబ్బిలం, ఎలుక, తోడేలు, ఆవిరి, మరియు మంచు. అతడికి తాజా రక్తం తప్ప మరేదీ సహించదు, దానికి అతడికి శక్తిని ప్రసాదించే ప్రభావం ఉంటుంది.[11]

వాన్ హెల్సింగ్ చెప్పినట్టూ:

The Nosferatu do not die like the bee when he sting once. He is only stronger, and being stronger, have yet more power to work evil.

Mina Harker's Journal, Dracula, Chapter 18

డ్రాక్యులా యొక్క అత్యంత మార్మిక శక్తులలో ఒకటి, తన రక్త పిశాచి పరిస్థితిని ఇతరులకు బదిలీ చేయగల సామర్థ్యం. డ్రాక్యులాతో ముగ్గురు స్త్రీ రక్త పిశాచులు ఉంటారు, కానీ వారిని అతడే తయారు చేసాడా అన్నది అస్పష్టం. అతడు నెమ్మదిగా లూసీ వెస్టెన్రాను రక్త పిశాచిగా మారుస్తాడు, మరియు ఆమె రెండుసార్లు మరణించినప్పుడు, అతడు తన దృష్టిని మినా హార్కర్ వైపు మరలుస్తాడు. కొద్ది కాలంలో ఒక పద్ధతి ప్రకారం మినా హార్కర్ రక్తం తోడివేయబడుతుంది, ఆ తరువాత ఆమె, కౌంట్ తన ఛాతీపై తానే చేసుకున్న గాయం నుండి రక్తం త్రాగవలసి వస్తుంది. అటు తరువాత, ఆమె రక్త పిశాచిగా మారడం క్రమంగా జరుగుతుంది. కానీ, బాధితులు రక్తపిశాచిగా మారడానికి, రక్తపిశాచి రక్తం త్రాగాలా అన్నది అస్పష్టం.

కానీ, డ్రాక్యులా యొక్క శక్తులు అపరిమితమైనవి కావు. అతడు పగటి సమయంలో ఎంతో తక్కువ శక్తి కలిగి ఉంటాడు, మరియు తన రూపాన్ని ఉదయాన, మధ్యాహ్నం, మరియు సాయంత్రం మాత్రమే మార్చుకోగలడు (రాత్రిళ్ళు అతడు స్వేచ్ఛగా మారగలడు). సూర్యుడు అతడికి ప్రాణహాని కలిగించడు, ఎందుకంటే సూర్యకాంతి తగిలినప్పుడు అతడిని కాల్చడం లేదా నాశనం చేయడం జరగదు. అతడికి వెల్లుల్లి, శిలువలు మరియు పవిత్రమైన రొట్టె అంటే పడదు, మరియు అతడు ప్రవహించే నీటిని తక్కువ లేదా ఎక్కువ అలలపై మాత్రమే దాటగలడు. అతడిని ఆహ్వానిస్తే మాత్రమే అతడు ఒక ప్రదేశంలో అడుగు పెట్టగలడు; కానీ, ఒకసారి ఆహ్వానం అందుకున్న తరువాత, అతడు ఆ పరిసరాలను స్వేచ్ఛగా సంచరించగలడు.

అతడు విజయవంతంగా విశ్రాంతి తీసుకోవడానికి ట్రాన్సిల్వేనియన్ మట్టి కూడా అవసరం; లేదా, అతడు తన శక్తిని పుంజుకోలేడు.

డ్రాక్యులా యొక్క శక్తులు మరియు బలహీనతలు ఎన్నో అనుసరణలలో తీవ్రంగా మారతాయి. మునుపటి మరియు తరువాతి వివిధ గాథల్లోని రక్త పిశాచులకు ఇటువంటి రక్తపిశాచి లక్షణాలు ఉండేవి.

ప్రసిద్ధ సంస్కృతిలో[మార్చు]

దస్త్రం:DraculaWaxMuseum.JPG
హాలీవుడ్ వాక్స్ మ్యూజియంలో కౌంట్ డ్రాక్యులా వేషంలో బెలా లుగోసి

ప్రసిద్ధ సంస్కృతిలో కచ్చితంగా అత్యంత ప్రముఖ ప్రతినాయకులలో డ్రాక్యులా ఒకడు. ఎలాంటి ఇతర భయానక పాత్రకన్నా ఎక్కువగా, ఎన్నో చలనచిత్రాలు మరియు టెలివిజన్ రూపాంతరాలలో, ఎందరో నటులు ఈ పాత్ర పోషించారు.[12] ఈ పాత్ర పోషించిన నటులు మాక్స్ స్క్రెక్, బెలా లుగోసి, క్రిస్టఫర్ లీ, డెన్హాల్మ్ ఎలియట్, జాక్ పాలన్స్, లూయిస్ జోర్డాన్, ఫ్రాంక్ లాంగెల్లా, క్లౌస్ కిన్స్కి, గారీ ఓల్డ్‌మాన్, లెస్లీ నీల్సెన్, జార్జ్ హామిల్టన్, గేరార్డ్ బట్లర్, రిచర్డ్ రాక్స్‌బర్గ్, రట్గర్ హౌర్, స్టీఫెన్ బిల్లింగ్‍టన్ మరియు డొమినిక్ పర్సెల్. ఈ పాత్ర రక్తపిశాచి యొక్క సాంస్కృతిక నమూనాతో దగ్గరి సంబంధం కలిగి ఉంది, మరియు ఇప్పటికీ ప్రముఖ హాలోవీన్ వేషధారణగా కొనసాగుతోంది.

పాండిత్యం[మార్చు]

విశ్వంలోని తాత్పర్యాలు[మార్చు]

పండితులు నినా ఓర్బాక్ మరియు డేవిడ్ స్కాల్, నవల ముగింపులో డ్రాక్యులా యొక్క నిర్మూలనం తరువాత సవ్యమైన కర్మలు లేకపోవడం వలన, డ్రాక్యులా నిజంగా సమాప్తి అయిన విషయం అనుమానాస్పదం, అని వాదించారు.[13][14]

చరిత్రకు పాక్షిక సూచనలు[మార్చు]

వ్లాడ్ III డ్రాక్యులా చిత్రం.

1972లో, రాడు ఫ్లోరేస్కూ మరియు రేమాండ్ మెక్‍నల్లీ వ్రాసిన ఇన్ సెర్చ్ ఆఫ్ డ్రాక్యులా ప్రచురణతో, ట్రాన్సిల్వేనియాలో-పుట్టిన వల్లచియన్ యొక్క వ్లాడ్ III డ్రాక్యులా మరియు స్టోకర్ యొక్క కల్పిత డ్రాక్యులాల మధ్య సంబంధం ఎంతో ప్రాచుర్యం పొందింది.

చారిత్రికంగా, వ్లాడ్ టేపెస్ కుటుంబానికి ఇవ్వబడిన పేరు "డ్రాక్యులా", ఇది లక్సెంబోర్గ్ యొక్క సిగిస్మండ్ (హంగరీ, క్రొయేషియా మరియు బొహేమియాల రాజు, మరియు పవిత్ర రోమన్ చక్రవర్తి) ఏర్పాటు చేసిన రహస్య సైనికుల సంఘం, దీనిని ఆర్డర్ ఆఫ్ ది డ్రాగన్ అని పిలిచేవారు, దీనిని ఒట్టోమన్ మరియు టర్కుల నుండి సామ్రాజ్యాన్ని కాపాడడానికి మరియు క్రైస్తవ మతాన్ని పరిరక్షించడానికీ ఏర్పాటు చేసారు. వ్లాడ్ III తండ్రి, వ్లాడ్ II డ్రకుల్, సుమారు 1431 ప్రాంతంలో, టర్కులతో యుద్ధంలో అతడి ధైర్య సాహసాల కారణంగా ఈ సైన్యంలో చేర్చుకోబడ్డాడు, మరియు ఇతడిని డ్రకుల్ (డ్రాగన్)గా పిలిచేవారు, కాబట్టి ఇతడి కుమారుడు డ్రాక్యులా (డ్రాగన్ కుమారుడు)గా పిలువబడ్డాడు. 1431 నుండి, వ్లాడ్ II ఆ సైన్యం చిహ్నాన్ని ధరించడం ప్రారంభించాడు, మరియు తరువాతి కాలంలో, వల్లచియన్ పాలకుడిగా, అతడి నాణేలపై డ్రాగన్ చిహ్నం ఉండేది.[15]

స్టోకర్, రోమన్ చరిత్ర చదివే సమయంలో డ్రాక్యులా పేరును చూసి, తన ప్రతినాయకుడికి తాను నిజానికి ఉపయోగించాలనుకున్న పేరు (కౌంట్ వాంపైర్ )ను దీంతో మార్చాడు. కానీ, ఎలిజబెత్ మిల్లర్ నేతృత్వంలో కొందరు డ్రాక్యులా పండితులు, ఈ సంబంధం లోతును ప్రశ్నించారు.[16] వారి వాదన ప్రకారం, స్టోకర్‍కు నిజానికి చారిత్రిక వ్లాడ్ III గురించి, పేరు మినహా ఏమీ తెలియదు. నవలలో డ్రాక్యులా తన స్వంత నేపథ్యం గురించి వివరించే భాగాలున్నాయి, మరియు ఈ మాటల వలన, స్టోకర్‍కు కొద్దిగా రోమనియన్ చరిత్ర గురించి తెలిసినప్పటికీ, బహుశా లోతుగా తెలియదని అనిపిస్తుంది. స్టోకర్, డ్రాక్యులాను "టర్కులతో యుద్ధంలో వాయివోడ్ డ్రాక్యులా పేరు సంపాదించిన" విషయం మినహా ఏమీ చెప్పలేదు, ఇలా చెప్పడం వలన వల్లచియన్ నేలపై టర్కులతో రాకుమారుడు వ్లాడ్ యొక్క ప్రసిద్ధ యుద్దాలతో రక్తపిశాచికి నిర్దిష్టమైన సంబంధం ఉన్నట్టూ కనిపిస్తుంది. కానీ, వ్లాడ్ III వ్లాచ్ తెగకు చెందినవాడు కాగా[ఆధారం కోరబడింది], కల్పిత డ్రాక్యులా మాత్రం తను స్జెకేలీనని చెప్పుకుంటాడు.[17]

కొందరు మాత్రం కౌంటెస్ హంగరీ రాజ్యంలో జన్మించి, 80 మంది యువతుల హత్యలో దోషిగా నిలిచిన ఎలిజబెత్ బెతరీ గాథ, స్టోకర్‍పై ప్రభావం చూపిందని సూచించారు, కానీ ఈ వాదనలు తప్పు కావచ్చు.[18]

గమనికలు[మార్చు]

 1. బ్రాం స్టోకర్ వ్రాసిన డ్రాక్యులా పై నార్టన్ విమర్శనాత్మక ప్రచురణ, కేరాల్ N. సేన్ఫ్ వ్రాసిన "డ్రాక్యులా: ది అన్‍సీన్ ఫేస్ ఇన్ ది మిర్రర్" (1997), సంపాదకత్వం నినా ఓర్బాక్ మరియు డేవిడ్ J. స్కాల్: 421-31
 2. డ్రాక్యులా అధ్యాయం 18 మరియు అధ్యాయం 23
 3. డ్రాక్యులా అధ్యాయం 27
 4. డ్రాక్యులా అధ్యాయం 3
 5. నార్టన్ విమర్శనాత్మక ప్రచురణ డ్రాక్యులా (1997)లో అధ్యాయం 3లోని సూచన: పుట 42
 6. క్రిస్టఫర్ క్రాఫ్ట్ "కిస్ మీ విత్ దోస్ రెడ్ లిప్స్: జెండర్ అండ్ ఇన్వర్షన్ ఇన్ బ్రాం స్టోకర్స్ డ్రాక్యులా" డ్రాక్యులా యొక్క నార్టన్ విమర్శనాత్మక ప్రచురణలో (1997): 444-59
 7. క్రిస్టఫర్ క్రాఫ్ట్ ""కిస్ మీ విత్ దోస్ రెడ్ లిప్స్: జెండర్ అండ్ ఇన్వర్షన్ ఇన్ బ్రాం స్టోకర్స్ డ్రాక్యులా" డ్రాక్యులా యొక్క నార్టన్ విమర్శనాత్మక ప్రచురణలో (1997): 444-59
 8. డ్రాక్యులా , అధ్యాయం 2
 9. డ్రాక్యులా అధ్యాయం 2
 10. ఫ్రాంకో మోరెట్టి (1988) సైన్స్ టేకన్ ఫర్ వండర్స్: సాహిత్య రూపాల్లో సమాజ శాస్త్ర వ్యాసాలు . న్యూ యార్క్, వెర్సో: 90-104
 11. డ్రాక్యులా , అధ్యాయం 18
 12. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఎక్స్‌పీరియన్స్
 13. ఒర్బాక్ మరియు స్కాల్ (1997) డ్రాక్యులా యొక్క నార్టన్ విమర్శనాత్మక ప్రచురణ "ఉపోద్ఘాతం"
 14. క్లింగర్, లెస్లీ S. ది న్యూ యానొటేటెడ్ డ్రాక్యులా . W.W. నార్టన్ & కో., 2008. ISBN 0-231-12232-2.
 15. http://www.britannica.com/EBchecked/topic/631524/Vlad-III
 16. "ఫైలింగ్ ఫర్ డివోర్స్: కౌంట్ డ్రాక్యులా వర్సెస్ వ్లాడ్ టేపెస్" ("డ్రాక్యులా: ది షేడ్ అండ్ ది షాడో" నుండి, సం. ఎలిజబెత్ మిల్లర్, వెస్ట్‌క్లిఫ్-ఆన్-సీ: డెసర్ట్ ఐలాండ్ బుక్స్, 1998)
 17. డ్రాక్యులా జోనాథన్ హార్కర్ యొక్క పత్రిక అధ్యాయం 3
 18. bathory.org/miller02.html

సూచనలు[మార్చు]

 • క్లైవ్ లెదర్‍డేల్ (1985) డ్రాక్యులా: ది నావెల్ అండ్ ది లెజెండ్ . డెసర్ట్ ఐలాండ్ బుక్స్.
 • బ్రాం స్టోకర్ (1897) డ్రాక్యులా . నార్టన్ క్రిటికల్ ఎడిషన్ (1997) నినా ఒర్బాక్ మరియు డేవిడ్ J. స్కాల్ సంపాదకత్వం వహించింది.

బాహ్య లింకులు[మార్చు]

మూస:Dracula