కౌముది(షంషుద్దీన్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కౌముది
జననంచింతకాని గ్రామం, ఖమ్మం జిల్లా
వృత్తిసాహితీకారుడు
మతంముస్లిం

కౌముదిగా తెలుగు సాహితీవేత్త. అతని అసలు పేరు షంషుద్దీన్‌.

జననం, బాల్యం[మార్చు]

ఖమ్మం జిల్లాలోని చింతకాని గ్రామంలో జన్మించారు. తండ్రి మహమ్మద్ హుస్సేన్, తల్లి కుల్సుం.

ఉద్యోగం[మార్చు]

విశాలాంధ్ర పత్రికలో విలేకరిగా వృత్తి జీవితం ప్రారంభించిన కౌముది అభ్యుదయ రచయితల సంఘంలోనూ కొనసాగారు. కౌముది ఖమ్మం జిల్లాలో హిందీ అధ్యాపకుడిగా పని చేసారు ఉన్నత విధ్యాబ్యాసం మొత్తం అలహాబాద్, ఆగ్రా లో సాగింది.1960-64 మధ్య కాలం లో "మా భూమి" అనే పత్రిక నడిపారు.

సాహితీ కృషి[మార్చు]

కౌముది అనేక రచనల ద్వారా తెలుగు సాహిత్య జగత్తులో వెలిగారు. సాహితీ ప్రక్రియలో ఉన్నత ఖ్యాతి సాధించాడు. అభ్యుదయ తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్‌, సంస్కృత భాషల్లో తన సాహిత్య యాత్ర సాగించాడు. కవిగా, గాయకుడిగా, సాహితీ విమర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞ చాటాడు. కళంకిని, విజయ అనే రెండు నవలలు వ్రాశాడు. రంగభూమిని సుంకర, వాసిరెడ్డి తో కలిసి అనువదించాడు.‘కళ్యాణ మంజీరాలు’ అనే నవలను ఉర్దూ నుండి అనువదించారు. అనేక గీతాలు కవితలు రాశాడు. అతని మరణాంతరం అభిమానులు అల్విదా అనే పేరుతో అతని కవితల సంకలనాన్ని వెలువరించారు. ‘అల్విదా’ కవితను డిగ్రీ విద్యార్థుల పాఠ్యాంశంలో చేర్చారు[1].

మూలాలు[మార్చు]

  1. గుర్రం సీతారాములు. "ఈ వెన్నెల ఎంతో ఎరుపు". సారంగ అంతర్జాల పత్రిక. Retrieved 15 January 2020.[permanent dead link]