కౌషికి చక్రబర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కౌషిక్ చక్రబర్తి
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంకొషిక్ చక్రబర్తి
జననం (1980-10-24) 1980 అక్టోబరు 24 (వయసు 43)
మూలంకోల్‌కతా, భారతదేశం
సంగీత శైలిహిందూస్థానీ సంగీత
వృత్తిగాయని
క్రియాశీల కాలం1992–ప్రస్తుతం
వెబ్‌సైటుkaushikichakraborty.com

కౌషిక్ చక్రబర్తి,  (జననం 1980 అక్టోబరు 24) [1] ప్రముఖ భారతీయ శాస్త్రీయ సంగీత గాత్ర కళాకారిణి. ఆమె తండ్రి అజోయ్ చక్రబర్తి.అతను కూడా శాస్త్రీయ సంగీత కళాకారుడు, గీత రచయిత, సంగీత దర్శకుడు.ఆమె కలకత్తాకు చెందిన ప్రముఖ సంగీత కళాకారుల కుటుంబంలో పుట్టింది.పాటియాలా గరానా శైలి, గయకీ  స్టైల్‌లో సంగీతంలో శిక్షణ పొందింది.

ఆమె సంగీత రీసెర్చి అకాడమీలోనే సంగీతం నేర్చుకుంది.ఆమె పాటియాలా ఘరానా ప్రతిపాదకులలో ఒకరు.ఆమె కచేరీలో ఖ్యాల్స్ 'సెమీ-క్లాసికల్' తుమ్రిస్ ఉంటాయి.ఆసియా-పసిఫిక్ విభాగంలో ప్రపంచ సంగీతానికి 2005 బిబిసి రేడియో దార్వా 3 అవార్డులను అందుకుంది. ఆమె తన భర్త పార్థసారథి దేశికన్‌తో కలిసి ప్రదర్శనలు ఇచ్చింది.[2]

ప్రారంభ జీవితం

[మార్చు]
దస్త్రం:Agam-with-kaushiki-chakraborty-02.jpg
సంగీత పరికరంలతో కౌషిక్ చక్రబర్తి

కౌషిక్ చక్రబర్తి 1980 లో కోల్‌కతాలో జన్మించింది.ఆమె తల్లి చందన చక్రబర్తి, తండ్రి ప్రఖ్యాత భారతీయ శాస్త్రీయ గాయకుడు పండిట్ అజోయ్ చక్రబర్తి.రెండు సంవత్సరాల వయస్సు నుండే ఆమెకు సంగీతంపై ఆసక్తి ఉండేది.1980 ల చివరి నుండి సంగీత ప్రదర్శనల ప్రపంచ పర్యటనలలో ఆమె తన తండ్రితో కలిసి వెళ్లేది.ఆమె బహిరంగంగా "తారానా" అనే తన మొదటి పాటను 7 సంవత్సరాల వయస్సులో కలకత్తా రోయింగ్ క్లబ్‌లో పాడింది.[3] పదేళ్ళ వయసులో ఆమె తన తండ్రికి గురువు అయిన జ్ఞాన్ ప్రకాష్ ఘోష్ అకాడమీలో భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకోవడం ప్రారంభించింది. తరువాత ఐటిసి సంగీత రీసెర్చ్ అకాడమీలో చేరింది.అక్కడ నుండి ఆమె 2004 లో సంగీతంలో పట్టభద్రురాలైంది.

అకాడమీ డైరెక్టర్ విజయ్ కిచ్లు హిందూస్థానీ శాస్త్రీయ సంగీతం (ఖ్యాల్‌) అందించడంలో ఆమె నైపుణ్యాన్ని మెరుగుపరిచారు. కోల్‌కతాలోని శ్రుతినందన్ సంగీత పాఠశాలలో ఆమె తన తండ్రి కింద శిక్షణ పొందింది.ఆమె ఖ్యాల్స్, తుమ్రీలను (హిందూస్థానీ శాస్త్రీయ సంగీతాలు) అందించడంలో ప్రత్యేకత కలిగి ఉండటమే కాదు, 2002 నుండి విద్వాన్ మంగళంపల్లి బాలమురళికృష్ణ దగ్గర దక్షిణ భారత శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుంది.కోల్‌కతాలోని పాటా భవన్ పాఠశాలలో ఆమె పాఠశాల విద్యను పూర్తి చేసింది.2002 లో కలకత్తా విశ్వవిద్యాలయంలోని అనుబంధ అండర్ గ్రాడ్యుయేట్ జోగామాయ దేవి మహిళా కళాశాల[4] నుండి తత్వశాస్త్రంలో మొదటి తరగతి పట్టా పొందింది.తరువాత కోల్‌కతాలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి తత్వశాస్త్రంలో మాస్టర్స్ చేసింది.[5]

జీవిత గమనం

[మార్చు]

చక్రవర్తి అనేక ప్రధాన కచేరీలలో పాల్గొన్నది. ఆమె సంగీత ప్రదర్శనలలో ఎక్కువుగా హిందూస్థానీ శాస్త్రీయ సంగీతం అందించడమే కాకుండా, ఆమె అప్పుడప్పుడు సమకాలీనానికి సరిపోను భారతీయ పాప్ సంగీతం కూడా ప్రేక్షకులకు అందించేది. ఆమె 20 సంవత్సరాల వయస్సు నుండి డోవర్ లేన్ మ్యూజిక్ కాన్ఫరెన్స్‌లో 5 సంవత్సరాలు పాటు ప్రదర్శన ఇవ్వటం కొనసాగించింది. ఆమె ప్రదర్శనలు తరుచూ తాళబద్ధమైన శాస్రీయ సంగీతంతో (రిథమికల్ స్వింగ్) మూడున్నర అష్టపదిలో అనియంత్రిత టాన్స్ చేత విజయవంతమవుతాయి.[6] గాయకుడు కిషోరి అమోంకర్ 60 సంవత్సరాల కృషికి గుర్తింపుగా అతని గౌరవార్థం 2011 ఫిబ్రవరి 14 న పూణేలో రెండు రోజుల జరిగిన సంగీత వేడుకలకు కౌశికి జరిగిన సంగీతానికి 60 సంవత్సరాల కృషికి గుర్తింపుగా గౌరవార్థం రెండు రోజుల వేడుకలో, కౌశికి హిందూస్థానీ సంగీతం (రాగా తోడిని) అందించింది

చక్రవర్తి అనేక ప్రధాన కచేరీలలో పాల్గొన్నది. ఆమె సంగీత ప్రదర్శనలలో ఎక్కువుగా హిందూస్థానీ శాస్త్రీయ సంగీతం అందించడమే కాకుండా, ఆమె అప్పుడప్పుడు సమకాలీనానికి సరిపోను భారతీయ పాప్ సంగీతం కూడా ప్రేక్షకులకు అందించేది. ఆమె 20 సంవత్సరాల వయస్సు నుండి డోవర్ లేన్ మ్యూజిక్ కాన్ఫరెన్స్‌లో 5 సంవత్సరాలు పాటు ప్రదర్శన ఇవ్వటం కొనసాగించింది. ఆమె ప్రదర్శనలు తరుచూ తాళబద్ధమైన శాస్రీయ సంగీతంతో (రిథమికల్ స్వింగ్) మూడున్నర అష్టపదిలో అనియంత్రిత టాన్స్ చేత విజయవంతమవుతాయి.

గాయకుడు కిషోరి అమోంకర్ 60 సంవత్సరాల కృషికి గుర్తింపుగా అతని గౌరవార్థం 2011 ఫిబ్రవరి 14 న పూణేలో రెండు రోజుల జరిగిన సంగీత వేడుకలకు కౌశికి జరిగిన సంగీతానికి 60 సంవత్సరాల కృషికి గుర్తింపుగా గౌరవార్థం రెండు రోజుల వేడుకలో, కౌశికి చక్రబర్తి హిందూస్థానీ సంగీతం (రాగా తోడిని) అందించింది

తబలాపై భరత్ కామత్, హార్మోనియంలో సుయోగ్ కుండల్కర్, మరో ముగ్గురు కళాకారులు మద్దతునిచ్చారు.[7] 2011 సెప్టెంబరు 18 న ముంబై నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్‌సిపిఎ) నిర్వహించిన ప్రత్యేకమైన సంగీత కచేరీలలో ముగ్గురు గాయకులు కౌషికీ, ఉల్హాస్ కశల్కర్, దేవాకి పండిట్  వివిధ సమయాలలో వంతులు వారిగా సంగీతం సమర్పించారు.ఈ గానపద్దతి కార్యక్రమాలు సాధారణంగా సాయంత్రం మొదలై తెల్లవారుజామువరకు జరుగుతుంది. ప్రతి రాగానికి తగిన సమయ వ్యవధిలో రాగాలు పాడతారు.[8] తన కెరీర్ ప్రారంభ దశలో 2003 ఆగస్టులో  చక్రవర్తి లండన్లో ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చింది. ఇది ప్రసంశమైన ప్రదర్శనగా ప్రత్యేక గుర్తింపు వచ్చింది.ఈ సందర్భంగా కౌషికి చక్రబర్తి తండ్రి  ఆమె హార్మోనియంతో కలిసి పాల్గొన్నాడు. భారతదేశంలోని ఐటిసి సంగీత సమ్మేళన్,  స్ప్రింగ్ ఫెస్టివల్ ఆఫ్ మ్యూజిక్ (కాలిఫోర్నియా), సవాయి గాంధర్వ భీమ్ సేన్ సంగీత మహోత్సవ్, పరంపర ప్రోగ్రాం (లాస్ ఏంజిల్స్) లలో కూడా ఆమె ప్రదర్శన ఇచ్చింది.[9] ఆమె సంగీత ప్రదర్శనల కోసం "పాటియాలా సంప్రదాయానికి ఒక మార్గదర్శకురాలిగా ప్రశంసలు అందుకుంది.[10]

టాక్ షో

[మార్చు]
దస్త్రం:Kaushiki3.jpg
సంగీత పరికరంలతో కౌషిక్ చక్రబర్తి

కౌషిక్ చక్రబర్తి  రూపోషి వినోద అనే బెంగాలీ టి.వి.చానల్ లో ప్రతి వారం గాయకులతో  టాక్ షోను నిర్వహిస్తుంది. ఆదివారం ప్రసారమైన "గాన్-గోల్పో అర్ గాన్" (పాటలు, కథలు) అనే టాక్-షో సంగీతం, గాసిప్‌లను ప్రదర్శిస్తుంది. క్లాసికల్, రబీంద్ర సంగీత, నజ్రుల్గీతి, జానపద సంగీతం, తోప్పా, అధునిక్, బెంగాలీ బ్యాండ్స్, ఫిల్మ్ సాంగ్స్, రీమిక్స్ వంటి బెంగాలీ పాటలను ఆమె ప్రదర్శిస్తుంది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులుగా బనశ్రీ సేన్‌గుప్తా, సుభామిత, లోపాముద్ర మిత్రా, సంగీత దర్శకుడు జాయ్ సర్కార్, ఆమె తండ్రి అజోయ్ చక్రవర్తి ఆమె అతిథులుగా ఉన్నారు.

సంగీత సమూహం ఏర్పాటు

[మార్చు]

భారతదేశపు ప్రసిద్ధ పౌరాణిక, చారిత్రక మహిళలు - గంగా, సరస్వతి, దుర్గా, లక్ష్మి, ద్రౌపది, కుంతి, సీత, రాధ, మీరా అటువంటివారిపై అంకితభావంతో చక్రవర్తి ప్రత్యేకంగా దేశంలో శాస్త్రీయ సంగీతంలో ముందున్న "మహిళలను గుర్తించి, వారిచే సంగీత కచేరీలు జరిపేందుకు  "సఖి" (అంటే స్నేహితుడు) అనే ప్రత్యేకమైన మహిళా సంగీత బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం యొక్క మొదటి కార్యక్రమం 2015 జనవరి 20 జనవరి 20 న ముంబైలోని కళామందిర్‌లో నిర్వహించాలని ప్రణాళిక వేసింది.కౌశిక్, ఈ బృందంలోని ఇతర సభ్యులు తబలాపై షావోని తల్వాల్కర్, పఖ్వాజ్ పై మహిమా ఉపాధ్యాయ, వేణువుపై డెబోప్రియా ఛటర్జీ, వయోలిన్ మీద నందిని శంకర్, కథక్ నృత్య ప్రదర్శన భక్తి దేశ్‌పాండే చేయవలసి ఉంది. వీరిలో ప్రసిద్ధ హిందూస్థానీ సంగీతకారుల కుమార్తెలు, గ్రాండ్ కుమార్తెలు, శిష్యులు ఉన్నారు.[11] 2015 అక్టోబరులో కార్నెగీ హాల్‌లో చక్రవర్తి ఈ సంగీత బృందం, తన బృందంతో కలసి 90 నిమిషాల వ్యవధి కార్యక్రమం సమర్పించారు.

అవార్డులు

[మార్చు]

చక్రవర్తి 25 సంవత్సరాల పిన్న వయసులో ఆమెలోని సంగీత ప్రతిభకు అనేక అవార్డులను అందుకుంది.ఆమె 1995 లో జాదు భట్టా అవార్డును అందుకుంది. 1998 లో న్యూ డిల్లీలోని 27 వ వార్షిక ఐటిసి సంగీత సమ్మేళనంలో ఆమె ప్రారంభ పాట ప్రశంసలందుకుంది.2000 సంవత్సరంలో అత్యుత్తమ యువతి అవార్డు పొందింది. ఆమె అత్యుత్తమ సాధనకు బిబిసి వారి నుండి 2005 లో అవార్డు అందుకుంది.ఈ పురస్కారాన్ని అందుకున్న ఆమె "భారతీయ స్వర సంగీతంలో ప్రకాశవంతమైన వర్ధమాన కళాకారులలో ఒకరు" అని  విమర్శకుడు కెన్ హంట్ అని ప్రశంసించాడు.[5] బిబిసి ఆమె సంగీత ప్రయాణాన్ని కలిగి ఉన్న ఒక షార్ట్ ఫిల్మ్‌ను కూడా చేసింది. ఇది ఆమె సంగీతంతో ముడిపడి ఉన్న వ్యక్తులను, ప్రదేశాలను కవర్ చేసింది. ఆమె హిందూస్థానీ స్వర సంగీతం నాటక అకాడమీ వారిచే 2010 లో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పురస్కారం, 2013 ఆదిత్య బిర్లా కలకిరన్ పురస్కారం అందుకుంది. ఆమె ఎబిపి ఆనంద చేత "షెరా బంగాలి సమ్మన్ 2017" పురస్కారం అందుకుంది. 2019లో భారత ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా నారీశక్తి పురస్కారం అందుకుంది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

చక్రవర్తి 2004 లో హిందూస్థానీ సంగీతంలో ప్రొఫెషనల్ సింగర్ పార్థసారథి దేశికన్‌ను వివాహం చేసుకుంది.వారికి రిషిత్ అనే కుమారుడు ఉన్నాడు.[10]

సంగీత జీవనంలో ప్రదర్శనలు, ఘట్టాలు

[మార్చు]

కౌషిక్ చక్రవర్తి తన సంగీత అడుగు జాడల్లో 1998 లో సోలో అరంగేట్రం, 2002లో "ఎ జర్నీ బిగిన్స్" ప్రదర్శనలు ఉన్నాయి. 2004 లో ఆమె సంగీత ఆల్బమ్ "ప్యూర్" విడుదల చేసింది. 2003 ఆగస్టు 30 న లండన్లో  చేసిన ఆమె ప్రదర్శన రికార్డులకెక్కింది. ఆమె ఎం.టి.వి. కోక్ స్టూడియో - సీజన్ 2లో   శాంతను మొయిత్రా & స్వానంద్ కిర్కిరేతో కలిసి లాగి లాగిలో కీర్తన పాడింది.[9] 2014 లో వాటర్, తిరుమనం ఎనుమ్ నిక్కా, 2013 లో కుట్టి పులి సినిమాలకు ఆమె పాడిన పాటలు ప్రసిద్ద రికార్డు పొందాయి.[1] తన చిత్రాలలో నటించడానికి చక్రవర్తికి అనుమతి ఇవ్వమని రితుపర్నో ఘోష్ తన తండ్రిని కోరినప్పటికీ, అది ఆమె సంగీత వృత్తికి ఆటంకం కలిగిస్తుందని నిరాకరించాడు. ఏదేమైనా, చిత్రంగడ చిత్రంలో ఆమె ఒక పాట సన్నివేశంలో మాత్రం కనిపించింది. ఆమె చాప్లిన్ చిత్రానికి మొదటి పాట, టీన్ కన్యా, పాంచ్ అధ్యాయ్, గులాబ్ గ్యాంగ్ కోసం హిందీ పాట రహూన్ తేరే పీచే వంటి సినిమాల పాటల కోసం పాటలు పాడింది. ఆమె ప్రదర్శనల గురించి ఆమె ఇలా "అయితే నేను 60 ఏళ్ళ వయసులో నటించటానికి ప్రయత్నించే అటువంటి దాన్ని కాను.. అతిశయోక్తి తీవ్రత కేవలం నటించటానికి మాత్రమే ఉపయోగపడుతుంది. నేను అలా కాదు.నాకళ్లు మూసుకుపోయేంతవరకు నేను వేదికపై కూర్చుని, నాతో ప్రేక్షకులు మాట్లాడటమే నాకు ఇష్టం. దానిని నేను దూరం చేసుకోను అని" చెబుతోంది.[12]

రికార్డింగ్స్

[మార్చు]

చక్రవర్తి తన ఆడియో సిడి ఆల్బమ్‌ను "ది బెస్ట్ ఆఫ్ కౌశికి చక్రవర్తి" పేరుతో విడుదల చేసింది.[13] ఆమె ఇతర ముఖ్యమైన క్లాసికల్ ఆడియో రికార్డింగ్‌లు: పూర్వి రాగంలో ధ్రుపద్ ఆలాప్, ధ్రుపద్, బాగేశ్రీ రాగంలో ఖాయల్ (టీన్ తాల్‌లో), బాగేశ్రీ రాగాలో ఖయాల్ (ఏక్తాల్‌లో), స్వరాష్ట్ర రాగంలో వర్ణం మొదలగునవి ఉన్నాయి.[14]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Kaushiki Chakraborty". IMDb. Retrieved 2020-04-26.
  2. http://www.atlantadunia.com/dunia/News/N223.htm
  3. "Kaushiki's dual role". www.telegraphindia.com (in ఇంగ్లీష్). Retrieved 2020-04-25.
  4. "History of the College - Jogamaya Devi College, Kolkata, INDIA". jogamayadevicollege.org. Archived from the original on 2011-07-26. Retrieved 2020-04-25.
  5. 5.0 5.1 "Tehelka - India's Independent Weekly News Magazine". web.archive.org. 2016-02-16. Archived from the original on 2016-02-16. Retrieved 2020-04-25.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. "Tehelka - India's Independent Weekly News Magazine". web.archive.org. 2016-02-16. Archived from the original on 2016-02-16. Retrieved 2020-04-26.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. tps://www.dnaindia.com/lifestyle/report-the-blend-of-three-gharanas-a-musical-experience-beyond-words-1507614
  8. "An experience of Dawn to Dusk raags - Indian Express". archive.indianexpress.com. Retrieved 2020-04-26.
  9. 9.0 9.1 Dec 6, Barkha Mathur |; 2015; Ist, 03:06. "Classical vocalist Kaushiki Chakraborty to perform in city today | Nagpur News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-04-26. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  10. 10.0 10.1 "Are Kaushiki and Parthasarathi back together? - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-04-26.
  11. "Kaushiki Chakraborty forms first all women's classical band, Sakhi - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-04-26.
  12. "Kaushiki's dual role". www.telegraphindia.com (in ఇంగ్లీష్). Retrieved 2020-04-26.
  13. https://www.amazon.in/The-Best-Kaushiki-Chakraborty-Chakraborty/dp/B00AO6CW3S
  14. "iMusti: Collection of Digital Indian Music, Books and Video". web.archive.org. 2014-06-25. Archived from the original on 2014-06-25. Retrieved 2020-04-26.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటి లంకెలు

[మార్చు]