క్యాపిటల్ అకౌంట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్థూల ఆర్థిక శాస్త్రం మరియు ఇంటర్నేషనల్ ఫైనాన్స్ లో క్యాపిటల్ అకౌంట్ లేదా ఫైనాన్షియల్ అకౌంట్ అనేది బాలన్స్ ఆఫ్ పేమెంట్స్ మరియు కరెంట్ అకౌంట్ అనే రెండు ప్రధాన అంశాలలో ఒకటిగా ఉంది. కరెంట్ అకౌంట్ అనేది ఒక దేశం యొక్క నికర ఆదాయాన్ని సూచించేది కాగా క్యాపిటల్ అకౌంట్ అనేది దేశం యొక్క జాతీయ ఆస్తులలో నికర మార్పును సూచిస్తుంది.

అంతర్జాతీయ ద్రవ్య నిధి మరియు అనుబంధ సంస్థలలో క్యాపిటల్ అకౌంట్ అనే పదాన్ని చాలా పరిమితమైన అర్ధంలో వాడడం జరుగుతుంది. మిగిలిన ప్రపంచానికి భిన్నంగా IMF క్యాపిటల్ అకౌంట్ ను రెండు ప్రధాన భాగాలుగా విభజించింది: ఫైనాన్షియల్ అకౌంట్ మరియు క్యాపిటల్ అకౌంట్, ఇందులో ఫైనాన్షియల్ అకౌంట్ లోనే తన ప్రధాన లావాదేవీలన్నింటిని నమోదు చేయడం జరుగుతుంది.

స్థూల ఆర్ధిక శాస్త్రంలో క్యాపిటల్ అకౌంట్[మార్చు]

పై స్థాయిలో:

క్రింది స్థాయిలో చూస్తే:

హాంగ్ కాంగ్ లోని ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సెంటర్.ఒక దేశానికీ, మిగిలిన ప్రపంచానికి మధ్య ఆర్థిక ఆస్తుల యాజమాన్యంలో వచ్చే మార్పులు ఆ దేశం యొక్క క్యాపిటల్ అకౌంట్ లో నమోదు చేయబడతాయి.
 • విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనే పదం యంత్రాలు, భవంతులు మరియు కర్మాగారాలు వంటి వాటిలో దీర్ఘకాలిక మూలధన పెట్టుబడులను సూచిస్తుంది. ఒక దేశంలో విదేశీయులు కనుక పెట్టుబడులు పెడుతున్నట్లయితే అది రాబడిగా పరిగణించబడి క్యాపిటల్ అకౌంట్ లో మిగులు అంశంగా చూపించబడుతుంది. ఒక దేశ పౌరులు వేరే దేశంలో పెట్టుబడులు పెడుతున్నట్లయితే అది బయటకు పోయే నిధిగా పరిగణించబడి క్యాపిటల్ అకౌంట్ లో లోటుగా చూపించబడుతుంది. తొలి పెట్టుబడి తరువాత, తిరిగి పెట్టుబడిగా మారని మొదటగా వచ్చే లాభాలు వ్యతిరేక దిశలో చూపించబడి క్యాపిటల్ అకౌంట్ లో కాక కరెంట్ అకౌంట్ లో నమోదు చేయబడతాయి.[1]
 • పోర్ట్ ఫోలియో పెట్టుబడి అనేది షేర్లు మరియు బాండ్ ల యొక్క కొనుగోలును సూచిస్తుంది. ఇది కొన్ని సందర్భాలలో ఇతర పెట్టుబడులతో కలిపి స్వల్పకాలిక పెట్టుబడిగా పరిగణించబడుతుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో పాటు ఈ ఆస్తుల నుండి లభించే ఆదాయాలు కరెంట్ అకౌంట్ లో నమోదు చేయబడతాయి. అంతర్జాతీయ స్థాయి పోర్ట్ ఫోలియో ఆస్తుల అమ్మకాలు మరియు కొనుగోళ్ళు మాత్రమే క్యాపిటల్ అకౌంట్ లో నమోదు చేయబడతాయి.[1]
 • ఇతర పెట్టుబడులు బాంక్ అకౌంట్ ల లోకి జమ అయ్యే లేదా రుణాల రూపంలో ఇవ్వబడే నిధులు కలిగి ఉంటాయి. వడ్డీ రేట్లలో మరియు/లేదా కరెన్సీ మారకపు రేట్లలో వచ్చే హెచ్చుతగ్గులకు అనుగుణంగా మార్కెట్ ఈ విధంగా మారగలదు అనేదాని ఆధారంగానే వివిధ దేశాల మధ్య దీర్ఘ కాలిక మరియు స్వల్ప కాలిక నిధుల ప్రవాహం ఉంటుంది. కొన్ని సార్లు రిజర్వ్ అకౌంట్ కూడా ఈ వర్గం కిందకే వస్తుంది.[1]
 • రిజర్వ్ అకౌంట్ . రిజర్వ్ అకౌంట్ అనేది ఒక దేశం యొక్క కేంద్రీయ బాంక్ చే ఆపరేట్ చేయబడుతుంది. ఇది మార్కెట్ లో సంభవించే ఒడిదుడుకులను ఎదుర్కునేందుకు అవసరమైన భారీ మూలధన నిధులను కలిగి ఉంటుంది. రాబడిగా వచ్చే మూలధన నిధులు కరెంట్ అకౌంట్ మిగులు నిధులతో కలిసి ఒక దేశం యొక్క కరెన్సీ విలువను హెచ్చిస్తుండగా (అప్రీసియేషన్) బయటకు పోయే నిధులను కరెన్సీ విలువలో తరుగుదలను (డిప్రీసిఏషన్) తీసుకువస్తాయి.[2] మార్కెట్ కనుగుణంగా కరెన్సీ విలువలో ప్రభుత్వం మార్పులు చేయకపోయినట్లయితే దేశ ప్రయోజనాల దృష్ట్యా బాంక్ జోక్యం చేసుకోవచ్చు.[2]

కేంద్రీయ బ్యాంకు యొక్క విధి విధానాలు మరియు రిజర్వ్ అకౌంట్[మార్చు]

రెండు ప్రధాన పనిముట్లను వినియోగించి కేంద్రీయ బాంక్ లు ఆయా దేశాల కరెన్సీల విలువలో మార్పులు తీసుకువస్తాయి: ఒకటి వడ్డీ రేట్లను పెంచడం లేదా తగ్గించడం కాగా, వారి కరెన్సీ కొనడం లేదా అమ్మడం మరొకటి. ఇతర ప్రధాన కేంద్ర బాంక్ ల కన్నా వడ్డీ రేటు అధికంగా నిర్ణయించడం వల్ల దేశం యొక్క క్యాపిటల్ అకౌంట్ ద్వారా దేశం లోపలికి నిధులు ఆకర్షించబడి ఆ దేశం యొక్క కరెన్సీ విలువ పెరుగుతుంది. వడ్డీ రేట్లను తక్కువ చేయడం వల్ల దీనికి వ్యతిరేక ప్రభావం కలుగుతుంది. WWII నుండి దేశీయ ఆర్థిక వ్యవస్థ యొక్క అవసరాలను దృష్టిలో ఉంచుకునే వడ్డీ రేట్లను నిర్ణయించడం జరుగుతుంది. ఇంతేకాక కేవలం వడ్డీ రేట్లలో మార్పు పరిమితమైన ప్రభావాన్ని మాత్రమే చూపించడం జరుగుతుంది.[3]

ఒక దేశం తన కరెన్సీ విలువ పడిపోకుండా చూసుకోవడం అనేది ఆ దేశం యొక్క విదేశీ మారకపు నిధుల నిల్వలపైనే ఆధారపడి ఉంటుంది. ఈ నిల్వలను ఉపయోగించి తన కరెన్సీని తిరిగి కొనుక్కోవచ్చు.[4] దీనికి వ్యతిరేకంగా, ఒక దేశం తన కరెన్సీ విలువ పెంచుకోవడాన్ని నియంత్రించే పరిమితులు పెద్దగా లేవు- ఒక దేశం తన కరెన్సీ అమ్మేసుకోవచ్చు లేదా మరింత కరెన్సీ ముద్రించుకోవచ్చు. అయితే ఇతర నియంత్రణ మార్గాలు కూడా అనుసరించనట్లయితే ఇది ద్రవ్యోల్బణానికి దారితీసి ఆ దేశం పై ఇతర దేశాల నుండి రాజకీయ ఒత్తిడి పెరగవచ్చు.

20వ శతాబ్దంలో గ్రేట్ బ్రిటన్ కేంద్ర బాంక్ అయిన బాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ను ఉదాహరణగా తీసుకుంటే ఆ బాంక్ తమ దేశం యొక్క కరెన్సీ విలువ పడిపోకుండా ఉండేందుకు తన రిజర్వ్ నిధులను ఉపయోగించి పెద్ద మొత్తంలో పౌండ్ స్టెర్లింగ్ లను కొంటూ ఉండేది. ఈ క్రమంలో బ్లాక్ వెడ్నెస్డే అని పిలువబడే ఒక సందర్భంలో ఈ పనిని చేసేందుకు తగిన విదేశీ నిల్వలు ఆ బ్యాంకు దగ్గర లేకుండా పోయాయి. దీనికి భిన్నంగా 21వ శతాబ్దపు ప్రారంభంలో చైనా తన కరెన్సీ విలువ పెరగడాన్ని నియంత్రించేందుకు పెద్ద మొత్తాలలో తన కరెన్సీ అయిన రేమింబీని అమ్మడం జరిగింది. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో విదేశీ నిధులను ముఖ్యంగా డాలర్లను చైనా సమకూర్చుకోవడం జరిగింది.[5]

కొన్ని సందర్భాలలో రిజర్వ్ అకౌంట్ను క్యాపిటల్ అకౌంట్లో భాగంగా కాక క్రింద విడిగా చూపించడం జరుగుతుంది.[2] రిజర్వ్ అకౌంట్ లోకి జమ అయ్యే లేదా బయటకు పోయే నిధులు మొత్తం క్యాపిటల్ అకౌంట్ మీద ప్రభావం చూపుతాయి. అప్పటి కేంద్ర బాంక్ కార్యకలాపాలను పక్కన పెట్టి మళ్లీ 21వ శతాబ్దపు తొలినాళ్ళలో చైనా ఉదాహరణను తీసుకుంటే పెద్ద మొత్తంలో విదేశి పెట్టుబడులు లభించడం వల్ల చైనా క్యాపిటల్ అకౌంట్ ఎప్పుడు మిగులు నిధులను చూపిస్తూ ఉండేది. అయితే రిజర్వ్ అకౌంట్ ను కలుపుకుంటే చైనా యొక్క క్యాపిటల్ అకౌంట్ భారీ లోటును సూచిస్తూ ఉండేది. మిగిలిన క్యాపిటల్ అకౌంట్ను భర్తీ చేయడమే కాక కరెంట్ అకౌంట్లో ఉన్న భారీ మిగులును కూడా సరిచేసుకునేందుకు ఆ దేశం యొక్క కేంద్ర బ్యాంకు పెద్ద మొత్తాలలో విదేశీ ఆస్తులను కొనడమే (ముఖ్యంగా US ప్రభుత్వ బాండ్ లు) ఇందుకు కారణం.[5]

స్టెరిలైజేషణ్[మార్చు]

రాబడిగా వచ్చే మూలధనం వల్ల కలిగే వ్యతిరేక ప్రభావాలను (కరెన్సీ విలువలో పెరుగుదల మరియు ద్రవ్యోల్బణం) తగ్గించేందుకు కేంద్ర బ్యాంకు చేసే ప్రయత్నాన్నే ఆర్థిక పరిభాషలో స్టేరిలైజేషణ్ అంటారు. స్టేరిలైజేషణ్ అంటే రాబడిగా వచ్చే మూలధనం వల్ల కరెన్సీ విలువ పెరగకుండా నేరుగా చేసే రీసైకిలింగ్ కావొచ్చు లేదా ఆ మూలధనం వల్ల సంభవించే అవకాశం ఉన్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే ప్రక్రియలు కావొచ్చు. క్యాపిటల్ అకౌంట్ నుండి దేశీయ మార్కెట్ లోకి విడుదలయ్యే అధిక డబ్బు యొక్క ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించేందుకు కేంద్ర బ్యాంకు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ ద్వారా దేశీయంగా బాండ్ లను అమ్మడం ఒక ప్రధాన స్టేరిలైజేషణ్ ప్రక్రియ. దీని వలన దేశీయ ఆర్థిక వ్యవస్థలోకి మరింత డబ్బు చెలామణి కాకుండా అరికట్టబడుతుంది. కొన్ని సందర్భాలలో ఇంకా అనేక చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది.[6] స్టేరిలైజేషణ్ ప్రక్రియల వలన సాధారణంగా కేంద్ర బ్యాంకులకు కొద్ది పాటి నష్టాలు సంభవించడం జరుగుతుంది. కరెన్సీ విలువ పెరుగుదలను నియంత్రించేందుకు చేసే విదేశీ ఆస్తుల కొనుగోలు పై లభించే వడ్డీ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు దేశీయంగా అమ్మకం చేసే బాండ్ లపై అది చెల్లించాల్సిన వడ్డీ కన్నా తక్కువగా ఉండడం ఇందుకు కారణం. అయితే చాలా అరుదైన సందర్భాలలో కొద్దిపాటి లాభాలను ఆర్జించడం కూడా జరుగుతుంది.[7]

IMF యొక్క నిర్వచనము[మార్చు]

ఆర్ధిక పరిభాషలో, పత్రికలలో, ప్రభుత్వ మరియు కార్పోరేట్ విశ్లేషకులు (వారు IMFకు నివేదిస్తున్న సందర్భాలలో తప్ప) మరియు ప్రపంచ బ్యాంకు అందరు కూడా సాధారణంగా పై నిర్వచనాన్నే వాడడం జరుగుతుంది. మిగిలిన వారు దేనిని అయితే క్యాపిటల్ అకౌంట్ అంటారో IMF, OECD మరియు యునైటెడ్ నేషన్ యొక్క SNAలు మాత్రం దానినే ఫైనాన్సియల్ అకౌంట్ అని వ్యవహరించడం జరుగుతుంది. IMF నిర్వచనం ప్రకారం క్యాపిటల్ అకౌంట్ అనేది సాధారణంగా క్యాపిటల్ అకౌంట్ అని పిలువబడే దానిలో ఒక చిన్న భాగంగా మాత్రమే ఉండి ప్రధానంగా ట్రాన్సఫర్ లను సూచిస్తుంది.[8] [9][10] వస్తు మార్పిడి మరియు అమ్మకాలు/కొనుగోళ్ళు వంటి వాణిజ్య లావాదేవీలకు భిన్నంగా ట్రాన్సఫర్ లు అనేవి బహుమతుల వంటి వన్ వే ద్రవ్య చెలామణిని సూచిస్తాయి. ఫారెన్ ఎయిడ్ అనేది దేశాల మధ్య జరిగే అతి పెద్ద ట్రాన్సఫర్ అయినప్పటికీ అది సాధారణంగా కరెంట్ అకౌంట్లో నమోదు చేయబడుతుంది. డెట్ ఫర్గివ్నేస్ అనేది ఇందుకు మినహాయింపు. ఎందుకంటె ఇది ఒక ఆస్తి పై యాజమాన్యాన్ని ట్రాన్సఫర్ చేయడం వంటిది. ఒక దేశం పెద్ద మొత్తంలో డెట్ ఫర్గివ్నేస్ పొందినప్పుడు అది ఆ సంవత్సరం మొత్తం IMF క్యాపిటల్ అకౌంట్ లో ప్రధాన భాగంగా మారుతుంది.

భూమి వంటి సహజ వనరులు, లీజ్ లు మరియు లైసెన్స్ లు మరియు బాండ్ ల వంటి మార్కెటింగ్ అసెట్ లు వంటి ఆర్థికేతర, ఉత్పత్తేతర ఆస్తుల అమ్మకం ద్వారా జరిగే నాన్ ట్రాన్సఫర్ ఫ్లో అనేది IMF క్యాపిటల్ అకౌంట్లో భాగం. అయితే ఈ లావాదేవీలు ప్రధానంగా ఒకే దేశీయుల మధ్య జరుగుతాయి కాబట్టి ఇందులో చెలామణి అయ్యే డబ్బు పెద్ద మొత్తంలో ఉండదు.

డెట్ ఫర్గివ్నేస్ తో పాటు దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళే లేదా దేశంలోకి వచ్చే వలసదారుల వస్తువులు లేదా ఆర్థిక ఆస్తుల ట్రాన్సఫర్ లు, స్థిర ఆస్తుల యాజమాన్యం యొక్క ట్రాన్సఫర్ లు, స్థిర ఆస్తుల అమ్మకానికి తీసుకునే నిధుల ట్రాన్సఫర్ లు, బహుమతులు మైర్యు వారసత్వ పన్నులు, డెత్ లెవిలు మరియు బీమాలేని స్థిర ఆస్తులకు జరిగే నష్టం అన్నీ IMF యొక్క క్యాపిటల్ అకౌంట్ పరిధిలోకి వస్తాయి.[9][10] IMF కాకుండా వేరే చోట ఈ అంశాలన్నీ క్యాపిటల్ అకౌంట్ లోని ఇతర సబ్ టోటల్ యొక్క పరిధిలోకి వస్తాయి. రుణాలు మరియు స్వల్పకాలిక బ్యాంకు అకౌంట్లలోకి వచ్చి పోయే డబ్బుతో పోలిస్తే ఇవి చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి.

క్యాపిటల్ నియంత్రణ[మార్చు]

క్యాపిటల్ నియంత్రణ అనేది ఒక దేశ ప్రభుత్వం యొక్క క్యాపిటల్ అకౌంట్ లావాదేవిల నిర్వహణ విధానంగా పరిగణిస్తారు. కొన్ని లేదా అన్ని క్యాపిటల్ అకౌంట్ లావాదేవిల పై నిషేధము, ప్రత్యేకమైన ఆర్థిక ఆస్తుల అంతర్జాతీయ విక్రయాల పై లావాదేవి పన్నులు, కొన్ని ప్రత్యేకమైన ఆర్థిక ఆస్తుల అంతర్జాతీయ క్రయవిక్రయాల పై పరిమితులు వంటివి ఇందులో భాగం. ఆర్థిక రంగానికి సంబంధించినవైనప్పటికీ ఈ పరిమితులు సాధారణ పౌరుల పై కూడా ప్రభావం చూపవచ్చు. ఉదాహరణకు 1960లలో సెలవల్లో విదేశాల పర్యటనలకు వెళ్ళే బ్రిటిష్ కుటుంబాలు తమతో 50 పౌండ్ ల కంటే ఎక్కువ మొత్తం దేశం బయటకు తీసుకుపోరాదనే నిబంధనను విధించడం జరిగింది.[5] మార్కెట్ రేట్ వద్ద తన కరెన్సీ క్రయవిక్రయాలు జరపడం పై పరిమితులు విధించే క్యాపిటల్ నియంత్రణ లేని దేశాలు పూర్తి క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబులిటీ ఉన్న దేశాలుగా పరిగణించబడతాయి.

రెండవ ప్రపంచ యుద్ధ చివరిలో చేయబడిన బ్రెట్టన్ వుడ్స్ ఒప్పందాన్ని అనుసరించి అనేక దేశాలు వారి క్యాపిటల్ అకౌంట్లోకి భారీ మొత్తంలో వచ్చే పోయే డబ్బును నియంత్రించేందుకు క్యాపిటల్ కంట్రోల్ పద్ధతిని ప్రవేశ పెట్టడం జరిగింది. బ్రెట్టన్ వుడ్ ఒప్పంద రూపకర్తలలో ఒకరైన జాన్ మేనార్డ్ కీన్స్ అభిప్రాయంలో క్యాపిటల్ నియంత్రణలు అనేవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక శాశ్వత భాగం.[11] అభివృద్ధి చెందిన మరియు చెందుతున్న దేశాలన్నీ కూడా క్యాపిటల్ నియంత్రణలను ప్రవేశపెట్టాయి. సిద్ధాంత ప్రాతిపదికన చూస్తే భారీ పెట్టుబడి రాబడులు అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. కానీ వాస్తవంగా ఇలా జరగడం లేదు. నిజానికి ఈ భారీ పెట్టుబడులు కరెన్సీ విలువను పెంచడం ద్వారా, ద్రవ్యోల్బణాన్ని పెంచడం ద్వారా దేశ ఆర్థికాభివృద్ధిని దెబ్బ తీయడమే కాక ఆర్థిక వ్యవస్థను గాలి బుడగలాగా పెంచి ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తాయి. ఒకసారి సంక్షోభం సంభవించాక ఇంకా రాబడులు వచ్చినట్లయితే అవి పెరుగుతున్నఆర్ధిక వ్యవస్థ పతనానికి దారి తీస్తాయి.[10][12][13] ఉదారవాద మార్కెట్ విధానాలకు అనుకూలంగా కీన్సిజంలో మార్పులలో భాగంగా అనేక దేశాలు తమ క్యాపిటల్ నియంత్రణలను రద్దు చేయడం ప్రారంభించాయి. 1973 -74లో US, కెనడా, జర్మనీ మరియు స్విట్జార్లాండ్ లు ప్రారంభించిన ఈ ప్రక్రియను 1979లో గ్రేట్ బ్రిటన్ కొనసాగించడం జరిగింది.[14] మిగిలిన అనేక ఇతర దేశాలు ప్రధానంగా 1980 మరియు 1990 తొలినాళ్ళలో ఈ ప్రక్రియను ప్రారంభించడం జరిగింది.[12]

అయితే 1997 ఆసియా ఆర్థిక సంక్షోభ నేపథ్యంలో 1998లో క్యాపిటల్ నియంత్రణలను విధించిన మలేషియా మాత్రం ఇందుకు మినహాయింపు.[15] అనేక ఆసియా దేశాలు కంట్రోల్ లను విధించనప్పటికీ 1997 సంక్షోభం తరువాత మాత్రం అవి క్యాపిటల్ ను దిగుమతి చేసుకోవడం ఆపి ఎగుమతి చేయడం ప్రారంభించాయి.[5] అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి US మరియు ఇతర అభివృద్ధి చెందిన దేశాలకు భారీ మొత్తాలలో నిధులు ఎగుమతి కాబడ్డాయి.[5][13] సి.ఫ్రెడ్ బెర్గ్స్తేన్ అనే ఆర్థిక శాస్త్రవేత్త అభిప్రాయం ప్రకారం US కు భారీ మొత్తాలలో వచ్చిన ఈ క్యాపిటల్ రాబడులే 2007-2008 ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యాయి.[16] 2009 ద్వితీయార్ధంలో తక్కువ వడ్డీ రేట్లు మరియు సంక్షోభానికి ప్రభుత్వం యొక్క స్పందనల ఫలితంగా అనేక అభివృద్ధి చెందిన దేశాల పెట్టుబడులు వెనక్కు మళ్లడం ప్రారంభమయింది.[17] 2009 నవంబరులో బ్రెజిల్ మరియు భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ దేశ ఆర్థిక వ్యవస్థలోకి విదేశీ పెట్టుబడులు ప్రవేశించకుండా వీలనైంతగా క్యాపిటల్ నియంత్రణలను విధించాయని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది.[15]

వీటిని కూడా చూడండి[మార్చు]

 • మిగిలిన చెల్లింపులు
 • నికర మూలధన చెల్లింపులు
 • మూలధన వస్తువులు

గమనికలు మరియు సూచనలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 Sloman, John (2004). Economics. Penguin. pp. 556–558.
 2. 2.0 2.1 2.2 Orlin, Crabbe (1996). International Financial Markets (3rd సంపాదకులు.). pp. 430–442. ISBN 0132069881. Text " publisher Prentice Hall" ignored (help)
 3. Wilmott, Paul (2007). "1". Paul Wilmott Introduces Quantitative Finance. Wiley. ISBN 0470319585.
 4. సప్ప్లై మరియు డిమాండ్ సూత్రం ప్రకారం భారీ మొత్తాలలో కరెన్సీ కొనుగోలు ద్వారా కరెన్సీ సప్ప్లై ను తగ్గించడం అనేది దాని విలువ పెరిగేలా చేస్తుంది.
 5. 5.0 5.1 5.2 5.3 5.4 Wolf, Martin (2009). "passim, esp chp 3". Fixing Global Finance. Text " publisher Yale University Press" ignored (help)
 6. Sweta C. Saxena and Kar-yiu Wong (1999-01-02). "Currency Crises and Capital Controls: A Selective Survey" (PDF). University of Washington. Retrieved 2009-12-16. Cite web requires |website= (help)
 7. J. Onno de Beaufort Wijnholds and Lars Søndergaard (2007-09-16). "RESERVE ACCUMULATION - Objective or by-product?" (PDF). ECB. Retrieved 2009-12-16. Cite web requires |website= (help)
 8. Colin Danby. "Balance of Payments: Categories and Definitions". University of Washington. Retrieved 2009-12-11. Cite web requires |website= (help)
 9. 9.0 9.1 "Balance of Payments and International investment position manual" (PDF). IMF. 2008-12-12. Retrieved 2009-12-11. Unknown parameter |chapters= ignored (help); Cite web requires |website= (help)
 10. 10.0 10.1 10.2 Heakal, Reem. "Understanding Capital And Financial Accounts In The Balance Of Payments". Investopedia. Retrieved 2009-12-11. Cite web requires |website= (help)
 11. Dani Rodrik (2010-05-11). "Greek Lessons for the World Economy". Project Syndicate. Retrieved 2010-05-19. Cite web requires |website= (help)
 12. 12.0 12.1 Ravenhill, John (2005). Global Political Economy. p. 185, 198. Text " publisher Oxford University Press" ignored (help)
 13. 13.0 13.1 Eswar S. Prasad , Raghuram G. Rajan , and Arvind Subramanian (2007-04-16). "Foreign Capital and Economic Growth" (PDF). Peterson Institute. Retrieved 2009-12-15. Cite web requires |website= (help)CS1 maint: multiple names: authors list (link)
 14. Roberts, Richard (1999). Inside International Finance. Orion. p. 25. ISBN 0752820702.
 15. 15.0 15.1 A Beattie, K Brown, P Garnham, J Wheatley, S Jung-a & J Lau (2009-11-19). "Worried nations try to cool hot money". The Financial Times. Retrieved 2009-12-15. Cite web requires |website= (help)CS1 maint: multiple names: authors list (link)
 16. C. Fred Bergsten (Nov 2009). "The Dollar and the Deficits". Foreign Affairs. Retrieved 2009-12-15. Cite web requires |website= (help)
 17. Arvind Subramanian (2009-11-18). "Time For Coordinated Capital Account Controls?". The Baseline Scenario. Retrieved 2009-12-15. Cite web requires |website= (help)