క్రమం (జీవశాస్త్రం)

క్రమం (ఆర్డర్-Order) జీవుల శాస్త్రీయ వర్గీకరణలో నాల్గవ స్థానం, ఈ వర్గీకరణలో విభాగం లేదా తరగతి (క్లాస్-Class), కుటుంబం (ఫ్యామిలీ -Family) అను స్థానాల మధ్య క్రమము వస్తుంది. ఒక క్రమములో కొన్ని కుటుంబాలు కలిపి ఉంటాయి.
కార్ల్ లిన్నెయస్ జీవశాస్త్రంలో జీవులకు ర్యాంక్-ఆధారిత నామకరణ వ్యవస్థను 1735లో ప్రవేశపెట్టాడు. అత్యున్నత ర్యాంకుకు "రాజ్యం" (కింగ్డమ్) అనే పేరు పెట్టాడు. దాని తర్వాత 4 ర్యాంకులు వరుసగా - తరగతి (క్లాస్), క్రమం (ఆర్డర్), జాతి (జీనస్), జాతులు (స్పీసీస్)[1]. తరువాత ఏర్పడ్డ మరో రెండు ప్రధాన ర్యాంకులతో వరుసగా కింగ్‌డమ్, ఫైలం లేదా డివిజన్, తరగతి లేదా విభాగం, క్రమం, కుటుంబం, ప్రజాతి, జాతులు ఏర్పడ్డాయి. 1990లో, (కింగ్డమ్) పైన డొమైన్ ర్యాంక్ ప్రవేశపెట్టారు.
లిన్నెయన్ జీవుల వర్గీకరణలో ఈ విధంగా ఏర్పడ్డ ఎనిమిది ప్రధాన క్రమానుగత స్థానాలలో క్రమం (లాటిన్: ఆర్డో) నాల్గవది. నామకరణ సంకేతాల ద్వారా గుర్తిస్తారు. క్రమం క్రింద నేరుగా కుటుంబం (ఉపక్రమం) ఉంటుంది. ఒక క్రమాన్ని సంబంధిత కుటుంబాల సమూహం(గ్రూప్)గా కూడా నిర్వచించవచ్చు.
భాషా విశేషాలు
[మార్చు]ప్రతిజీవిని ఏ క్రమానికి చెందినది, లేనిది వర్గీకరణ శాస్త్రవేత్త నిర్ణయిస్తారు. వర్గీకరణ శాస్త్రవేత్తలు ప్రతి ఒక్కరూ ఒక క్రమాన్ని వివరించడంలో లేదా గుర్తించడంలో అనుసరించాల్సిన నియమాలు లేవు. కొన్ని టాక్సాలు[గమనిక 1] విశ్వవ్యాప్తంగా ఆమోదించబడతాయి. మరికొన్నింటిలో అటువంటి ఆమోదం ఉండదు.[2]
ఒక క్రమం పేరు సాధారణంగా పెద్ద అక్షరంతో వ్రాస్తారు. కొన్ని జీవుల సమూహాలకు, స్థిరమైన నామకరణ నియమాలు అనుసరించవచ్చు. మొక్కలు, శిలీంధ్రాలు, ఆల్గేల క్రమం -ales (ఉదా. Dictyotales) అనే ప్రత్యయాన్ని ఉపయోగిస్తుంది. పక్షులు, చేపల క్రమానికి లాటిన్ ప్రత్యయం -iformes ను (అర్థం 'రూపం ఉంటుంది') ఉపయోగిస్తుంది. (ఉదా.Passeriformes). చాలావరకు కీటకాల క్రమం 'రెక్క' అనే ప్రత్యయం -ptera ను ఉపయోగిస్తుంది, కానీ క్షీరదాలు, సరీసృపాలు, ఉభయచరాలు, అకశేరుకాల క్రమం నామకరణ అంత స్థిరంగా ఉండదు (ఉదా. Artiodactyla, Anura, Crocodylia, Actiniaria, Primates).
శిలీంద్రాలు, శైవలాలు రెండు కలిపి ఒకటి ఒకటి సహజీవనంగా ఉంటూ లైకెన్లుగా ఏర్పడతాయి.[3]
లెగ్యుమినేసి జాతి మొక్కల వేర్లలో రైజోబియం అనే బాక్టీరియా సహజీవనం చేస్తూ నత్రజని స్థాపన చేస్తుంది. ఉదాహరణ:-వేరుశనగ.[4]

వర్గీకరణ, ర్యాంకులు
[మార్చు]ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జూలాజికల్ నామన్క్లే చర్ (నామకరణం) పరిధిలోకి వచ్చే కొన్ని క్లాడ్[గమనిక 2]ల కోసం, కొన్నిసార్లు అనేక అదనపు (అనధికార) వర్గీకరణలు ఉపయోగిస్తారు.
జంతుశాస్త్ర రంగంలో, లిన్నెయన్ ఆర్డర్‌లను మరింత స్థిరంగా ఉపయోగించాడు. ఈ జంతుశాస్త్ర భాగంలోని ఆర్డర్‌లు సహజ సమూహాలను సూచిస్తాయి. ఉదా. లెపిడోప్టెరా - చిమ్మెట (మాత్)లు, సీతాకోకచిలుకలు; డిప్టెరా - ఈగలు, దోమలు; సన్నదోమ, కొతిమెరపురుగు (మిడ్జెస్), మశకాలు (గ్నాట్).[5]
1991 నుండి 2017 వరకు, వర్గీకరణ వ్యవస్థలో వైరస్‌లను వర్గీకరించడానికి ఆర్డర్ (క్రమం నుండి జాతుల - species వరకు) అనేది అత్యున్నత ర్యాంక్. అయితే వైరస్ వర్గీకరణను పర్యవేక్షించే అంతర్జాతీయ వైరస్‌ల వర్గీకరణ కమిటీ (ICTV), 2018లో, అత్యున్నత వర్గీకరణ ర్యాంక్ వరకు క్రమం కంటే ఎక్కువ ర్యాంకులను (realm) జోడించింది. వైరస్ ఆర్డర్‌లను -వైరల్స్ అనే ప్రత్యయం ద్వారా సూచిస్తారు.[6][7]
కొన్ని ముఖ్యమైన క్రమాలు
[మార్చు]- ales ప్రత్యయంతో ఉన్న క్రమాలు - ఉదాహరణ
- ఆస్టరేలిస్ (Asterales)
- ఎబనేలిస్ (Ebenales)
- ఎరికేలిస్ (Ericales)
- కుకుర్బిటేలిస్ (Cucurbitales)
- జిరానియేలిస్ (Geraniales)
- జింజిబరేలిస్ (Zingiberales)
- జెన్షియనేలిస్ (Gentianales)
- పైపరేలిస్ (Piperales)
- ఫాబేలిస్ (Fabales)
- బ్రాసికేలిస్ (Brassicales)
- మాల్వేలిస్ (Malvales)
- మిర్టేలిస్ (Mirtales)
- లామియేలిస్ (Lamiales)
- సపిండేలిస్ (Sapindales)
- సొలనేలిస్ (Solanales)
మూలాలు
[మార్చు]- ↑ Linnaeus, C. (1735). Systemae Naturae, sive regna tria naturae, systematics proposita per classes, ordines, genera & species.
- ↑ Tobin, Allan J. (2005). Asking About Life. Boston: Cengage Learning. pp. 403–408. ISBN 978-0-030-27044-4.
- ↑ "10.1063/1.4831988.2". Default Digital Object Group. 2013-11-15. Retrieved 2025-12-17.
- ↑ "10.1063/1.4831988.2". Default Digital Object Group. 2013-11-15. Retrieved 2025-12-17.
- ↑ Carl von Linné, translated by William Turton (1806). Volume 2: Insects. A general system of nature: through the three grand kingdoms of animals, vegetables, and minerals, systematically divided into their several classes, orders, genera, species, and varieties. London: Lackington, Allen, and Co.
- ↑ International Committee on Taxonomy of Viruses Executive Committee (May 2020). "The New Scope of Virus Taxonomy: Partitioning the Virosphere Into 15 Hierarchical Ranks". Nat Microbiol. 5 (5): 668–674. doi:10.1038/s41564-020-0709-x. PMC 7186216. PMID 32341570.
- ↑ International Committee on Taxonomy of Viruses Executive Committee (May 2020). "The New Scope of Virus Taxonomy: Partitioning the Virosphere Into 15 Hierarchical Ranks". Nat Microbiol. 5 (5): 668–674. doi:10.1038/s41564-020-0709-x. PMC 7186216. PMID 32341570.
గమనిక
[మార్చు]- ↑ జీవశాస్త్రంలో, టాక్సన్ అంటే వర్గీకరణ శాస్త్రవేత్తలు ఒక సమూహం ఏర్పరచడానికి చూసే ఒక జీవి లేదా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ జీవులు జనాభా.
- ↑ జీవశాస్త్రంలో, క్లాడ్ జీవుల సహజ సమూహం అంటే సాధారణ పూర్వీకుడు, దాని వారసులందరితో కూడిన సమూహం.
ఇవి కూడా చూడండి
[మార్చు]- జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.