క్రికెట్ లో బెట్టింగ్ వివాదాలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

క్రికెట్ ఫైన జరుగు ఫిక్సింగ్ (ఫలితము ముందే నిర్ధారించుట) లలో ఆటగాళ్ళ ప్రమేయమునకు సంబంధించి చాలా వివాదములు ఉన్నాయి. ముఖ్యంగా ఆటకు సంబంధించిన వివిధ అంశాలైన (ఉ.హ.టాస్ వేయుట, మ్యాచ్ లను జారవిడుచుట, అంతర్గత సమాచారం బహిర్గతపరచుట, మొదలగు విషయాలకై బుకీలు పలువురు ఆటగాళ్ళను సంప్రదించి లంచం ఇవ్వజూపారు.

1999 -2000 భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ పై ఫిక్సింగ్ ఆరోపణ[మార్చు]

2000 సంవత్సరములో ఢిల్లీ పోలీసులకు పట్టుబడిన ఒక సంభాషణ ఆధారంగా అది నిషేధానికి గురైన ఒక బూకీకి, దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు కెప్టెన్ హాన్సిక్రానే మధ్య జరిగినదని, ఆటలో ఓడిపోవుటకు క్రానేఢిల్లీ లంచం తీసుకున్నాడని గ్రహించారు.[1][2] దక్షిణాఫ్రికా ప్రభుత్వం తమ ఆటగాళ్ళు భారత విచారణ బృందానికి సహకరించుటకు నిరాకరించినది. కోర్టులో విచారించినప్పుడు క్రానే కావాలనే మ్యాచ్ ను జారవిడిచినట్లు ఒప్పుకున్నాడు. వెంటనే అన్ని క్రికెట్ పోటీల నుంచి బహిష్కరణకు గురయ్యాడు. అతను సలీం మాలిక్ (పాకిస్తాన్, మొహమ్మద్ అజారుద్దీన్ (భారత్, అజయ్ జడేజా ([3] భారత్, మొదలగు వారి పేర్లను కూడా వెల్లడించాడు. జడేజా 4 సంవత్సరాలు బహిష్కరణకు గురయ్యాడు. మిగతావారు కూడా క్రికెట్ నుండి బహిష్కరణకు గురయ్యారు. ఈ బెట్టింగ్ లకు మూలకారకుడైన క్రానే దీనికి సంబంధించిన ఎన్నో చీకటి కోణాలను వెల్లడించాడు, అయినప్పటికీ 2002లో ఆయన హటాత్మరణంతో దీని మూలాలు న్యాయవ్యవస్థలో మరుగునపడిపోయాయి. ఈ ఫిక్సింగ్ ఉదంతంలో దక్షిణాఫ్రికాకు చెందిన హర్స్చేల్లె గిబ్బ్స్, నిక్కీ భోజ్ ఇద్దరు క్రికెటర్ర్లు కూడా ఢిల్లీ పోలీసుల దృష్టిలో అనుమానింపబడ్డారు.

ఇతర వివాదాలు[మార్చు]

ఈ ఫిక్సింగ్ ఆరోపణల ఉదంతంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు మార్క్ వా మరియు షేన్ వార్న్ లకు పిచ్ పరస్థితి, వాతావరణం మొదలగు వాటి సమాచారాన్ని జాన్ అను బూకీకి బహిర్గతం చేసినందులకు జరిమానా విదించింది.[4] క్రికెటర్లకు బూకీలతో ఉన్న సంబంధాల వలన కలుగు అపాయాలు, మోసాలు మొదలగువాటిని గురించిన సమాచారం తెలియనందున వా మరియు వార్న్ లకు జరిమానా మాత్రమే విధిస్తునట్లు, భవిష్యత్తులో ఆటగాళ్లు ఇలాంటి చర్యలకు పాలుపడినచో జరిమానాతో పాటు ఆట నుండి బహిష్కరింపబడతారని రాబ్ ఒరీగన్ క్యూసీ రిపోర్టు స్పష్టం చేసింది.[5]

ఎట్టకేలకు దీని పై ప్రతిస్పందనగా ఐసిసి 2000 సంవత్సరంలో లండన్ మెట్రోపాలిటన్ పోలీసు శాఖలో పనిచేసిన సర్ పౌల్ కందన్ అధ్యక్షుడుగా యాంటి-కారప్షన్ మరియు సెక్యూరిటీ యూనిట్ ను ఏర్పాటు చేసింది. దీని ఆధ్వర్యంలో క్రికెట్ లో లంచగొండితనం వీలయినంత తగ్గింది అని చెప్పవచ్చు.

2010 ఇంగ్లాండు, పాకిస్తాన్ పర్యటనలో జరిగిన 4 వ టెస్ట్ మ్యాచ్ లో మజహర్ మజీద్ మరియు మరికొందరు పాకిస్తాన్ ఆటగాళ్లు అప్పటికప్పుడు ఫిక్సింగ్ కు పాల్పడినట్లు ఇంగ్లీషు వార్తాపత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది.[6][7]

జనరంజక సంస్కృతిలో[మార్చు]

 • 2009 లో వచ్చిన కునాల్ ఖేము, బోమన్ ఇరాని, సోహా అలీఖాన్ మరియు సైరస్ బ్రోచా తదితరులు నటించిన 99 అనే హిందీ చిత్రం 1999 లో సంభవించిన భారత్ మరియు దక్షిణాఫ్రికా మ్యాచ్ ఫిక్సింగ్ ఆధారంగా రూపొందిచబడింది.
 • 2008 లో కునాల్ దేశ్ముఖ్ దర్శకత్వంలో ఇమ్రాన్ హష్మీ, సోనాల్ చౌహాన్ మరియు జావెద్ షేఖ్ తదితరులు నటించిన జన్నత్ హిందిచిత్రం కూడా మ్యాచ్ ఫిక్సింగ్ ఆధారంగా నిర్మింపబడింది.

వీటిని కూడా చూడండి[మార్చు]

 • మ్యాచ్ ఫిక్సింగ్ కొరకు నిషేధానికి గురైన క్రికెటర్ల జాబితా
 • పాకిస్తాన్ క్రికెట్ లో అప్పటికప్పుడు ఫిక్సింగ్ గురించిన వివాదం

సూచనలు[మార్చు]

 1. తనిఖీల అనంతరం పారిపోయిన ఇద్దరు క్రికెట్ బుకీలు
 2. ఇది ఒక క్రికెట్ మాత్రమే కాదు.
 3. బుకీ ఎం.కె.గుప్తా కొరకు అజారుద్దీన్ ఫిక్స్ చేసిన మ్యాచ్ లు.
 4. "Findings of the O'Regan Player Conduct Inquiry". February 24, 1999. Retrieved 2006-11-09. 
 5. "ACB Player Conduct Inquiry Report". Retrieved 2006-11-09. 
 6. "'Pak players were in touch with bookies during T20 WC'". 
 7. "Our team will throw two ODIs".