Jump to content

క్రిప్టోగాములు

వికీపీడియా నుండి
పాలీస్టిచమ్ సెటిఫెరం, ఒక ఫెర్న్
గ్రిమియా పుల్వినాటా, ఒక నాచు
పెల్వెటియా కనాలికులాటా, ఒక గోధుమ రంగు ఆల్గా
హైఫోలోమా ఫాసిక్యులేర్, ఒక శిలీంధ్రం

క్రిప్టోగాములు (క్రిప్టోగామ్స్) అనేవి విత్తనాల నుండి పుష్పించని లేదా పునరుత్పత్తి చేయని జీవుల సమూహం. దీని శాస్త్రీయ నామం క్రిప్టోగామే. విస్తృత అర్థంలో బహుళ కణ, కిరణజన్య సంయోగక్రియ, స్థిర స్థానంలో ఉండటం వంటి సారూప్య లక్షణాలున్న మొక్క లాంటి జీవి. ఇది పువ్వులు లేదా విత్తనాల ద్వారా కాకుండా బీజాంశాల (స్పోరుల) ద్వారా పునరుత్పత్తి చేస్తుంది.

ఈ జీవులలో శైవలాలు (ఆల్గే), శిలీంధ్రాలు, కొన్ని బ్యాక్టీరియా (సైనోబాక్టీరియా వంటివి) ఉండవచ్చు. అవి వివిధ జీవ రాజ్యాలకు ( Biological kingdom) చెందినవి కావచ్చు. ఒక సమూహం.

వర్గీకరణ

[మార్చు]

క్రిప్టోగామే అనే పేరు (పురాతన గ్రీకు పదాలు - κρύπτος, క్రుప్టోస్ 'దాచిన' γαμέω గమేయో 'వివాహం' అంటే "దాచిన పునరుత్పత్తి" ని సూచిస్తాయి. అంటే విత్తనాలు లేని మొక్కలు. అప్పుడప్పుడు వీటిని "థాల్లోఫైట్స్", "లోయర్ ప్లాంట్స్" "స్పోర్ ప్లాంట్స్" వంటి ఇతర పేర్లతో కూడా సూచిస్తారు.

క్రిప్టోగాములను ఫానేరోగామే లేదా విత్తన మొక్కలైన స్పెర్మాటోఫైటాతో జతచేసారు. ఒకానొకపుడు, మొక్కల రాజ్యంలో క్రిప్టోగాములను అధికారికంగా ఒక సమూహంగా గుర్తించారు. మొక్కలు, జంతువుల వర్గీకరణ కోసం రూపొందించిన వ్యవస్థలో కార్ల్ లిన్నెయస్ (1707–1778) మొక్కల రాజ్యాన్ని 24 తరగతులు విభజించారు, వాటిలో ఒకటి "క్రిప్టోగేమియా".[1] ఇందులో పునరుత్పత్తి అవయవాలు లోపలగా ఉన్న మొక్కలు అన్ని ఉన్నాయి. అతను క్రిప్టోగేమియాను నాలుగు వర్గాలుగా విభజించాడు అవి - ఆల్గే, ముస్సి (బ్రయోఫైట్స్), ఫిలిసెస్ (ఫెర్న్స్), శిలీంధ్రాలు, కానీ దీంట్లో బురద బూజులు, సైనోఫైటా కూడా ఉన్నాయి.[2][3] ఈ వర్గీకరణ ఇప్పుడు లిన్నెయన్ వర్గీకరణంలోకి కలిసింది. క్రిప్టోగాములను మూడు ఉప-రాజ్యాలుగా వర్గీకరించారు - థాల్లోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా.[3]

అయితే అన్ని క్రిప్టోగాములను మొక్కల రాజ్యంలో భాగంగా పరిగణించరు, ముఖ్యంగా శిలీంధ్రాలు ఒక ప్రత్యేక రాజ్యం, వీటికి మొక్కల కంటే జంతువులతో మరింత దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది, అయితే నీలం-ఆకుపచ్చ ఆల్గే జీవులు బ్యాక్టీరియా ఫైలమ్ కు చెందినవి. అందువల్ల, సమకాలీన మొక్కల వ్యవస్థలలో, "క్రిప్టోగాములు" అనేది వర్గీకరణపరంగా రూపొందిన సమూహం కాదు, కానీ పాలీఫైలెటిక్ (విభిన్న పరిణామ మూలాలు కలిగిన జీవుల సముదాయం). అయితే ఆల్గే, శిలీంధ్రాలు, మొక్కల పేర్లు అంతర్జాతీయ వృక్ష నామీకరణ నియమావళి (International Code of Nomenclature for algae, fungi, and plants) ద్వారా నియంత్రించబడతాయి.

ఆగస్ట్ డబ్ల్యూ. ఐక్లర్ (1839–1887) అభివృద్ధి చేసిన మొక్కల వర్గీకరణ ప్రకారం ప్రధానంగా - 1) (క్రిప్టోగామే = దాగి ఉన్న ప్రత్యుత్పత్తి అవయవాలు) పుష్పాలు లేని మొక్కలు; 2) కనిపించే ప్రత్యుత్పత్తి అవయవాలు అంటే పుష్పించే మొక్కలు (ఫానెరోగామే, = కనిపించే ప్రత్యుత్పత్తి).[4]

మానవ సంస్కృతిలో

[మార్చు]

ఒక ప్రచారంలో ఉన్న కథ ఏమంటే రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, బ్రిటిష్ ప్రభుత్వ కోడ్ సైఫర్ స్కూల్ వారు క్రిప్టోగామ్లలో, సముద్ర జీవశాస్త్ర నిపుణుడు అయిన 'జెఫ్రీ టాండీ' ని స్టేషన్ X, బ్లెచ్లీ పార్కుకు నియమించింది.[1][2][5] అయితే, ఈ కథ ఒక అపోహ అయినప్పటికీ టాండీ నిజంగా బ్లెచ్లీలో పనిచేశాడు. అయితే ఆ సమయంలో క్రిప్టోగ్రఫీ రంగం చాలా కొత్తది, అందువల్ల ఇతర రంగాలలో విద్య నైపుణ్యం ఉన్నవారిని నియమించడం జరిగేది.[6]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Dixon, P. S. (1973). Biology of the Rhodophyta. Oliver and Boyd, Edinburgh. ISBN 0-05-002485-X.
  2. 2.0 2.1 "Cryptogams". Royal Botanic Garden, Edinburgh. Archived from the original on 2007-11-18. Retrieved 2007-07-02.
  3. 3.0 3.1 Smith, Gilbert M. (1938). Cryptogamic Botany, Vol. 1. McGraw-Hill.
  4. Goldberg, Aaron (1986). "Classification, Evolution and Phylogeny of the Families of Dicotyledons". Smithsonian Contributions to Botany. 58 (58): 1–314. doi:10.5479/si.0081024X.58.
  5. Hanks, Robert (20 January 1999). "Television Review". The Independent.
  6. Knighton, Andrew (2018-05-27). "The Debunked Yet Interesting Myth About How Seaweed Apparently Helped Break the Enigma Code". warhistoryonline (in ఇంగ్లీష్). Retrieved 2024-05-13.